హీనా గవిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. హీనా గవిత్‌

పదవీ కాలం
16 మే 2014 – 4 జూన్ 2024
ముందు మాణిక్‌రావు హోడ్‌ల్యా గవిత్
తరువాత గోవాల్ కగడ పదవి
నియోజకవర్గం నందుర్బార్

వ్యక్తిగత వివరాలు

జననం (1987-06-28) 1987 జూన్ 28 (వయసు 37)
నందుర్బార్
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ప్లాట్ నెం.6, వైరల్ విహార్ కాలనీ, ఖోడై మాతా రోడ్, నందుర్బార్

మహారాష్ట్ర

పూర్వ విద్యార్థి ఎంబీబీఎస్
ఎం.డి జనరల్ మెడిసిన్
ఎల్‌ఎల్‌బీ
వృత్తి వైద్యురాలు,[1] రాజకీయ నాయకురాలు

హీనా గవిత్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నందుర్బార్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైంది.[2][3] ఆమె ప్రస్తుతం బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేస్తుంది.

రాజకీయ జీవితం

[మార్చు]

హీనా గవిత్ తన తండ్రి విజయ్‌కుమార్‌ గవిత్ అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నందుర్బార్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన మాణిక్‌రావు హోడ్‌ల్యా గవిత్‌పై 1,06,905 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచి 16వ లోక్‌సభలో అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా ఉంది.[4] ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కాగ్డా. సి.పదవిపై 95,629 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎంపీగా గెలిచి పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ  చైర్‌పర్సన్‌గా పని చేసింది.[5]

హీనా గవిత్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నందుర్బార్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గోవాల్ కగడ పదవి చేతిలో 159120 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి గోవాల్ కగడ పదవికి 7,45,998 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి హీనా గవిత్‌కు 5,86,878 ఓట్లు వచ్చాయి.[6]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (21 October 2016). "Maharashtra's doctor MP Heena Gavit skipped rural stint". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. The Economic Times (17 May 2014). "Lok Sabha gets 29 new entrants from Maharashtra". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  3. The Times of India (24 May 2019). "Maharashtra election results: Heena Gavit retains Nandurbar seat". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  4. India Today (2 June 2014). "Nandurbar MP Heena Gavit of BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  5. NT News (14 September 2021). "మహిళా సాధికారతలో తెలంగాణ భేష్‌: పార్లమెంటరీ కమిటీ". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nandurbar". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.