చర్చ:ఈనాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈనాడు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 42 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

తటస్థ దృక్కోణం[మార్చు]

తెలుగు వికీలో బాగా ముందుగా (2005లో) వచ్చిన వ్యాసాలలో ఇది ఒకటి. అప్పుడు బాగా మంచి వ్యాసంగానే పరిగణింపబడింది. కాని, పెరుగుతున్న వ్యాసాల దృష్ట్యా, ముఖ్యంగా పత్రికల వ్యాసాలపై ఇతరులు దృష్టి ఉంచే అవకాశం ఉన్నందున, ఈ వ్యాసాన్ని పునఃపరిశీలించాలి. సర్క్యులేషన్ పోటీలో ఉన్న ఒక పత్రిక గురించిన వ్యాసం గనుక మరింత నిర్దుష్టమైన ఆధారాలు చూపాలి. కాకుంటే వికీపీడియా:తటస్థ దృక్కోణం పరిమితులను ఉల్లంఘించినట్లవుతుంది. ప్రశ్నించ బడ వచ్చు అనిపించే వాక్యాలకు ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • తెలుగు పత్రికా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. (దాదాపు ప్రతి పత్రికకూ ఈ వాక్యాన్ని అన్వయించవచ్చును)
  • ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు. (అనుభవం, ఆనందం వీటిని అర్ధ గర్భిత పదాలుగా పరిగణింపవచ్చును)
  • తెలుగుదేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖపాత్ర పోషించింది. (మరింత వివరణ కావాలి)
  • తొలినాళ్ళలో పత్రిక అభివృద్ధికి దోహదపడ్డాడు. (ఇది ఎవరి అభిప్రాయం?)
  • ఈనాడు బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. (ఇది ఎవరి అభిప్రాయం)

ఇటువంటివాటికి స్పష్టమైన ఆధారాలు చూపాలి. వ్యాసం చివరలో కొన్ని మూలాలుగా పేర్కొనబడ్డాయి కాని అవి చాలవు. In text citations అవసరం చాలా ఉంది. పైని ఉదాహరించిన వాక్యాలు చాలా వ్యాసాలలో "చల్‌తా హై" కాని ఒక పత్రిక గురించిన వ్యాసంలో చెల్లుబాటు కావు అనుకొంటాను.- --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:14, 10 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న సమస్య[మార్చు]

వ్యాసం పూర్తిగా కనిపించటం లేదు. బయటి లింకులు, మూలాలు శీర్షికలు కనిపించటం లేదు. సమస్య ఏమిటో అర్థం కావటం లేదు. సరిదిద్దిన వారికి ముందుగానే కృతజ్ఞతలు. వాసు. bojja 15:26, 25 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

δευ దేవా 18:11, 25 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]