గోపీచంద్ లగడపాటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపీచంద్ లగడపాటి
జననం (1981-07-16) 1981 జూలై 16 (వయసు 42)
హైదరాబాద్ , ఆంధ్రప్రదేశ్,ఇండియాIndia
ప్రసిద్ధిసినిమాలు
మతంహిందూమతం
వెబ్‌సైటు
gopichandlagadapati.com www.gopichandlagadapati.com]

గోపీచంద్ లగడపాటి (English: Gopichand Lagadapati) [1] సిని నటుడు, నిర్మాత, దర్శకుడు ఇంకా రచయిత . లగడపాటి తెలుగు చిత్రం ఆనంద్ తో సినిమా రంగప్రవేశం చేసారు .తర్వాత మిస్టర్ మేధావి సినిమాను ఆయన తాతగారితో కలిసి నిర్మించారు.

మునుపటి జీవితం[మార్చు]

గోపీచంద్ లగడపాటి 1981 జూలై 16, లగడపాటి సంగయ్య, రమాదేవి దంపతులకు జన్మించారు.[2] లగడపాటి తల్లిగారి తండ్రి శ్రీ రామారావు బొద్దులూరి సిని నిర్మాతగానే గాక ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా కూడా ఉన్నారు. గోపీచంద్ హోటల్ మేనేజ్మెంట్ నుండి డిగ్రీ చేసారు.

వృత్తి[మార్చు]

గోపీచంద్ లగడపాటి [3] మొట్టమొదటిగా ప్రియనేస్తం అనే తెలుగు ధారావాహికంలో నటిచారు.ఇది జెమినీ టెలివిజన్లో 2000 సంవత్సరంలో ప్రసారం అయ్యింది . తర్వాత గోపీచంద్ లగడపాటి ప్రేమించి చూడు అనే సినిమాకు దర్శకత్వ శాకలో పనిచేసారు. కొంత కాలం చదువుల కొరకు సినిమాకు దూరంగా ఉన్న గోపీచంద్ మరల తన చదువులు పూర్తైన తర్వాత యాద్రుచికంగా తన స్నేహితుల ద్వారా శేఖర్ కమ్ములను కలుసుకున్నారు.ఆ విధంగా ఆనంద్ తో నటుడిగా సిని రంగ ప్రవేశం చేసారు. ఆనంద్ సినిమా తదుపరి, రెండేళ్ళ తరువాత అనే చిత్రంలో మరొక ఇద్దరితో కలిసి కథానాయకునిగా నటించారు. ఈ చిత్రం 2005 జూలైలో విడుదలయ్యింది . ఈ చిత్రం విడుదల వరకు అంచనాలు ఉన్నప్పటికీ జనాలకు చేరువవడంలో విఫలం అయ్యింది . తరువాత గోపీచంద్ ఇండియన్ బ్యూటీ అనే చిత్రంలో ప్రతి నాయకుని పాత్రలో నటించారు.ఈ చిత్రం కూడా జనాలకు చేరువవడంలో విఫలం అయ్యింది .ఈ చిత్రం 2006వ సంవత్సరంలో విడుదల అయ్యింది . గోపీచంద్ తదుపరి చిత్రం ఆన్ ది అదర్ సైడ్ అనే ఇంగ్లీష్ సినిమాలో. ఈ చిత్రంలో కూడా గోపీచంద్ ప్రతినాయకుని పాత్రలోనే నటించారు. ఇది 2007వ సంవత్సరంలో అమెరికాలో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను హార్లం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నుండి ఉత్తమ చిత్రంగా 2007 సంవత్సరానికి గాను ఎంపికయ్యింది. గోపీచంద్ లగడపాటి 2007 లో తన తాత గారితో కలిసి మిస్టర్ మేధావి అనే చిత్రాన్ని నిర్మించారు . దీనికి ఆయన ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. .ఈ చిత్రం తర్వాత గోపీచంద్ హాలీవుడ్ సినిమా భోపాల్ : ఎ ప్రేయర్ ఫర్ రైన్ అనే చిత్రంలో దర్శకత్వశాఖలో ప్రముఖ హాలీవుడ్ నటులైన మార్టిన్ షీన్, మిస్చా బార్టన్, కాల్పెన్, తదితరులతో కలిసి పనిచేసారు. ఈ చిత్రం ఇంకా విడుదల కావలసి ఉంది.గోపీచంద్ లగడపాటి జంజీర్ అనే హిందీ సినిమాలో కూడా దర్శకత్వ శాఖలో పనిచేసారు.ఇది తెలుగులో తూఫాన్ అనే పేరుతో విడుదల అయ్యింది. గోపీచంద్ లగడపాటి సినిమాలోనే కాక పలు జాతీయ అంతర్జాతీయ లఘు చిత్రాలు, ప్రకటనలకు రచయితగా ఇంకా సహాయ దర్శకుడుగా ; పని చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా పనిచేసారు.

2004లో ఆనంద్ సినిమా

చిత్ర వివరములు[మార్చు]

  1. ప్రియనేస్తం ( 2000 ) - ధారావాహికం - నటుడు
  2. ప్రేమించి చూడు (2001) - సినిమా - సహాయ దర్శకుడు
  3. ఆనంద్ (2004) - సినిమా - నటుడు
  4. సిటీ బీట్స్ (2004 ) -డైలీ - దర్శకుడు
  5. రెండేళ్ళ తర్వాత (2005) - సినిమా - నటుడు
  6. ఇండియన్ బ్యూటీ (2006) - సినిమా - నటుడు
  7. ఆన్ ది అదర్ సైడ్ (2007) - సినిమా - నటుడు
  8. మిస్టర్ మేధావి (2008) - సినిమా - సహ నిర్మాత
  9. అడ్వెంచర్స్ ఇన్ ఒడిస్సీ (2010 ) - ధారావాహికం- సహాయ దర్శకుడు
  10. యొప్లైత్ (2010) -ప్రకటన -సహాయ దర్శకుడు
  11. డెత్ (2011) -లఘు చిత్రం -సహాయ దర్శకుడు, నటుడు
  12. జంజీర్ (2013) -సినిమా - సహాయ దర్శకుడు
  13. తూఫాన్ (2013) -సినిమా - సహాయ దర్శకుడు
  14. భోపాల్ : ఎ ప్రేయర్ ఫర్ రైన్ ( 2014) -సినిమా - సహాయ దర్శకుడు, నటుడు

మూలాలు[మార్చు]

  1. "గోపీచంద్ లగడపాటి గురించి క్లుప్తంగా మూవీ బఫ్ఫ్లో". Archived from the original on 2014-02-26. Retrieved 2014-05-25.
  2. "పుట్టిన రోజు వివరములు ఫేమస్ బర్తడేస్లో చూడండి". Archived from the original on 2014-02-20. Retrieved 2014-05-25.
  3. "లగడపాటి చిన్ని చరిత్ర ను రాటెన్ టమాటొస్లో చదవండి".

బాహ్య సమాచార లంకె[మార్చు]