అక్షాంశ రేఖాంశాలు: 16°03′47″N 80°13′02″E / 16.062975°N 80.217174°E / 16.062975; 80.217174

గోరంట్లవారిపాలెం (పెదనందిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొరంట్లవారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గొరంట్లవారి పాలెం is located in Andhra Pradesh
గొరంట్లవారి పాలెం
గొరంట్లవారి పాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°03′47″N 80°13′02″E / 16.062975°N 80.217174°E / 16.062975; 80.217174
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదనందిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గోరంట్లవారిపాలెం గ్రామం పాక్షికంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామ పంచాయతీలో, 2 వార్డులు 500 మంది ఓటర్లూ ఉన్నారు. గ్రామంలో సగభాగం ఉప్పలపాడు గ్రామపంచాయతీలో, పెదనందిపాడు మండలంలో, గుంటూరు శాసనసభా పరిధిలోనూ, గుంటూరు పార్లమెంటు పరిధిలోకీ వస్తుంది. మిగతా సగభాగం, చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు గ్రామ పంచాయతీలో ఉంది. ఇది నరసరావుపేట శాసనసభ పరిధిలోకీ, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోకీ వస్తుంది.

విశేషాలు

[మార్చు]
  • ఈ వూరివారయిన చిన్నకారు రైతు సయ్యద్ సుబానీ స్వయం కృషితో రూపొందించిన బూమ్ స్ప్రేయర్ (ట్రాక్టర్ తో పురుగుమందు వెదజల్లే కొత్తరకం పరికరం) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదయినది. ఈ పరికరంతో ఒక ఎకరాకు 5 నిమిషాలలో పురుగు మందు చల్లవచ్చు. అతితక్కువ ఖర్చు (రు. 6, 000) తో, సోలార్ బూం స్ప్రేయర్ రూపకల్పన చేసాడు. అన్ని పైర్లకూ రసాయన ఎరువులు పిచికారీ చేసేవిధంగా దీనిని తయారు చేసాడు. వాతావరణంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉంటే ఇది పనిచేస్తుంది. దీనితో రోజుకి 10 ఎకరాల మందు జల్లుకోవచ్చు. ఈ స్ప్రేయర్ వాడటం వలన, ఒక ఎకరానికి 50 రూ. మాత్రమే ఖర్చు అవుతుంది.
  • 300 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో వేసవిలో గూడా నీటి ఎద్దడి లేదు. పైగా చుట్టుప్రక్కల పది గ్రామాలవారికి వీరు జలదానం చేస్తున్నారు. దీనికి కారణం ఈ గ్రామంలోని ఒక చెరువు. మొదట ఒక కుంటగా ఏర్పాటయిన ఇది, కాలక్రమేణా గ్రామస్థుల కృషితో 8 ఎకరాల విస్తీర్ణం గల ఒక చెరువుగా రూపుదిద్దుకుంది. గ్రామస్థులంతా వర్షపునీటిని ఒడిసిపట్టి, ఒకచోటికిచేర్చి, నిలువ చేస్తారు. దీనితో భూగర్భ జల పెంపుదలకే గాకుండా, తాగునీటి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.

మూలాలు

[మార్చు]