Jump to content

గ్లోరియోసా

వికీపీడియా నుండి

గ్లోరియోసా
Gloriosa superba
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
గ్లోరియోసా

జాతులు

See text.

[1]గ్లోరియోసా (Gloriosa) పుష్పించే మొక్కలలో కోల్చికేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.గ్లోరియోసా ఆకురాల్చే, వేసవిలో పెరుగుతున్న 1.5 మీటర్ల ఎత్తు వరకు, దుంప మూలాలతో ఉంటుంది. సన్నని కాడలు ,4 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. కాండములు వసంతకాలంలో మొలకెత్తుతాయి, ఒక గడ్డ దినుసు 1 నుండి 6 కాండం వరకు పంపుతుంది.

చరిత్ర

[మార్చు]

ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పువ్వులు వేసవిలో వస్తాయి. పసుపు, నారింజ, నారింజ-ఎరుపు నుండి వంకాయ రంగు ఉంటాయి. ఈ పండు పెద్ద, తోలు తో పక్వానికి 6-10 వారాలు సమయం పడుతుంది. గ్లోరియాస సముద్ర తీరప్రాంతములలో , అటవీప్రాంతాలు, గడ్డి భూములలో పెరుగుతుంది. గ్లోరియోసా,క్వాజులు-నాటాల్, లింపోపో, స్వాజిలాండ్, బోట్స్వానా, నమీబియా, జింబాబ్వే ఆఫ్రికా, భారత దేశమములలో కనబడుతుంది. గ్లోరియోసా సూపర్బా, వసంతఋతువు ,వేసవిలో నిస్సారమైన నేలలలో పెరుగ గలదు.

ఉపయోగము

[మార్చు]

గ్లోరియాసా మొక్క విషపూరితమైనది అయినప్పటికీ, ఈ మొక్క ఆసియాలో, ఆఫ్రికాలో సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది. దీని ఆకులతో మందులు తయారు చేస్తారు.చిన్న పరిమాణంలో గడ్డ దినుసును అబార్టిఫేసియంట్, ఆల్టరేటివ్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీహైమోర్హాయిడ్, యాంటిలెప్రోటిక్, యాంటిపెరియోడిక్, వ్యాధుల్లో వాడతారు. అల్సర్ కుష్టు, పైల్స్, మంటలు, కడుపు నొప్పులు, చర్మ సంభందిత చికిత్సలో వాడతారు. ఆఫ్రికా లాంటి దేశములలో ఉదర రుగ్మతలకు చికిత్స చేయడానికి, గర్భస్రావం చేయటానికి, టానిక్‌గా కషాయాల రూపకం గాను తీసుకుంటారు. గ్లోరియోసా మొక్కలు, విత్తనములను కూడా మందుల తయారీలో వాడతారు. [2] గ్లోరియోసా పెంపకం వాణిజ్య పరముగా రైతుల కు అధిక మొత్తములో లాభదాయకం గా ఉంటుంది . 250-300 కిలోల గ్లోరియోసా విత్తనములతో ఒక హెక్టారుకు 2.5-3 టన్నులతో , ఖర్చు రూ .1,45,000 / - (ఐదేళ్లలో), 5 సంవత్సరముల తర్వాత హెక్టారుకు రూ. 4.05 లక్షలు రాగలవు. సరాసరి ఆదాయం రూ. 2.70 లక్షలు (2001 సంవత్సర లెక్కల ప్రకారం) [3]

మూలాలు

[మార్చు]
  1. "Gloriosa superba | PlantZAfrica". pza.sanbi.org. Archived from the original on 2020-09-28. Retrieved 2020-09-09.
  2. "gloriosa superba Gloriosa Lily, Climbing Lily, Flame Lily PFAF Plant Database". pfaf.org. Retrieved 2020-09-22.
  3. "GLORIOSA SUPERBA LINN. FAMILY - LILIACEAE" (PDF). nmpb.nic.in/sites. 2020-09-22. Retrieved 2020-09-22.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]


మూలాలు

[మార్చు]