చర్చ:అయస్కాంతం
స్వరూపం
ఉపోద్ఘాతము
[మార్చు]ప్రకృతిలో కొన్ని రాళ్ళకు యినుము,నికెల్ వంటి వాటిని ఆకర్షించే స్వభావం ఉంటుంది. ఈ స్వభావాని అయస్కాంతత్వం అందురు.
చరిత్ర
[మార్చు]పూర్వం మాగ్నీషియా దీవులలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేతకు తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళీనపుడు ఆ ప్రాంతంలో గల కొన్ని రాళ్ళు వాడు పట్టుకొని వచ్చే యినుప పనిముట్లకు ఆకర్షింట గమనించాడు. ఆ విషయం అందరికీ తెలిసిన తర్వాత ఆ దీవిలో గల రాళ్ళకు ఆ స్వభావం కలదు కావున ఆ రాళ్ళకు మాగ్నటైట్ అని పేరు పెట్టారు. క్రమంగా "మాగ్నెట్" అని పెరు వచ్చింది.
అయస్కాంతంలో రకములు
[మార్చు]- సహజ అయస్కాంతాలు
- కృత్రిమ అయస్కాంతాలు.
అయస్కాంత ధర్మములు
[మార్చు]- అయస్కాంతమునకు ఏ బిందువుల వద్ద ఎక్కువ ఆకర్షణ బలం ఉంటుందో ఆ బిందువులను అయస్కాంత ధృవములు అందురు.
- అయస్కాంతం ఉత్తర, దక్షిణ దృవములు కలిగి ఉంటుంది.
- అయస్కాంతాన్ని స్వేచ్చగా వ్రేలాడదీసినపుడు అది భౌగోళిక ఉత్తర, దక్షిణ దృవాలను చూపుతుంది.(దిశాధర్మం)
- అయస్కాంత సజాతి దృవములు వికర్షించబడును. సజాతి దృవములు ఆకర్షించబడును.
కృత్రిమ అయస్కాంతం తయారు చేసే పద్ధతులు
[మార్చు]- ఏక స్పర్శ పద్ధతి
- ద్వి స్పర్శ పద్ధతి
- విద్యుత్ పద్ధతి
- ప్రేరణ వల్ల అయస్కాంతత్వం
(Kvr.lohith (చర్చ) 13:24, 12 నవంబర్ 2012 (UTC))