గోవాల్ కగడ పదవి
స్వరూపం
గోవాల్ కగడ పదవి | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | హీనా గవిత్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నందుర్బార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1992 నందుర్బార్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | కాగ్డా చండియా పద్వి | ||
నివాసం | నందుర్బార్, మహారాష్ట్ర | ||
పూర్వ విద్యార్థి | ఎల్‌ఎల్‌బీ | ||
వృత్తి | వైద్యురాలు, రాజకీయ నాయకుడు |
గోవాల్ కగడ పదవి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నందుర్బార్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]గోవాల్ ఆగస్టు 1992లో జన్మించాడు. ఆయన 2015లో ముంబై యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, 2017లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి బాంబే హైకోర్టులో న్యాయవాదిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గోవాల్ కగడ పదవి తన తండ్రి కాగ్డా చండియా పద్వి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నందుర్బార్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హీనా గవిత్‌పై 159120 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా 18వ లోక్‌సభలో అడుగుపెట్టాడు. కాంగ్రెస్ అభ్యర్థి గోవాల్ కగడ పదవికి 7,45,998 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి హీనా గవిత్‌కు 5,86,878 ఓట్లు వచ్చాయి.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ TimelineDaily (4 June 2024). "Congress' Gowal K Padavi Wins From Nandurbar Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nandurbar". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.