Jump to content

చర్చ:అచుతా మీనన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నేను ఈ పేజీకి సంబంధించిన ఇప్పటి కూర్పు గురించి రాస్తున్నాను. ఇందులో చాలా భాషాదోషాలున్నాయి. అనువాద దోషాలున్నాయి. యాంత్రికానువాదాన్ని పెద్దగా మార్పులేమీ చెయ్యకుండా ఇక్కడ పెట్టినట్టుగా తోస్తోంది. అందుకే భాష కృతకంగా, అనువాద దోషాలతో, కొండొకచో మూలం లోని అర్థానికి సరిగ్గా వ్యతిరేకార్థంలో.. ఉంది. కొన్ని ఉదాహరణలిక్కడ:

  1. "(అతని పేరు పెట్టబడింది)": అనువాద దోషం
  2. "రాష్ట్ర కాంగ్రెస్‌తో అనుబంధించడం ద్వారా ప్రారంభించారు" : అనువాద దోషం
  3. "అచుతా మీనన్ మొదటి జైలు శిక్షను 1940 లో, యుద్ధ వ్యతిరేక ప్రసంగం చేసినందుకు ఒక సంవత్సరం; 9 ఆగస్టు 1942 లో "క్విట్ ఇండియా" ఉద్యమం నేపథ్యంలో ఒక సంవత్సరానికి పైగా ఖైదీగా ఉన్నారు.": మూలం లోని వాక్యాన్ని మక్కికి మక్కి అనువదించడంతో ఈ వాక్యం ఇలా తయారైంది.
  4. "భూగర్భంలో" - మూలంలో అండర్‌గ్రౌండ్ అని ఉంది కాబట్టి ఇక్కడ "భూగర్భంలో" అని అనువదించింది యంత్రం. దాన్నే కాపీ చేసి ఇక్కడ పెట్టారు.
  5. "కొంతకాలం తర్వాత శ్రీ. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత అచుతా మీనన్ కేరళ శాసనసభకు ఎన్నికయ్యారు"
  6. "విమోచనసమరం (లిబరేషన్ స్ట్రగుల్) అని పిలవబడే moment పందుకుంటున్న తరుణంలో": ఊపందుకుంటున్న అని రాయాల్సింది పందుకుంటున్న అని రాసింది. ఆ యంత్రం చేసే మామూలు తప్పుల్లో ఇదొకటి (ఊ, ఔ, ఢి వగైరాలను అనువదించడంలో తప్పు చేస్తుంది). దానికి ముందున్న ఇంగ్లీషు మాటను అలాగే ఉంచేస్తుంది.
  7. హోంమంత్రి పరిస్థితిని నిర్వహించడానికి అనర్హుడని గుర్తించారు మరియు అప్పటికి అప్పగించిన కీలకమైన పోర్ట్‌ఫోలియోను తొలగించారు మీనన్కు.: ఇంతకీ అనర్హుడని గుర్తించి మీనన్నని అర్థం వస్తోంది. మూలంలో ఉన్నదానికి వ్యతిరేకార్థం వచ్చిందిక్కడ.
  8. "దీనిని అనుసరించి": ఇక్కడ ఉండాల్సిన మాట "అనుసరించి" కాదు.
  9. ఈ ఒప్పందం, ఈ అంశంపై నిపుణులు నమ్ముతారు, కేరళ ప్రయోజనాలను దూరం చేసారు మరియు ముల్లపెరియర్ సంచికలో కేరళ ఈ రోజు తనను తాను గుర్తించలేని పరిస్థితికి ప్రధాన కారణం అయ్యింది. : ఘోరమైన అనువాదం.
  10. ప్రాథమిక ప్రాముఖ్యత కలిగిన సంస్కరణ చర్యలను : ఇక్కడ వాడాల్సిన మాట "ప్రాథమిక" కాదు.

వాడుకరి:Prasharma681 గారూ, మీరు వికీకి కొత్తవారు. కాబట్టి వికీ విధానాలను, పద్ధతులను, శైలినీ తెలుసుకోవడానికి సమయం పడుతుంది. దానికి కొంత సమయం ఇవ్వాలి. అది నిర్వివాదాంశం. భాషలో అచ్చుతప్పులు ఉండవచ్చు. టైపాట్లుండవచ్చు. వాటిని సవరించుకోవచ్చు. కానీ...

ఈ పేజీలో ఉన్నట్టు కృతక భాష, వ్యాకరణ దోషాలు, వాక్య నిర్మాణంలో దోషాలు, అనువాద దోషాలూ ఉంటే ఆ వ్యాసాన్ని చదవలేం కదా. యాంత్రికానువాదం కేవలం కొంతవరకు సహాయపడేందుకే ఉంది. అది చేసిన అనువాదం ఉన్నదున్నట్టుగా వాడేందుకు పనికి రాదు. (మరో ఉదాహరణ: "మరియు" అనే మాట తెలుగుకు సహజమైన వాడుక కాదు. కానీ అది ఇంగ్లీషులో "అండ్" ఉన్న చోటల్లా "మరియు" అని అనువదిస్తూంటుంది. వార్తా పత్రికల్లో వాడరు, మీరు గమనించే ఉంటారు.) చాలా సవరణలు చేసాకే ప్రచురించాల్సి ఉంటుంది. దయచేసి ఈ సూచనలను పరిశీలించి, ఈ వ్యాసం లోని దోషాలను సవరించగలరు. అలాగే, ఇకపై రాసే వ్యాసాల్లో ఈ విషయంపై శ్రద్ధ వహించవలసినదిగా మనవి. __చదువరి (చర్చరచనలు) 16:01, 18 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]