Jump to content

గోవర్ధన్ శర్మ

వికీపీడియా నుండి
గోవర్ధన్ శర్మ

పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి & మత్స్య శాఖ మంత్రి
పదవీ కాలం
జూన్ 1995 – 7 మే 1998

పదవీ కాలం
2009 – 2023
ముందు నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది
నియోజకవర్గం అకోలా వెస్ట్
పదవీ కాలం
1995 – 2009
ముందు అరుణ్ దివేకర్
తరువాత నియోజకవర్గం రద్దయింది
నియోజకవర్గం అకోలా

వ్యక్తిగత వివరాలు

జననం (1949-01-02)1949 జనవరి 2
పుసాద్ , యవత్మాల్ , సెంట్రల్ ప్రావిన్సులు & బెరార్ , భారతదేశం
మరణం 2023 నవంబరు 3(2023-11-03) (వయసు 74)
అకోలా , మహారాష్ట్ర , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మంగీలాల్ శర్మ
జీవిత భాగస్వామి గంగాదేవి
వృత్తి రాజకీయ నాయకుడు

గోవర్ధన్ మంగీలాల్ శర్మ (2 జనవరి 1949 - 3 నవంబర్ 2023) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి & మత్స్య శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గోవర్ధన్ శర్మ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 శాసనసభ ఎన్నికలలో అకోలా నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999, 2004 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. గోవర్ధన్ శర్మ 2004 ఎన్నికల తరువాత అకోలా నియోజకవర్గం రద్దయిన తరువాత ఆయన నూతనంగా ఏర్పడిన అకోలా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 2009,[1] 2014,[2] 2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

గోవర్ధన్ శర్మ జూన్ 1995 నుండి 7 మే 1998 వరకు ముఖ్యమంత్రి మనోహర్ జోషి మంత్రివర్గంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి & మత్స్య శాఖ మంత్రిగా పని చేశాడు.

మరణం

[మార్చు]

గోవర్ధన్ శర్మ 2023 నవంబర్ 3న క్యాన్సర్‌తో బాధపడుతూ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు. ఆయనకు భార్య గంగాదేవి శర్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. "Maharashtra polls: Despite close battle in last election where winning margin was less than 5,000 votes, parties renominate sitting MLAs". The Times of India. 26 October 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  4. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. "Govardhan Sharma Passed Away : सच्चा रामभक्त गमावला, आमदार गोवर्धन शर्मा यांचं निधन". ETV Bharat News. 3 November 2023. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  6. "BJP MLA Govardhan Sharma passes away at 74 in Akola" (in ఇంగ్లీష్). The Week. 3 November 2023. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  7. Times Now Marathi (3 November 2023). "MLA Govardhan Sharma: सर्वसामान्यांचा नेता हरपला, भाजपचे आमदार गोवर्धन शर्मा यांचं निधन". Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.