Jump to content

చంద్రకాంత

వికీపీడియా నుండి
చంద్రకాంతలు

చంద్రకాంతలు పెసర పప్పుతో చేసే ఒక రకమైన పిండి వంట.[1]

కావలసిన పదార్ధాలు

[మార్చు]

తయారుచేయు విధానము

[మార్చు]
  • పెసర పప్పును నీటిలో ఒక గంటసేపు నానబెట్టండి.
  • బాగా కడిగి పొట్టు ఉంటే శుభ్రంగా తీసివేయాలి.
  • పప్పును మెత్తగా రుబ్బాలి. నీళ్ళు మరీ ఎక్కువగా గాని, మరీ తక్కువ గాని వెయ్యకూడదు.
  • పచ్చి కొబ్బరి కోరు, చక్కెర లను ఈ పెసర ముద్దలో కలిపి పొయ్యి మీద పెట్టి హల్వాకు తిప్పిన విధంగా గరిటెతో తిప్పాలి.
  • పావుగంట - ఇరవై నిమిషాలు పోయేసరికి చక్కెర పాకం అయి, పెసరముద్దలోని నీరు యింకిపోయి గట్టిపడుతుంది. చెయ్యిపెట్టి చూస్తే చేతికి అంటుకోకుండా ముద్దలాగా అవుతుంది.
  • అప్పుడు సుగంధ ద్రవ్యాలు వేసి గరిటెతో మరోసారి కలిపి కిందకి దించాలి.
  • తెల్లని మందంగల గుడ్డ తీసుకుని, దానిని నీటితో తడిపి, నీరు పిండేసి ఆ తడిబట్టను ఒక పీటమీద మడతలు లేకుండా పరచాలి.
  • ఆ తడిబట్టమీద ఉడికిన పెసర ముద్దని పోసి, చేత్తో అరచేతి మందంలో ఉండేటట్లు వత్తాలి.
  • ఆ పరిచిన పెసర ముద్ద ఆరటం వల్ల త్వరగా చల్లారుతుంది. అప్పుడు కత్తితో మనకు కావలసిన ఆకారాల్లో, పరిమాణంలో కోసుకోవారి. కోసిన ముక్కలను విడివిడిగా తీసి పెట్టుకోవాలి.
  • బూరెల మూకుడులో పావుకిలో నెయ్యి పోసి బాగా మరిగాక, ఈ కోసిన ముక్కలు వేస్తే అవి పొంగి గుల్లగా విచ్చుకుంటాయి. వీటిని మరీ ఎర్రగా కాకుండా, గోధుమ రంగు వచ్చేదాక వేగనిచ్చి తీసివేయాలి.

మూలాలు

[మార్చు]
  1. "Chandra Kaantalu". Indian food recipes - Food and cooking blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2007-01-13. Retrieved 2021-07-16.