Jump to content

గోపాల కృష్ణ మఠం ఆదిలాబాద్

వికీపీడియా నుండి
శ్రీరామచంద్ర గోపాల కృష్ణ మఠం ఆదిలాబాద్
శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం
శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం
పేరు
ఇతర పేర్లు:గోపాలకృష్ణ మందిరం
ప్రధాన పేరు :గోపాల కృష్ణ మఠం- గోపాల కృష్ణ మందిరం
దేవనాగరి :దక్షిణ భారత నిర్మాణ శైలి
మరాఠీ:మరాఠీ
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వినాయక్ చౌక్ సమీపంలో
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వశిష్టుడు,
సాందీపని,
దత్తాత్రేయుడు,
దక్షిణామూర్తి,
శంకరాచార్యులు,
రామానుజాచార్యులు,
నర్మబాణాల
ప్రధాన దేవత:లక్ష్మీ,
సత్యభామ,
రుక్మిణి,
ఇతిహాసం
నిర్మాణ తేదీ:400 సంవత్సరాల చరిత్ర

శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ అర్బన్ మండలం లోని వినాయక్ చౌక్ సమీపంలో ఉంది.ఈ మఠాన్ని శ్రీ పూర్ణానంద సరస్వతీ అనే స్వామీజీ స్థాపించారు.ఈ మఠానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది[1][2].

చరిత్ర

[మార్చు]
ఆలయంలో దేవుడి విగ్రహం.

పూర్వం ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి పాదయాత్ర చేస్తు పూర్ణానంద సరస్వతీ అనే స్వామిజి వినాయక్ చౌక్ సమీపంలోని ఇప్పుడు ఆలయమున్న చోట ఒక వటవృక్షం కింద నిత్య అనుష్టాన జప తపాలు చేసినారని అంటారు. గోపాలకృష్ణ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో దేవభూమిగా పిలిచే ద్వారక నుంచి తేచ్చి కృష్ణ సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ పూర్ణానంద స్వామీజీ సత్యభామ రుక్మిణి సమేతంగా గోపాలకృష్ణ మందిరంలో గోపాలకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.వందల ఏళ్ళ చరిత్రను కలిగి ఉన్న అతి పురాతన ఆలయం ఇది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి దశనామీ సన్యాస పద్ధతి ప్రకారం ఈ మఠం సరస్వతీ సంప్రదాయానికి సంబంధించింది. పూర్ణానంద స్వామీజీ యోగ మఠం చేత ఈ మఠాన్ని స్థాపించడం జరిగింది.1956 బొంబాయి యాక్ట్ ప్రకారం దేవుడి భూమి పేరట రిజిస్టరు అయినట్టు రెవేన్యు రికార్డులో ఉన్నాయి.1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే దేవదాయ ధర్మాదాయ యాక్ట్ ప్రకారం 38 సెక్షన్ కింద ఆలయ రిజిస్ట్రేషన్ జరిగింది.

ఆలయ నిర్మాణం

[మార్చు]
శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం, వినాయక్ చౌక్ ఆదిలాబాద్ దృశ్యం

ఆలయం అతి ప్రాచీనమైనది.ఆలయ నిర్మాణం దక్షిణ భారతదేశ హిందూ దేవాలయ వాస్తుశిల్ప కళ ఉట్టి పడేలా అందంగా నిర్మించారు.ఈ మందిరం నిర్మాణం జరిగినప్పుడు ఆదిలాబాద్ పట్టణం లేదని పురాణాల వలన తెలుస్తుంది.ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఇది ఒకటి. దేవాలయాలు అందమైన శిల్పాలతో అద్భతంగా చేక్కబడి ఉన్నాయి.ఏకశిలా విగ్రహం ఒకే శిల పై రాముని పట్టాభిషేక దృశ్యం, ఆంజనేయ స్వామి రాముల వారి పాదాల దగ్గర సేవ చేస్తున్నట్టు చెక్కబడిన దృశ్యాలు గోచరిస్తాయి.1800 వ సంవత్సరంలో ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్ర చరిత్ర గ్రాంథ లంలో ఆదిలాబాద్ గోపాల కృష్ణ మఠం గురించి ఆధారాలున్నాయి తెలుస్తుంది.మహారాష్ట్ర చంద్ర పూర్కు చేందిన నికోలస్ మహారాజ్ పుస్తకంలో కూడా గోపాలకృష్ణ మఠం ప్రస్తావన ఉందని ఆధారాలున్నాయి. 1932 లో గోపాల కృష్ణ తొలి పీఠాధిపతి శ్రీ పూర్ణానంద సరస్వతీ స్వామి పేరుతో భజన పుస్తకం ముద్రించబడి ఉంది.ఆలయ భుములు ఆక్రమణకు గురి అవ్వడంతో ప్రస్తుతమున్న భూమిని రక్షించడం జరుగుతున్నది.

పీఠాధిపతులు

[మార్చు]

శ్రీరామచంద్ర గోపాల కృష్ణ మఠంలో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది స్వాములు పరంపరగా పీఠాధిపతులు బాధ్యతలు తీసుకోని తమ కర్తవ్యాలను నిర్వహించారు.తొలి పీఠాధిపతిగా శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆలయంలోనే జీవ సమాధి అయినారు. 2000 సంవత్సరం నుండి ఆలయ పీఠాధిపతిగా శ్రీ యోగానంద సరస్వతీ స్వామి పదవ స్వామీజీగా సన్యాసాన్ని స్వీకరించి నిర్విఘ్నంగా నిర్వహిస్తూన్నారు.

ఉత్సవాలు

[మార్చు]

ఆలయంలో శ్రీకృష్ణ జన్మష్టమి ఘనంగా జరుగును. కార్తీకమాసంలో నెల రోజులు కాకడ హారతి కాలా నిర్వహణా విశేషంగా నిర్వహిస్తారు. పాండురంగ, రుక్మిణి ఉత్సవాలు, శ్రీరామనవమి రోజున శ్రీసీతారాముని కల్యాణ్ మహోత్సవం, శివ దీక్షలు, వరలక్మీ ప్రాంతాలు, తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు [3], శంకరాచార్య జయింతి, ఆలయంలో రథోత్సవం పదిహేను రోజులు జరుగుతుంది. అమావాస్య తర్వాత అశ్వవాహన, గజవాహన, హనుమత్ వాహన, గరుడవాహనాల్ని చిన్న రథం పై ఊరేగిస్తారు.

జాతర

[మార్చు]

శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం తొలి మఠాధిపతి శ్రీ శ్రీశ్రీ పూర్ణానంద సరస్వతి స్వమి పుణ్య తిథిని పురష్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ నేలలో ఐదు రోజుల పాటు శ్రీమహాలక్ష్మీ దేవి పూజలు చేసి అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఆలయం వద్ద జాతర[4] ఉత్సవాలు రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ[1].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Gopala Krishna Matham". SIRA NEWS. Retrieved 2024-07-01.
  2. "Adilabad mutt wakes up to realty!". The Hindu (in Indian English). 2014-09-26. ISSN 0971-751X. Retrieved 2024-07-01.
  3. Today, Telangana (2023-03-22). "Ugadi festival celebrated on colorful note in erstwhile Adilabad". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-01.
  4. "వందల ఏళ్ల నాటి పురాతన మఠం.. ఇక్కడ జరిగే జాతర ఎంతో వైభవం." News18 తెలుగు. 2023-12-19. Retrieved 2024-07-01.