చమీలా గమగే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చమీలా గమగే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మటెర్బా కనాత గమగే చమిలా ప్రేమనాథ్ లక్షిత
పుట్టిన తేదీ4 January 1979 (1979-01-04) (age 45)
ఉనవటున, శ్రీలంక
ఎత్తు5 ft 11 in (180 cm)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 90)2002 జూలై 28 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2002 నవంబరు 15 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 111)2002 ఆగస్టు 4 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2003 జనవరి 21 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 2 7
చేసిన పరుగులు 42 7
బ్యాటింగు సగటు 14.00 7.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 40 4
వేసిన బంతులు 288 300
వికెట్లు 5 8
బౌలింగు సగటు 31.60 31.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/33 2/34
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9

మటెర్బా కనాత గమగే చమిలా ప్రేమనాథ్ లక్షిత, శ్రీలంక మాజీ క్రికెటర్. 2000ల ప్రారంభంలో రెండు టెస్టులు, 7 వన్డే ఇంటర్నేషనల్‌లు ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు.[1] గాలేలోని రిచ్‌మండ్ కళాశాలలో చదివాడు. 2004, ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. [2]

జననం[మార్చు]

మటెర్బా కనాత గమగే చమిలా ప్రేమనాథ్ లక్షిత 1979, జనవరి 4న శ్రీలంక లోని ఉనవటునలో జన్మించాడు.

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2002 జూలైలో బంగ్లాదేశ్‌పై తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన గమగే, అంతర్జాతీయ క్రికెట్‌లో తక్షణ ప్రభావం చూపాడు, టెస్ట్ క్రికెట్‌లో తన మొట్టమొదటి డెలివరీతో వికెట్ తీసి, ఫార్మాట్‌లో అలా చేసిన మొదటి శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు.[3]

శ్రీలంక తరపున మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. బ్యాటింగ్ లో 40 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. 2003లో ఆస్ట్రేలియాతో అతని చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Chamila Gamage". CricketArchive. Retrieved 2023-08-16.
  2. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-16.
  3. 3.0 3.1 "Player Profile: Chamila Gamage". Cricinfo. Retrieved 2023-08-16.

బయటి లింకులు[మార్చు]