Jump to content

చర్చ:గోరంట్లవారిపాలెం (పెదనందిపాడు)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.


సమాచారం తప్పనిపిస్తోంది

[మార్చు]

గోరంట్లవారిపాలెం గ్రామం పాక్షికంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం లోకి వస్తుంది. ఈ గ్రామ పంచాయతీలో, 2 వార్డులూ, 500 మంది ఓటర్లూ ఉన్నారు. గ్రామంలో సగభాగం ఉప్పలపాడు గ్రామపంచాయతీలో, పెదనందిపాడు మండలంలో, గుంటూరు శాసనసభా పరిధిలోనూ, గుంటూరు పార్లమెంటు పరిధిలోకీ వస్తుంది. మిగతా సగభాగం, గొట్టిపాడు గ్రామ పంచాయతీలో, చిలకలూరిపేట మండలంలో, నరసరావుపేట శాసనసభ పరిధిలోకీ, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోకీ వస్తుంది.

ఈ వూరివారయిన చిన్నకారు రైతు శ్రీ సయ్యద్ సుబానీ స్వయం కృషితో రూపొందించిన బూమ్ స్ప్రేయర్ (ట్రాక్టర్ తో పురుగుమందు వెదజల్లే కొత్తరకం పరికరం) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదయినది. ఈ పరికరంతో ఒక ఎకరాకు 5 నిమిషాలలో పురుగు మందు చల్లవచ్చు.

ఈ గ్రామానికి చెందిన రైతు శ్రీ సయ్యద్ సుబానీ, అతితక్కువ ఖర్చు (రు. 6, 000) తో, సోలార్ బూం స్ప్రేయర్ రూపకల్పన చేశారు. అన్ని పైర్లకూ రసాయన ఎరువులు పిచికారీ చేసేవిధంగా దీనిని తయారు చేశారు. వాతావరణంలో ఉష్ణోగ్రత 25డిగ్రీల సెల్సియస్ ఉంటే ఇది పనిచేస్తుంది. దీనితో రోజుకి 10 ఎకరాల మందు జల్లుకోవచ్చు. ఈ స్ప్రేయర్ వాడటం వలన, ఒక యెకరానికి 50 రూ. మాత్రమే ఖర్చు అవుతుంది.

పై సమాచారమంతా నాగభైరువారి పాలెం పేజీలో కూడా రాసారు. అంతర్జాలంలో వెతికితే ఈ సయ్యద్ సుభానీ గారు నాగభైరుపాలేనికి చెందినట్లుగా రూఢి అయింది. పైగా ఈ రెండు గ్రామాలూ కూడా ఒక్కొక్కటీ రెండేసి మండలాల పరిధి లోకి వస్తాయని ఆయా పేజీలు చెబుతున్నాయి. అది అంత నమ్మశక్యంగా లేదు. అంచేత గోరంట్లవారిపాలెం (పెదనందిపాడు) అనే గ్రామం లేదేమోనని నాకు తోస్తోంది. నిర్ధారించుకున్నాక తగు చర్యలు తీసుకోవాలి.__చదువరి (చర్చరచనలు) 08:53, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]