గ్రీన్‌హౌస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నియంత్రిత శీతోష్ణస్థితిలో మొక్కలను పెంచేందుకు తయారు చేసిన నిర్మాణాన్ని గ్రీన్‌హౌస్ అంటారు. ఈ నిర్మాణపు గోడలు, కప్పు అంతటినీ గాజు వంటి పారదర్శక పదార్థంతో తయారు చేస్తారు. ఇవి చిన్నపాటి షెడ్ల నుండి పెద్ద పరిశ్ర్రమల వరకు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. పూర్తిగా కప్పబడి ఉండడం వలన దీనిలో పెరిగే మొక్కలు చుట్టుపట్ల ఉండే శీతోష్ణస్థితి ప్రభావాలకు లోనవవు. పారదర్శక పదార్థాలతో చేసినందువలన సూర్యరశ్మి లభిస్తుంది.[1]

RHS విస్లీలో ఒక ఆధునిక గ్రీన్‌హౌస్

ప్రాముఖ్యత

[మార్చు]

ఈ హరిత ఇండ్లలో పైరు పెరుగుదలకు అనువైన ఉష్ణోగ్రత గాలిలో తేమ శాతము, గాలిలో కార్టన్ డై ఆక్సైడ్ శాతము, సూర్యరశ్మి పారదర్శకత, మట్టిలో ముఖ్యమైన సూక్ష్మపోషక పదార్థాలు, నీరు తగినంత మోతాదులో నియంత్రణ చేయవచ్చు . హరిత ఇండ్లలో ఉష్ణోగ్రత 18 నుండి 30 ° సెంటీగ్రేడ్ వాతావరణంలో తేమశాతము 50-70 %, సూర్యరశ్మి 400 nm నుండి 700 nm లలో, ' CO 2 . 300-800 ppm ఉంటే చాలా రకాలైన కూరగాయలు పూలమొక్కలను పెంచవచ్చు. హరిత ఇల్లను తక్కువ ఖర్చుతో నిర్మించుకొని సహజ పద్ధతులననుసరించి వాతావరణ నియంత్రణ చేయటం ద్వారా ఖరీఫ్, రబీ కాలాలలో కూరగాయలు, ఆకు కూరలు, పూల మొక్కలను పెంచుకోవచ్చును .

హరిత ఇల్లలో చాలా రకాలున్నాయి . కానీ ' క్వాన్సేట్ ', సాటూత్ డిజైన్ ఎక్కువగా ఉపయోగంలో ఉన్నవి . వేసవికాలంలో హరిత ఇల్లలో ఉష్ణోగ్రత 50 ° నుండి 55 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది . అలాంటి పరిస్థితిలో హరిత ఇండ్లను మామిడి పల్ప్, మిరప, కూరగాయలను ఆరబెట్టుకొని వాటి తేమశాతం తగ్గించి ఎక్కువ కాలము నిలువ ఉండే విధముగా తయారు చేసుకొనవచ్చును . కొంతమంది రైతులు ఈ హరిత ఇండ్లలో మామిడి పల్ప్ క్యాండీగా, బార్స్ గా తయారు చేసి అధిక లాభాలను పొందుతున్నారు . హరిత ఇండ్లను ఖరీఫ్, రబీ కాలంలలో పంటలు, కూరగాయలు, పూలు పండించుకోవడానికి, వేసవి కాలంలో పంటలను ఆరబెట్టుకొనుటకు ఉపయోగపడే సాధనముగాను ఉపయోగించు కొనుట ద్వారా సంవత్సర కాలమంతా దీనిని ఉపయోగించుకోవచ్చును.[2]

ఉపయోగాలు

[మార్చు]

i ) పంటలకు అనుకూల పరిస్థితులు కల్పించుట ద్వారా పంటలను సంవత్సరము పొడవునా సాగు చేయవచ్చును .

ii ) పంటలు దిగుబడి ఆరుబైట ప్రదేశములో కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది .

iii ) పంటలకు అనుకూల పరిస్థితులు ఉండుట వలన నాణ్యమైన దిగుబడులు పొందవచ్చును .

iv ) పంటలకు కావలసిన ముఖ్య అవసరమైన నీరు, ఎరువు, విత్తనములు, సస్యరక్షణ మందులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చును.

v ) పంటలను చీడపీడల బారీ నుండి సులభంగా సంరక్షించవచ్చును.

vi ) వీనియందు విత్తన మొలక శాతము అధికముగా ఉండును.

vii ) టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కలను దృఢపరచడానికి ఉపయోగింపబడతాయి.

viii ) మార్కెట్ అవసరములను బట్టి పంటలను పండించు కాలాన్ని నిర్ధారించు కొనవచ్చును .

ix ) వివిధ రకములైన సేంద్రియ ఎరువులను ' వర్మికల్చర్ ' ( చెత్త చెదారము పైన వానపాములను వాడి సేంద్రీయ ఎరువులు తయారు చేయుట ), ఊక మొదలైన వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకొనవచ్చును.

X ) నాణ్యమైన దిగుబడి వల్ల ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చును.

xi ) పంటలు పండించని కాలంలో ఎండబెట్టుకొనవచ్చును .

xii ) ఆటోమేటిక్ కంట్రోలర్ ద్వారా నీటిని, ఎరువులను మొదలైనవాటిని అవసరమై నంత వరకు వాడవచ్చును .

xiii ) నిరుద్యోగ యువతీ, యువకులకు పని కల్పించుటకు ఉపయోగపడును .

xiv ) తక్కువ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు, నారు అంట్లు కటింగ్స్ఉత్పత్తి చేయవచ్చును .

XV ) హరిత ఇల్లను ఉపయోగించుకొని పనికిరాని నేలలో కూడా పంటలు పండించ వచ్చును .

xvi ) అసాధారణ ఔషద, సుగంధ మొక్కలను పెంచడానికి హరిత ఇల్లు చాలా అనుకూలం.[3]

గ్రీన్ హౌస్ రకాలు

[మార్చు]

ఆకారాన్ని బట్టి గ్రీన్ హౌస్

[మార్చు]

లీన్ టు టైప్

[మార్చు]

ఈ గ్రీన్ హౌస్ లను ఇది వరకు నిర్మించిన కట్టడం గోడకు నిర్మించుటకు ఉపయోగపడును.దీని వలన సూర్యరశ్మిని బాగుగా ఉపయోగించుకొనవచ్చును. దీని వలన పై కప్పుకు అవసరమైన సామగ్రిని కూడా తగ్గించుకొనవచ్చును .

ఈవెన్ స్పాన్ టైప్

[మార్చు]

దీనియందు పైకప్పు రెండు ప్రక్కలకు సమానముగా వంచబడి ఉండును . ఇటువంటి నిర్మాణాలను సమతల ప్రదేశములలో చిన్న చిన్న కమతాలలో నిర్మించెదరు . సామాన్యముగా దీని పొడవు 24 metre, వెడల్పు 5 నుండి 9 metre ఎత్తు 25 నుండి 4.3 మీటర్లు .

అనెవెన్ స్పాన్ టైప్

[మార్చు]

ఇది కొండ ప్రాంతములలో నిర్మించుటకు అనుకూలంగా ఉంటుంది . దీని పై కప్పు రెండువైపుల సమానముగా ఉండదు . ఇది ఆటోమేటిక్ గా ( అసంకల్పితం ) పనిచేయుటకు ఉపయోగపడదు.

రిడ్జ్ అండ్ ఫర్రో టైప్

[మార్చు]

రెండు లేక ఎక్కువ ' ఈవెన్ స్పాన్ గ్రీన్ హౌస్ ' లను ప్రక్క ప్రక్కన అమర్చిన దానిని రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ అని అంటారు . ఈ విధముగా అమర్చిన రెండు గ్రీన్ హౌస్ లకు ఒక గోడ అమర్చిన సరిపోతుంది . దీని వలన లోపల స్థలము ఏర్పడి కూలీ ఖర్చులు, ' ఆటోమిషన్ ' ఖర్చులు, ఇంధన ఖర్చులు తగ్గి కూలీలను చక్కగా ఆజమాయిషీ చేయుటకు వీలు ఉన్నవి . మన దేశ కాలమాన పరిస్థితులకు ఇది ఎంతో అనుకూలమైనది.

సాటూత్ టైప్

[మార్చు]

దీని పై కప్పు రంపము పండ్లవలె అమర్చబడి ఉంటుంది. దీనిలోనికి గాలి, వెలుతురు ప్రకృతి సిద్దముగా ధారాళంగా వస్తుంది

క్వాన్సెట్ టైప్

[మార్చు]

దీని పైకప్పు ఆర్చ్ లుగా ఉండును . దీని పైకప్పనకు పోలీహౌజ్ వాడుదురు . వీటిని తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చును.

ఇంటర్ లాకింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో క్వన్సెట్ టైప్

[మార్చు]

పైన తెలిపిన క్వన్సెట్ గ్రీన్ హౌస్ రెండులేక ఆపైన కలిపి కట్టిన దానిని ' ఇంటర్ లాకింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో క్వన్సెట్ టైప్ ' అని అంటారు.

ఉపయోగమును బట్టి గ్రీన్ హౌస్

[మార్చు]

గ్రీన్ హౌస్ లను వేడి చేయుటకు

[మార్చు]

రాత్రి సమయములలో గ్రీన్ హౌస్ లోపల చల్లగా మారి మొక్కలు దెబ్బతీయుటకు అవకాశం ఉన్నది . అది నివారించుటకు గ్రీన్ హౌస్ లోపలికి తగినంత వేడిని పంపించి మొక్కలను కాపాడుటకు వీలున్నది . లోపలికి పంపవలసిన ఉష్ణము బయట వాతావరణముపై ఆధారపడి ఉండును . ఇది నివారించుటకు అనేక పద్ధతులు ఉన్నాయి.

i ) పై కప్పుపై రెండు పొరల పాలీతీన్ కవర్లతో కప్పవచ్చును .

ii ) తర్మోఫన్ గ్లాస్ ( వేడిని బయటికి నివారించుటకు ఉపయోగపడే గ్లాస్ )

iii ) ఉష్ణమును గ్రీన్ హౌస్ లలో పెంచుటను నాలుగు విధములుగా వేడి చేయవచ్చును .

1 ) యూనిట్ హిటర్స్ 2 ) కంట్రోల్ 3 ) రేడియంట్ హీటర్లు 4 ) సోలార్ హీటర్లు వంటి వాటిని ఉపయోగించవచ్చు.

గ్రీన్ హౌస్ లను చల్లబర్చుటకు

[మార్చు]

వేసవి కాలంలో గ్రీన్ హౌస్ లోపల బయటకంటే ఎక్కువ వేడిగా ఉండి పంట పెరుగుదలకు అవరోధంగా ఉండును . ఈ వేడిని తగ్గించి పంట పెరుగుదలకు పెంచుకొనుటకు వీలుగా ఉండును . చల్లగాలి లోనికి ప్రవేశపెట్టి ' గ్రీన్ హౌస్ ' ను చల్లబరచెదరు . ఇలా చల్లబడు పద్ధతులలో ఎవాపరేటివ్ కూలింగ్ ఆవిరవుతూ చల్ల బడుట ) పద్ధతి ద్వారా చల్లగా యుంచుదురు . ఇది రెండు రకములు : 1.ఫ్యాన్ అండ్ పాడ్ కూలింగ్ సిస్టమ్ 2. ఫాగ్ కూలింగ్ సిస్టమ్ ఈ గ్రీన్ హౌస్ లో 90-100 % వరకు పైకప్పు తెరుచుకొనుటకు వీలుగా ఉండును.

నిర్మాణమును బట్టి

[మార్చు]

వుడెన్ ఫ్రేమ్డ్ గ్రీన్ హస్

[మార్చు]

గ్రీన్ హౌస్ పై కప్పు వాలు 60 కంటే తక్కవగా ఉన్నప్పుడు కొయ్యతో చేసిన గ్రీన్ హౌస్ లను నిర్మిస్తారు . తక్కువ ధర, ఎక్కువ దృఢత్వం వలన పైన్ వుడ్ సాధారణంగా వీటి నిర్మాణం ఉపయోగించెదరు . టింబర్ ను కూడా ఉపయోగించెదరు .

పైప్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్

[మార్చు]

పైకప్పు వాలు 12 మీ . ఉండేలా గ్రీన్ హౌస్ లను నిర్మించాలంటే పైప్ తో నిర్మించిన గ్రీన్ హౌస్ లను నిర్మించెదరు . పైప్ భాగాలు ఒకదానితో ఒకటి చెయ్యబడి ఉండవు . కానీ ఆధారం కోసం సైడ్ బర్స్ తో అతికించబడి ఉంటాయి . గ్రీన్ హౌస్ లకు ప్లాస్టిక్ కవర్ లనును ఉపయోగించవచ్చును.

ట్రస్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్

[మార్చు]

గ్రీన్ హౌస్ పై కప్పు వాలు 15m లు, అంతకంటే ఎక్కువగా ఉంటే వీటిని నిర్మించెదరు.

పైకప్పును ఉపయోగించు వస్తువు బట్టి గ్రీన్ హౌస్

[మార్చు]

గ్లాస్ గ్రీన్ హౌస్

[మార్చు]

గ్లాస్ గ్రీన్ హౌస్ లను 1950 నుండి ఉపయోగించుచున్నారు . గ్లాస్ ఉపయోగించుట వలన ఎక్కువగా కాంతి ప్రసరించును . కావున దీనియందు తక్కువ తేమ శాతము ఉండి మొక్కను రోగనిరోధకముగా ఉండును.

ప్లాస్టిక్ ఫిల్మ్ గ్రీన్ హౌస్

[మార్చు]

ఈ గ్రీన్ హౌస్ పై కప్పుగా పాలితీన్, పాలిస్టర్, పివిసి లను ఉపయోగించెదరు . వీటి నిర్మాణానికి గ్లాస్ తో వేసిన పైకప్పు కంటే చాలా ఖర్చు తక్కువ . అందువలన ఎక్కువ ఉపయోగంలో ఉన్నవి . ఈ రకమైన ప్లాస్టిక్ కవర్ కు జీవిత కాలం చాలా తక్కువ .

రిజిడ్ ప్యానల్ గ్రీన్ హౌస్

[మార్చు]

పివిసీ రిజిడ్ ప్యానెల్స్, ఫైబర్ గ్లాస్, రెయిన్ ఫోర్స్ డ్ ప్యానెల్స్ వాడతారు . ఉదా : - 1.క్వాన్సెట్ టైప్, 2. రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ గ్రీన్ హౌస్ పై కప్పుగా వాడుదురు . ఈ విధంగా పై కప్పు పగలకుండా గట్టిగా ఉండి గ్రీన్ హౌస్ నకు మొత్తం సమాంతరంగా కాంతి ప్రసరణ జరుగును . పై రెండు విధములైన పైకప్పు కంటే నాణ్యతగా ఉండి 20 సం వరకు పనిచేయును .

నిర్మాణమునకు అవసరమైన ఖర్చును బట్టి గ్రీన్ హౌస్

[మార్చు]

తక్కువ ధరతో నిర్మించే గ్రీన్ హౌస్

[మార్చు]

వీటిలో సపోర్టింగ్ స్ట్రక్చర్ వెదురు, ' G.I పైప్ లతోను పాలీఇతలేన్ లను పై కప్పు గాను వెంటిలేషన్ కోసము సహజముగా గాలి వెలుపలికి పోయే విధముగా ఏర్పాటు చేస్తారు .

మధ్యస్థ ధర గ్రీన్ హౌస్

[మార్చు]

ఇందులో సపోర్టింగ్ స్ట్రక్చర్ అల్యూమినియం పైప్ లు, ' uv స్టరిలైసెడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ ను పైకప్పుగా, వెంటిలేషన్ కూలింగ్ కోసము ప్యాడ్ లు, క్యాన్ లు షేడ్ నేట్స్ తో బాటు వేడి చేసే పరికరాలు ఉంటాయి.

ఎక్కువ ధర గ్రీన్ హౌస్

[మార్చు]

ఇందులో 'యు వి స్టీల్, ప్లాస్టిక్ ఫిల్మ్ లు ఫ్యాన్, ప్యాడ్ లు డ్రిప్ నీటి యందలి నీటి మీటింగ్ పరికరము, షేడ్ నెట్లు ఉంటాయి . అయితే ఈ వాతావరణ నియంత్రణ పరికరాలు డ్రిప్ పద్ధతి అన్ని కూడా కంప్యూటరీకరణ చేయబడి అటోకంట్రోల్ మేకానిజంతో అనుసంధించి ఉంటాయి.[4]

పరిమితులు

[మార్చు]

1 ) నిర్మాణము ఖర్చు ఎక్కువ

2 ) సాంకేతిక పరిజ్ఞానం గల వ్యక్తులు అవసరం

3 ) వ్యాపార పంటలకు మాత్రము అనుకూలం

4 ) నిర్వహణ ఖర్చు ఎక్కువ .

మూలాలు

[మార్చు]
  1. Crop production and farm machanization. Ekalavya organic agriculture.
  2. Brian Shmaefsky (2004). Favorite demonstrations for college science: an NSTA Press journals collection. NSTA Press. p. 57. ISBN 978-0-87355-242-4.
  3. Kurpaska, Sławomir (2014). "Energy effects during using the glass with different properties in a heated greenhouse" (PDF). Technical Sciences. 17 (4): 351–360.
  4. "Small Greenhouses".