చర్చ:ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ
సరియైన వ్యాసం పేరు
[మార్చు] సహాయం అందించబడింది
అయ్యా ! వ్యాసకర్త ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ అనే పేరుతో వ్యాసము ప్రారంభించారు. ఈ పేరును ఆంగ్లము నందు ఏమందురో తెలిసిన పెద్దలు తెలియజేయగలరు. కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) అని మాత్రము నాకు తెలుసు. ప్రస్తుతము ఒక వ్యాసము ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము [1] అని నేను ఒకటి వ్రాశి ఉన్నాను. మరి ఈ రెండు వేరు వేరు వ్యాసములు అవునో కాదో నాకు తెలియదు. సందిగ్ధం తొలగించ గలరని నా మనవి. JVRKPRASAD (చర్చ) 06:38, 17 మే 2016 (UTC)
- ప్రాంతము అథారిటీ రెండు వెరు వెరు. AP Capital Region, AP Capital Region Development Authority.--Vin09 (చర్చ) 06:43, 17 మే 2016 (UTC)
- ఈ వ్యాసము సరియైనదే. ఆంగ్ల వ్యాసం Andhra Pradesh Capital Region Development Authority ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము అనే వ్యాసానికి ఆంగ్లంలో Andhra Pradesh Capital Region అనే వ్యాసం ఉన్నది. అదే విధంగా అమరావతి (రాష్ట్ర రాజధాని) అనే వ్యాసం వేరుగా ఉన్నది. --కె.వెంకటరమణ⇒చర్చ 07:03, 17 మే 2016 (UTC)
తెలుగు పదాల వాడుక
[మార్చు]ఎల్లరికి ఒక మనవి: ఆంగ్ల వికి నుండి "కాపి" కొట్టుచున్నప్పుడు దయచేసి km, sq,km, sq.ft వంటివి తెలుగులో వ్రాయుడి. అంతియేగాక పలు ఆంగ్ల పదములను మక్కీ-టు-మక్కీ దించుచున్నారు. దయచేసి తెలుగు పదములను వాడుడి. ఉదా: అడ్మినిస్ట్రేషన్: అను పదమునకు పరిపాలన అను తెలుగు పదము ఉన్నదిగదా. మరి అడ్మినిస్ట్రేషనను ఆంగ్ల పదము ఎందుకు వాడవలెను చెప్పుడి. Hydkarthik (చర్చ) 06:59, 21 ఆగష్టు 2016 (UTC)