Jump to content

చంద్ర నాయుడు

వికీపీడియా నుండి
చంద్ర నాయుడు
జననం1933
ఇండోర్, ఇండోర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా
మరణం4 April 2021 (aged 88)
ఇండోర్, మధ్య ప్రదేశ్, భారతదేశము
జాతీయతభారతీయురాలు
విద్యపట్టభద్రురాలు
వృత్తిక్రీడా వ్యాఖ్యాత, క్రికెట్ క్రీడాకారిణి, అధ్యాపకురాలు, రచయిత్రి
సంస్థమధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో జీవిత కాల సభ్యత్వం
Notable work(s)సి. కె. నాయుడు: ఎ డాటర్ రిమెంబర్స్
బంధువులుమేనల్లుడు: విజయ్ నాయుడు మొదటి తరగతి క్రికెట్ క్రీడాకారుడు. మామ: సి. ఎస్. నాయుడు ఇండియా తరపున ఆడిన క్రికెట్ క్రీడాకారుడు
తండ్రిసి.కె.నాయుడు: తోలి జట్టు క్రికెట్ క్రీడాకారులలో ఒకరు.

చంద్ర నాయుడు (1933 - 2021 ఏప్రిల్ 4) ఒక భారతీయ క్రికెట్ వ్యాఖ్యాత, క్రికెట్ క్రీడాకారిణి, అధ్యాపకురాలు (ప్రొఫెసర్), రచయిత్రి. ఆమె భారతదేశపు మొదటి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత. అంతేకాక, భారతదేశపు తొలి మహిళా క్రికెటర్లలో ఒకరు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

చంద్ర నాయుడు 1933లో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించింది.[2][3][4][5]. ఆమె పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పట్టణానికి చెందినవారు.[6][7] ఆమె తండ్రి కల్నల్ సి.కె.నాయుడు, ప్రసిద్ధ క్రికెట్ క్రీడాకారుడు. ఆమె భారత తొలి టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్.[8] సి. కె. నాయుడు మొదటి భార్యకు జన్మించిన ముగ్గురు కుమార్తెలలో చంద్ర చిన్నది.[9] ఆమె మేనల్లుడు విజయ్ నాయుడు ఫస్ట్ క్లాస్ క్రికెటర్. ఆమె మామ సి.ఎస్.నాయుడు కూడా ఇండియా తరపున ఆడాడు.[8][10]

ఆమె ఇండోర్లో తన తండ్రి తరచుగా ఆడే హోల్కర్ స్టేడియానికి సమీపంలో ఉన్న మనోరమ గంజ్ ప్రాంతంలో నివసించేది.[1] 2021 ఏప్రిల్ 4న ఇండోర్లో 88 సంవత్సరాల వయసులో చాలాకాలం జబ్బుతో ఉండి కన్నుమూసింది.[11]

వృత్తి, క్రికెట్

[మార్చు]

చంద్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ప్రభుత్వ కళాశాలలో ఆంగ్లంలో పట్టభద్రురాలై, అక్కడే ఆంగ్లం బోధించింది.[12] ఆమె దేశవాళీ మహిళల క్రికెట్లో ఆడింది. మొదటి ఉత్తర ప్రదేశ్ మహిళల క్రికెట్ జట్టుకు నేతృత్వం వహించింది. 1970లలో క్రికెట్ వ్యాఖ్యానాన్ని చేపట్టడానికి ముందు ఆమె కళాశాల కోసం కూడా క్రికెట్ ఆడింది.[10][13] ఆమె భారత తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత.[1] క్రికెట్ ఆటకు వ్యాఖ్యాతగా ఆమె తన వృత్తి జీవితాన్ని మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC)కు (అప్పట్లో ఇంగ్లండ్ జట్టు), బొంబాయికి మధ్య 1976-77 సీజన్లో జరిగిన మ్యాచ్ తో ప్రారంభించింది. అప్పటినుంచి దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్ లకు హిందీలో, ఆంగ్లంలోనూ వ్యాఖ్యానించడం కొనసాగించింది.[14] 1979 - 80లో ఇంగ్లీష్ జట్టు భారత పర్యటనలో ఆమె భారత ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన ఆకాశవాణి కోసం కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించింది. క్రికెట్ చరిత్రకారుడు డేవిడ్ రేవర్న్ అలెన్ తో లార్డ్స్లో జరిగిన ముఖాముఖీలో (ఇంటర్వ్యూ) లో క్రికెట్ వ్యాఖ్యాతగా తన అనుభవాలను నమోదు (రికార్డ్) చేసింది, దానిని భద్రపరచారు.[13][15] చంద్ర చెప్పిన దానిని బట్టి ఈమె ఆస్ట్రేలియా మహిళా వ్యాఖ్యాత కంటే కూడా ముందు అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మొదటి మహిళ.[13] ESPN Cricinfoతో ఇచ్చిన ముఖాముఖి (ఇంటర్వ్యూ) సంభాషణలో ఆమె క్రికెట్లో తన తండ్రి సాధించిన విజయాలను గౌరవించే మార్గంగా క్రికెట్ వ్యాఖ్యానంపై తనకు ఆసక్తి ప్రారంభమైందని పేర్కొంది.[16] 1982లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన స్వర్ణోత్సవాల టెస్ట్ మ్యాచ్ కు గాను ఆమెను ఆహ్వానించారు.[17]

ఆమె మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘంలో జీవితకాల సభ్యురాలు. ఈ ప్రాంతంలో మహిళల క్రికెట్ ను ప్రోత్సహించడానికి అంతర-విశ్వవిద్యాలయ ఆటల పోటీలను (ఇంటర్ - యూనివర్శిటీ టోర్నమెంట్ లు) ఏర్పాటు చేయడంతో సహా అనేక ప్రయత్నాలు ఆమె చేపట్టింది. ఆమె తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం క్రికెట్ ఆటల పోటీలకు అనేక ట్రోఫీలను ఏర్పాటుచేసింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు వెండి బ్యాట్ ను బహుకరించింది, తన తల్లి పేర 'కాలేజియేట్ మెమోరియల్ ట్రోఫీ'ని నెలకొల్పి నడిపిందని ఆమె మేనల్లుడు మాజీ క్రికెటర్ అయిన విజయ్ నాయుడు చెప్పాడు.[11] ఆమె చివరగా 1990 ప్రారంభంలో ఇండోర్ లోని ప్రభుత్వ బాలికల పిజి కళాశాలలో ప్రిన్సిపాల్ పనిచేసింది.[12] 1995లో ఆమె తన తండ్రి జ్ఞాపకాలను పొందుపరచి "సి.కె.నాయుడు: ఎ డాటర్ రిమెంబర్స్" అనే పుస్తకాన్ని ప్రచురించింది.[14]

ప్రచురణలు

[మార్చు]
  • చంద్ర కె. నాయుడు. సి. కె. నాయడు: ఎ డాటర్ రిమెంబర్స్ (న్యూ ఢిల్లీ రూపా పబ్లికేషన్స్ 1995 ISBN 9788171672837

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Dani, Bipin (5 April 2021). "India's first woman commentator Chandra Nayudu no more". Mid-Day.
  2. M. L. Kantha Rao (July 1999), A Study of the Socio-Political Mobility of the Kapu Caste in Modern Andhra. University of Hyderabad. Chapter 6. p. 301–303. hdl:10603/25437
  3. A. Vijaya Kumari; Sepuri Bhaskar (1998). Social Change Among Balijas: Majority Community of Andhra Pradesh (in ఇంగ్లీష్). M.D. Publications. p. 14. ISBN 978-81-7533-072-6.
  4. Singh, Gurdeep (1966). Cricket in Northern India (in ఇంగ్లీష్). Cosmo Publications. pp. 61, 62.
  5. Mukherji, Raju (2005). Cricket in India: Origin and Heroes (in ఇంగ్లీష్). UBS Publishers' Distributors. p. 13. ISBN 978-81-7476-508-6.
  6. Nayudu, Chandra (1995). C.K. Nayudu, a Daughter Remembers (in ఇంగ్లీష్). Rupa. p. 3. ISBN 978-81-7167-283-7.
  7. Naidu, T. Appala (2018-06-29). "Row over C.K. Nayudu's statue". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-04-11.
  8. 8.0 8.1 "C. K. Nayudu Profile". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-12-06.
  9. "Chandra Nayudu had more knowledge than us players: Edulji". Sify. 6 April 2021. Archived from the original on 26 March 2022. Retrieved 2023-04-14.
  10. 10.0 10.1 PTI. "CK Nayudu's Daughter, Commentator Chandra Nayadu Dies". Outlook India (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-08. Retrieved 2021-12-06.
  11. 11.0 11.1 "Chandra Nayudu, regarded as India's first female cricket commentator, passes away". ANI News (in ఇంగ్లీష్). 4 April 2021. Retrieved 2021-12-06.
  12. 12.0 12.1 TNN (5 April 2021). "India's first female cricket commentator Chandra Nayudu passes away". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-05. Retrieved 2021-12-06.
  13. 13.0 13.1 13.2 "Chandra Nayudu interviewed by David Rayvern Allen". Lord's Cricket Ground. Retrieved 2021-12-06.
  14. 14.0 14.1 Dani, Bipin (2021-04-05). "World's first ever woman commentator Chandra Nayudu no more". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-12-06.
  15. Ugra, Sharda. "Girls aloud". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-12-06.
  16. "FACE-TO-FACE". static.espncricinfo.com. Retrieved 2021-12-06.
  17. "The First Lady of Indian Cricket". Paperclip. (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-01. Retrieved 2023-04-14.