గోళాకార దర్పణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాంతి కిరణాలను అభికేంద్రమయేటట్లు లేదా కేంద్రాపగమనం చెందేటట్లు సమతల దర్పణాలు చేయలేవు ఇందుకు గోళాకార దర్పణాలు ఉపయోగపడతాయి. దర్పణతలము గోళం యొక్క భాగమైతే దానిని గోళాకార దర్పణం అంటారు. తలం యొక్క మధ్య బిందువు దర్పణ ధ్రువము ; గోళకేంద్రము, గోళాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రము, గోళ వ్యాసార్ద్ధం దర్పణ ం యొక్క వక్రతా వ్యాసార్ద్ధం . వక్రతా కేంద్రము, ధ్రువాల లోంచి పోయే సరళ రేఖను ప్రధానాక్షమని అంటారు. గోళాకారదర్పణానికి గల వ్రుత్తాకారపు అంచు యొక్క వ్యాసాన్ని ద్వారము (aperture) అంటారు. గోళం పుటాకారతలం కాంతి కిరణాలను పరావర్తనం చేస్తే దర్పణాన్ని పుటాకార దర్పణం అని, కుంభాకార తలం పరావర్తనం చేస్తే దానిని కుంభాకార దర్పణం అని అంటారు.[1]

పుటాకార దర్పణం
కుంభాకార దర్పణం

ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండే కాంతి కిరణ పుంజం పుటాకార దర్పణం మీద పడి పరావర్తనం చెందినప్పుడు పరావర్తన కిరణాలు ప్రధానాక్షం మీద కల బిందువు వద్దకు అభికేంద్రమవుతాయి. కుంభాకార దర్పణం మీద పడి పరావర్తనం చెందే సమాంతర కిరణ పుంజం ప్రధానాక్షం మీద గల బిందువు నుండి కేంద్రాపగమనం చెందుతున్నట్లు కనిపిస్తాయి. ఆ బిందువుని ప్రధాననాభి అంటారు. దర్పణ ధ్రువానికి, ప్రధాననాభికి గల దూరాన్ని నాభ్యంతరం అంటారు.

గోళాకార దర్పణాల ఉపయోగాలు

[మార్చు]

పుటాకార దర్పణాలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 1) ఒక మీటరు వ్యాసార్ధము, ఒక మీటరు ద్వారము వున్న వాటిని సూర్యరశ్మిని కేంద్రీకరించి వస్తువులను వేడిచేయవచ్చు. 2) పరవలయ దర్పణాన్ని కాని పుటాకార దర్పణాన్ని కాని దూరదర్శినులలో కటకాలకు బదులు వాడవచ్చు. 3) పుటాకార దర్పణానికి మధ్య రంధ్రం చేసి దాని సాయంతో కన్ను, గొంతు, చెవి లను పరీక్షలు చేయవచ్చు. దీనినే ఆప్తాల్మాస్కోప్ (opthalmoscope) అంటారు. 4) పుటాకార దర్పణానికి దగ్గరగా వస్తువు ఉన్నప్పుడు నిలువుగా, వృద్ధి చెందిన మిధ్యా ప్రతిబింబం ఏర్పడటం వల్ల ఎక్కువ వ్యాసార్ధమున్న పుటాకార కటకాన్ని గడ్డం గీసుకునేటప్పుడు వాడతారు. 5) టార్చ్ లైట్లు, మోటార్ కార్ దీపాలు, సెర్చ్ లైట్లు వంటివి వాటిలోపుటాకార దర్పణాలు కాని, పరవలయ దర్పణాలు కాని వాడతారు. 6) కారులో డ్రైవర్ పక్కన కుంభాకార దర్పణం ఉంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం- భౌతిక శాస్త్రం పాఠ్య పుస్తకం

బయట లంకెలు

[మార్చు]