గ్రాండ్ హయత్
గ్రాండ్ హయత్ ముంబయి అనేది విలాసవంతమైన 5 స్టార్ హోటల్. ఇది భారతదేశంలోని, ముంబయి నగరంలో గల తూర్పు సాంటాక్రూజ్ ప్రాంతంలో వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ రహదారి పక్కన ఉంటుంది. దీనిని చికాగోకు చెందిన లోహన్ అసోసియేట్స్ డిజైన చేసింది. గ్రాండ్ హయత్[1] ముంబయి హోటల్ 2004లో ప్రారంభమైంది. విదేశీ అతిధులతో పాటు వ్యాపారవేత్తలకోసం ఏర్పాటై ముంబయిలో ఉన్న అతి విలాసవంతమైన హోటళ్లలో గ్రాండ్ హయత్ ఒకటి.
విషయ సూచిక
[మార్చు]- 1 చిరునామా
- 2 సౌకర్యాలు-సదుపాయలు
- 3 ఈవెంట్లు
- 4 బయటి లింకులు
- 5 మూలాలు
చిరునామా
[మార్చు]ముంబయి నగరానికి గుండెకాయలాంటి సాంటాక్రుజ్ లోని వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ వే పక్కన గ్రాండ్ హయత్ స్థాపించబడింది. ప్రధాన వ్యాపార కేంద్రాలైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ, అమెరికన్ కన్సులేట్ వంటివెన్నో ఈ హోటలకు సమీపంలోనే ఉన్నాయి. ఈ హోటల్ కు దగ్గరలో అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఇక్కడికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో బాండ్ స్టాండ్, మౌంట్ మేరీ చర్చ్, జోగర్స్ పార్క్ ఉన్నాయి. జుహు బీచ్ కూడా హోటల్ కు అతి దగ్గరగా ఉంటుంది.
- అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోటల్ కు దూరం: సుమారు 9 కి.మీ.
- దేశీయ విమానాశ్రయం నుంచి హోటల్ కు దూరం: సుమారు 4 కి.మీ.
- సి.ఎస్.టి. రైల్వే స్టేషన్ నుంచి హోటల్ కు దూరం: సుమారు 17 కి.మీ.
- ముంబయి సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి హోటల్ కు దూరం: సుమారు 17 కి.మీ.
సదుపాయాలు-సౌకర్యాలు
[మార్చు]5- స్టార్ సౌకర్యాలు గల ఈ హోటల్ విలాసానికే కాకుండా, విశ్రాంతి తీసుకునే పర్యాటకులకు, వ్యాపార కార్యకలాపలకు గ్రాండ్ హయత్ హోటల్ ఎంతో అనువుగా ఉంటుంది. గ్రాండ్ హయత్ ముంబయి హోటల్లో మొత్తం 547 గదులు, 147 సర్వీసు అపార్టుమెంట్లు ఉన్నాయి. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటల్ ను నిర్మించారు.[2] 30,000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాంకెట్ హాల్ ఉంది. 1300 మంది అతిథులు ఇక్కడ ఒకేసారి సమావేశం కావచ్చు. అదేవిధంగా 2,790 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పూర్తి స్థాయి అత్యున్నత అధునాతన సదుపాయాలతో కూడిన బాల్ రూమ్స్ సహా, కాన్ఫరెన్స్, సమావేశ మందిరం ఉన్నాయి. అంతేకాదు దీనిలో ప్రత్యేకమైన నాలుగు రెస్టారెంట్లు — చైనా హౌజ్, సిలినీ, సోమా, ఫిఫ్టీ ఫైవ్ ఈస్ట్ పేరుతో ఉన్నాయి. ఈ రెస్టారెంట్లలో భారతీయ, అంతర్జాతీయ ఆహార పదార్థాలు లభిస్తాయి. అంతే కాకుండాఒక బార్, లాంజ్ లు, గౌర్ మెట్ స్టోర్, ఫిట్ నెస్ సెంటర్,, బ్యూటీ సెలూన్ వంటివి హోటల్లోపలి మల్టీ లేవల్ షాపింగ్ ప్లాజాలో ఉన్నాయి. గ్రాండ్ హయత్ ముంబయి హోటల్లో గ్రాండ్ క్లబ్, క్లబ్ ఓయాసిస్ స్పా, పూల్ ఏరియా,, నివాసాల కోసం బార్ బే క్యూ, చిన్న పిల్లల ఆట స్థలం, వ్యాపార కేంద్ర, అవుట్ డోర్ రిసెప్షన్ సౌకర్యం, వికలాంగులైన అతిధుల కోసం, ఒంటరిగా వచ్చే మహిళా పర్యాటకుల కోసం విడివిడిగా ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. భారతదేశంలోనే అతి పెద్ద కళాఖండాల ప్రదర్శన కోసం పబ్లిక్ స్థలం ఉన్న హోటల్ గా ఇది గుర్తింపు పొందింది. ఇక్కడి షో కేసుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వర్ధమాన కళాకారులు రూపొందించిన 100 కు పైగా కళాఖండాలు చూపరులను ఎంతో ఆకట్టుకుంటాయి. విశ్రాంతి కోరుకునే అతిథుల కోసం ఫిట్ నెస్ సెంటర్, స్పాతో పాటు సుడిగుండాల స్నానం, స్విమ్మింగ్ పూల్, బీచ్ వాలిబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, 100 మీటర్ల జాగింగ్ ట్రాక్, చిన్న పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. దీనిలో ఇన్ హౌస్ రెస్టారెంట్ చైనా హౌస్ అనేది చైనీస్ వంటలకు ప్రఖ్యాతి గాంచింది.గ్రాండ్ హయత్ వివిధ రకాల గదులను అథితుల కోసం అందిస్తోంది. వీటిలో గ్రాండ్ ఎక్జిక్యూటివ్, డిప్లామాటిక్ సూట్లు, ప్రెసిడెన్షియల్ సూట్లు ఉన్నాయి. ప్రతి గది కూడా ఎంతో అనుకూలంగా, ప్రపంచశ్రేణి ఇంటీరియర్ తో డిజైన్ చేయబడి ఉంటాయి. ప్రతి గదిలోనూ 40 అంగులాల ఎల్.సి.డి. టీవీ, డైరెక్ట్ డైలింగ్ సౌకర్యం, కేబుల్/ఉప గ్రహ కనెక్షన్, హై స్పీడ్ ఇంటర్నెట్, మినీ బార్, అత్యాధునిక స్నానాల గదులు, మరుగుదొడ్లు ఉంటాయి.[3]
ఈవెంట్లు
[మార్చు]అనేక కార్యక్రమాలకు ఈ హోటల్ వేదికైంది. ఫిబ్రవరి 25, 2012 రోజున ఈ హోటల్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. భారతదేశం లోనే అతి పొడవైన 200 మీటర్ల లంచ్ టేబుల్ పై ఒకేసారి 530 అతిథులు భోజనం చేసిన ఫీట్ తో ఈ హోటల్ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Smithsonian Institution Delegates on India Tour, Halt at Grand Hyatt to View Rajeev Sethi's Artwork". PR Newswire. 31 March 2015. Archived from the original on 17 మే 2015. Retrieved 24 July 2015.
- ↑ "Grand Hyatt Area and No of Rooms". CNN. 17 July 2009. Retrieved 24 July 2015.
- ↑ "Grand Hyatt Mumbai Facilities". cleartrip.com. Retrieved 24 July 2015.
- ↑ "Grand Hyatt Mumbai enters record books for longest lunch table". eventfaqs.com. 14 March 2012. Retrieved 24 July 2015.