Jump to content

చందిర ప్రియాంగ

వికీపీడియా నుండి
ఎస్. చందిర ప్రియాంగ

శాసనసభ్యురాలు
పదవీ కాలం
మే 2016 – ప్రస్తుతం
ముందు ఎం . చాందిరకాసు
తరువాత ప్రస్తుతం
నియోజకవర్గం నెడుంగడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1989[1]
రాజకీయ పార్టీ అల్ ఇండియా ఎన్‌ ఆర్ కాంగ్రెస్
నివాసం కారైకాల్
పూర్వ విద్యార్థి అన్నామలై యూనివర్సిటీ (బీబీఏ)

చందిర ప్రియాంగ పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2016 & 2021 శాసనసభ ఎన్నికల్లో నెడుంగడు (రిజర్వ్‌డ్) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి ఎన్. రంగసామి మంత్రివర్గంలో రవాణా, హౌసింగ్, కార్మిక & ఎంప్లాయ్‌మెంట్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. చందిర ప్రియాంగ 1980లలో రేణుకా అప్పదురై తర్వాత పుదుచ్చేరిలో రెండో మహిళా మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్. చందిర ప్రియాంగ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2016లో నెడుంగడు నియోజకవర్గం అసెంబ్లీ నుండి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2021లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్-బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది. పుదుచ్చేరిలో 40 ఏళ్ల తర్వాత మహిళకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది.[3]

ఎస్ చంద్ర ప్రియంగ "కులం & లింగ వివక్షత" కారణంగా 2023 అక్టోబర్ 10న తన మంత్రి పదవికి రాజీనామా చేసింది.[4] ప్రియంగ పని తీరు పట్ల సిఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమెను తన మంత్రివర్గం నుండి తొలగించాలని కోరుతూ అక్టోబర్ 8న ముఖ్యమంత్రి నుంచి లేఖ అందిందని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపింది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (28 June 2021). "Will work for rights of women: Puducherry minister Chandira Priyanga". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  2. Sakshi (11 October 2023). "నా వల్ల కాదు.. మంత్రి పదవికి ప్రియాంక రాజీనామా". Archived from the original on 11 October 2023. Retrieved 11 October 2023.
  3. Sakshi (27 June 2021). "Puducherry: 40 ఏళ్లకు మహిళా మంత్రి". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  4. ABP News (10 October 2023). "Puducherry Transport Minister Chandra Priyanka Resigns" (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  5. The Indian Express (12 October 2023). "'Chandira Priyanga was treated with utmost respect and care': Puducherry Lt Governor denies charges by ex-minister" (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  6. Hindustan Times (12 October 2023). "Priyanga, who exited Puducherry cabinet, had problems with CM for 6 months" (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.