వాడుకరి చర్చ:Vin09

వికీపీడియా నుండి
Jump to navigation Jump to searchతెలంగాణా కొత్త జిల్లాల విషయంలో కృషికి ఆహ్వానం[మార్చు]

వినయ్ గారూ,
నమస్తే. మీరు వికీలో శలవు తీసుకున్నారన్న అంశం తెలిసినా, ఆంగ్ల వికీలో మీరు చేస్తున్న కృషి గమనించి మిమ్మల్ని ఇలా అడిగేందుకు సాహసిస్తున్నాను. ఆంగ్ల వికీలో ఇప్పటికే మీరు తెలంగాణాలో ఏర్పడిన కొత్త జిల్లాల విషయమై గ్రామ వ్యాసాల్లోనూ, ఆయా జిల్లాల వ్యాసాల్లోనూ తగిన కృషి చేస్తున్న విషయం గమనించాను. ప్రస్తుతానికి తెవికీలో ఆ దిశగా చంద్రకాంత రావు గారూ, కొంతవరకూ ప్రణయ్ రాజ్ గారి వంటి కొందరు చేస్తున్న విషయం గమనించాను. అయితే ఈ దిశగా చేయాల్సిన పని చాలానే వుందన్నది నిస్సందేహం. మరిన్ని చేతులు కలిసి మరింతగా పని సాగితే బావుంటుంది కదా. ఈ నేపథ్యంలో మీరు తెవికీలో కూడా తెలంగాణా కొత్త జిల్లాల వ్యాసాలు, తెలంగాణా గ్రామాల వ్యాసాల్లో సంబంధిత మార్పుల్లో నిర్మాణాత్మకమైన కృషి చేస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:56, 12 అక్టోబరు 2016 (UTC)

@Pavan santhosh.s: ఆంగ్ల వికీలొ పని ఉండటం వల్ల తెవీకీ కి తాత్కాలికంగా మాత్రమే సెలవు తీసుకున్నాను. మీరు కోరినట్టే ఇవాళ్ళ ఆ వ్యాసాలపై పని చేస్తాను. మీ సహయం అవసరమైతే కోరతాను. ధన్యవాదాలు.--Vin09(talk) 11:19, 12 అక్టోబరు 2016 (UTC)

తెలుగు అనువాద వ్యాసాల పతకం[మార్చు]

Translation Barnstar te.svg తెలుగు అనువాద వ్యాసాల పతకం
Vin09 గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 04:47, 14 ఆగస్టు 2020 (UTC)

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు[మార్చు]

Vin09 గారికి, నమస్కారం.

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:32, 29 ఆగస్టు 2020 (UTC)