Jump to content

గోమాస శ్రీనివాస్

వికీపీడియా నుండి
గోమాస శ్రీనివాస్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1969 అక్టోబర్ 15
మంచిర్యాల, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (1993 - 2024), టీఆర్ఎస్
తల్లిదండ్రులు రాజయ్య, మల్లు భాయ్
జీవిత భాగస్వామి గీత
సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
నివాసం మంచిర్యాల

గోమాస శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

గోమాస శ్రీనివాస్ విద్యార్థి దశలో 1982 నుండి 1992 వరకు విద్యార్థి నాయకుడిగా పని చేసి రాజకీయ పట్ల ఆసక్తితో 1993లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం టికెట్ ఆశించగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుండి లోక్‌సభకు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు.

గోమాస శ్రీనివాస్ ఆ తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 March 2024). "బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  2. A. B. P. Desam (13 March 2024). "బీజేపీ రెండో జాబితాలో ఆరుగురు తెలంగాణ అభ్యర్థులు - డీకే అరుణకే చాన్స్ !". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  3. Andhrajyothy (11 March 2024). "బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కారులోంచి కమలంలోకి." Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.