గ్రామీణ సంచార పశువైద్యశాల
గ్రామీణ సంచార పశువైద్యశాల | |
---|---|
ప్రాంతం | తెలంగాణ, భారతదేశం |
దేశం | భారతదేశం |
ప్రధాన వ్యక్తులు | తెలంగాణ ప్రజలు |
స్థాపన | 2017 సెప్టెంబరు 15 |
నిర్వాహకులు | తెలంగాణ ప్రభుత్వం |
గ్రామీణ సంచార పశువైద్యశాల అనేది తెలంగాణ రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పశువులకు వైద్యసేవల్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంచార పశువైద్యశాల. దేశంలోనే సంచార పశువైద్యసేవల వాహనాలను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.[1] పశువులకు అత్యవసర వైద్యసేవలు అవసరమైనప్పుడు పశువులు, గొర్రెలు, మేకలు జబ్బులకు గురైనప్పుడు అడవి జంతువు బారినపడినప్పుడు ఈ గ్రామీణ సంచార పశు వైద్యశాల ద్వారా వాటికి తగిన చికిత్స అందించడుతుంది.
ప్రారంభం
[మార్చు]2017 సెప్టెంబరు 15న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా గ్రామీణ సంచార పశు వైద్యశాలకు చెందిన 100 సంచార పశువైద్య వాహనాలు 100 గ్రామీణ శాసనసభ నియోజకవర్గాలలో ఒకేసారి ప్రారంభించబడ్డాయి.[2]
వివరాలు
[మార్చు]సంచార పశువైద్యశాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 1962ను ఏర్పాటుచేశారు. ఈ నెంబర్‌కు ఫోన్ చేసిన అరగంటలో రైతు ఇంటి వద్దకు సంచార పశువైద్యశాల చేరేలా ఏర్పాట్లుచేశారు. ఈ సంచార పశువైద్యశాలలో వైద్యుడు, కంపోండర్, అటెండర్ వైద్యసేవలు అందించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. ఈ సంచార పశువైద్యశాల వాహనంలో మందులు, టీకాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతారు. కృత్రిమ గర్భోత్పత్తి సేవలు, పెంపుడు జంతువులకు కూడా ఉచితసేవలు అందిస్తారు. సీజన్‌ల వారీగా పశువులు వ్యాధికి గురికాకుండా ఉండేందుకు టీకాలు కూడా ఇస్తారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-10-11). "సమర్థపాలన... సంక్షేమ పథకాలు". Namasthe Telangana. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-14.
- ↑ "రేపు సంచార పశువైద్యశాలలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్". www.suryaa.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.
- ↑ telugu, NT News (2021-11-14). "రైతుల వద్దకే పశు వైద్య సేవలు". Namasthe Telangana. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.