చర్చ:ఉగ్రవాదం
తీవ్రవాదం (Extremism) కూడా ఇంచుమించు ఇలాంటిదే కదా. దీని గురించి కొంచెం కలపండి.Rajasekhar1961 08:26, 3 డిసెంబర్ 2008 (UTC)
సామ్రాజ్యవాద దేశాలు, జాతి దురహంకార రాజ్యాలు ఇచ్చే వివరాలు ప్రామాణికం కావు
[మార్చు]ఖలిస్తాన్ సంస్థలు, బెలూచిస్తాన్ సంస్థలు ఉగ్రవాద సంస్థలు కావు. అవి జాతీయ విమోచన పోరాట సంస్థలు. కొంత కాలం క్రితం బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైనికులు ఒక మహిళ డాక్టర్ ని రేప్ చెయ్యడం, అందుకు ప్రతీకారంగా బెలూచిస్తాన్ తిరుగుబాటుదార్లు సైనిక స్థావరం పైన దాడి చెయ్యడం గురించి పత్రికల్లో చదవ లేదా? Organisations that fight against oppressive governments cannot be terrorist organisations.
ఒక దేశంలో విప్లవోద్యమం బలపడితే పక్క దేశాలకి కూడా భయమే. తమ దేశంలో కూడా విప్లవోద్యమాలు తలెత్తకూడదని ఆ దేశాల పాలక వర్గాలు అనుకుంతాయి. అందుకే రాజీవ్ గాంధీ శ్రీ లంకలోని తమిళ తిరుగుబాటుదార్ల పైన ఉగ్రవాదుల ముద్ర వెయ్యడం తో పాటు భారత సైనికులని శ్రీ లంకకి పంపించాడు. శ్రీ లంక తమిళుల లాగ ఆస్ట్రేలియాలోని స్థానిక జాతుల వారు, అమెరికాలోని నల్లజాతీయుల స్థావరమయిన దక్షిణ కరోలినా ప్రజలు కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కోరవచ్చు. అందుకే అమెరికా, ఆస్ట్రేలియా కూడా తమిళ తిరుగుబాటుదార్ల పైన ఉగ్రవాద ముద్ర వేశాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలు ఫలానా సంస్థల పైన ఉగ్రవాద ముద్ర వేసినంత మాత్రాన వాటిని నిజంగా ఉగ్రవాద సంస్థలని అనుకోకూడదు. —సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: Kumarsarma (చర్చ • మార్పులు) 20:39, డిసెంబర్ 6, 2008
ఇస్లాంలో ఉగ్రవాదం నిషిద్ధం కాదు
[మార్చు]నేను ఖురాన్ మరియు హదీస్ సంకలనాలు చదివాను. ఏకైక దేవున్ని నమ్మే ముస్లింలు, యూదులు మరియు నస్రానీలు (నజరేయులు) మాత్రమే స్వర్గానికి వెళ్తారని, మిగిలిన వారు నరకానికి పోతారని ఖురాన్ లో కూడా వ్రాసి ఉంది, నమ్మక పోతే ముహమ్మద్ అబ్దుల్ గఫూర్ వ్రాసిన ఖురాన్-ఏ-మజీద్ తెలుగు అనువాదం చదవండి, ఆ పుస్తకం పబ్లిష్ చేసిన వారు హుస్సామీ బుక్ డిపో, హైదరాబాద్. ఆ పుస్తకం ఇతర ప్రాంతాలలో కూడా దొరుకుతుంది. మస్జిద్ ల వద్ద కూడా దొరుకుతుంది. ఇక్కడ ఒక మతం వారు తమ మతం గురించి గొప్పగా చెప్పుకోవడానికి తమ మతంలో ఉగ్రవాదం నిషిద్ధం అని చెప్పుకుంటున్నారు. —సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: 121.245.53.184 (talk) 05:23, డిసెంబర్ 21, 2008
ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధమే
[మార్చు]ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.ఇస్లాంలో ఉగ్రవాదం నిషిద్ధం కాకపోతే ఫత్వా ఇవ్వలేరు.
- ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.
- ఇలాంటి మంచిని కోరే ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు. —సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: Nrahamthulla (చర్చ • మార్పులు) 07:29, డిసెంబర్ 22, 2008
- నువ్వు ముందు ఖురాన్ చదివి సమాధానం చెప్పు. హదిత్ సంకలనాలలో కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్రాతలు ఉన్నాయి. ఖురాన్ అనువాదం తెలుగులో చదివాను. మాతృ భాష అర్థమవ్వకపోయే సమస్య లేదు. —సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: 121.245.55.65 (talk) 10:00, డిసెంబర్ 28, 2008
- హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి.--Nrahamthulla 08:36, 29 డిసెంబర్ 2008 (UTC)
- ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. ఇస్లాంలో పక్క వాడు ఆకలితో ఉంటే అతని ఆకలి తీర్చాలని చెబుతుంది. ప్రజలు ఏ ధర్మం కోరుకున్నా దానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకూడదు.ఇతర ధర్మాలకు ఎలాంటి పరిస్థితుల్లో హాని చేపట్టకూడదని బోధించే ఇస్లాం తీవ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది?. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.7వ శతాబ్దంలోనే ఖురాన్ గ్రంథంలో నేటి 21వ ఆధునిక సమాజానికి అవసరమైన మానవ సత్సంబంధాల గురించి హదీసులు చెప్పాయి.-- ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)--Nrahamthulla 14:54, 16 ఫిబ్రవరి 2009 (UTC)
బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష
[మార్చు]ఉగ్రవాదులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది. http://telugu.webdunia.com/newsworld/news/international/0902/21/1090221045_1.htm--Nrahamthulla 01:31, 23 ఫిబ్రవరి 2009 (UTC)
సభ్యుల సంతకాలు
[మార్చు]చర్చ జరిపే వారు తమ తమ సంతకాలు పెడితే బాగుంటుంది. ఉద్వేగపూర్వకంగా కాకుండా, ఒక విషయం గురించి నిజానిజాలను నిగ్గుతేల్చేట్టుగా ఉంటే బాగుంటుంది. ఈ విషయంలో ఆంగ్ల వికీ ఏర్పరిచిన ఒరవడి ఎంతవరకూ మనకు మార్గదర్శకం కాదు. అక్కడ చర్చల స్థాయి (ద్వేష ఉద్వేగాలకు చోటివ్వటం)ఏమంత పై స్తాయిలో లేదు. ఎవరో ఏదో ఒక్క పదం వ్రాయగానే పూనకం పూనినట్టు ఆ సమయానికి అవేశంలో వచ్చిన ఆలోచనలు, తట్టిన ప్రతి మాట ఇక్కద వ్రాయటం తగదు. స్పందన ఎప్పుడూ తూకం చెడకుండా ఉంటేనే, చెప్పే విషయానికి విలువ, గౌరవం. నేనీ వ్యాఖ్యలను ఈ ఒక్క పుటగురించి మాత్రమే వ్రాయటం లేదు, ఇంకా వికీలో ఇతర పుటలలోని చర్చా వేడి, స్థాయి చూసినాక ఇలా వ్రాయలనిపించింది. తెలుగు వికీ లో కూడ ఇంతవరకు లేని అసహజ ధోరణి, సభ్యులలో వేర్పాటు కనపడుతున్నాయి. ఇవి అభిలషణీయం కాదు. మనమందరమూ, ఒక విషయం గుర్తుంచుకోవాలి, వికీలో నిజాలు మాత్రమే వ్రాయాలి. అలా వ్రాయబడ్డ విషయం నిజమని నిర్ధారించబడ్డప్పుడు అటువంటి విషయాన్ని భరించి ఒప్పుకోగల దాతృత్వం, శక్తి మనం చూపించగలగాలి. అప్పుడే వికీ స్పూర్తి అందరికి ఒకే విధంగా అర్ధమయ్యినట్టు.--SIVA 05:21, 28 డిసెంబర్ 2008 (UTC)
ఇతను ఆంగ్ల వికీపీడియాలో కూడా ఇలాగే ఇస్లామిక్ సెక్స్ పేరుతో డబ్బా వాయించాడు. ఆతను వ్రాసినవి అక్కడి సభ్యులు డిలీట్ చేసి ఇతనికి వార్నింగ్ పంపారు.
- రహంతుల్లా గారు సెక్స్ పేజిలో కూడా ఇస్లాం గురించి గొప్పగా వ్రాసుకున్నారు. అందుకే అక్కడి సభ్యులు అతని వ్రాతల్ని డిలీట్ చేసారు. ఇక్కడ ఉగ్రవాదం పేజిలో కూడా ఇస్లాం గురించి గొప్పగా చెప్పే వాక్యాలు చేర్చారు. ఆ పేజిలో కాపీ రైటెడ్ మెటీరియల్ ని చేర్చడం వల్ల కూడా తొలిగించారు.
http://en.wikipedia.org/w/index.php?title=Sexual_intercourse&diff=prev&oldid=252369755 ఇట్లు మాజీ సభ్యుడు కుమార గౌరీ శంకర శర్మ
- తెలుగు వికీలో కూడా నారాతలు అనేకం వికీ నియమాలకు అనుగుణంగా లేవని తొలగించారు.ఉండదగ్గవైతే ఉంచుతారు లేకపోతే తీసేస్తారు.ఇస్లాం గురించి గొప్పగా చెప్పకూడదని చెబితే వార్నింగ్ ఇస్తారని నాకు తెలియక చెప్పాను--Nrahamthulla 08:45, 29 డిసెంబర్ 2008 (UTC)
వెబ్ సైట్లు పెట్టిన వాళ్ళు కూడా తమ దారి తమదే అన్నట్టు మాట్లాడుతారు. గతంలో కొంత మంది అమెరికన్ నల్లజాతీయులు పెట్టిన ఒక మావోయిస్ట్ వెబ్ సైట్లో మెసేజెస్ పోస్ట్ చేశాను. తెల్లజాతి దురహంకార సామ్రాజ్యమైన అమెరికాని కూల్చడానికి ఒసామా బిన్ లాదెన్ తో చేతులు కలుపుదాం అని వాళ్ళు అన్నారు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన ఒసామా లాంటి వాళ్ళతో మనం చేతులు కలపడం ఏమిటి అని నేను వాదించాను. అంతే. నా ఐ.పి. అడ్రెస్ లు బ్లాక్ చేసారు. అప్పుడు కూడా DHCP ద్వారా ఐ.పి. అడ్రెస్ లు మార్చే వాడ్ని. ఇంకో వెబ్ సైట్ లో శాఖాహారం - మాంసాహారం విషయంలో వివాదం వచ్చింది. శుద్ధ శాఖాహారాన్ని ప్రతిపాదించినందుకు అక్కడ కూడా నా ఐ.పి.లు బ్లాక్ చేశారు. 2002 నుంచి ఇప్పటి వరకు అనేక వెబ్ సైట్లు నా ఐ.పి.లు బ్లాక్ చేశాయి. ఒక యాహూ గ్రూప్ మాత్రం ఇప్పటి వరకు నా ఐ.పి. బ్లాక్ చెయ్యలేదు. అక్కడ కూడా సభ్యుల మధ్య వితండవాదం జరిగింది కానీ అక్కడి మోడరేటర్లకి సహనం ఎక్కువ. కానీ కొన్ని వెబ్ సైట్లలో అసహనం ఎక్కువ కనిపిస్తోంది. ఆంగ్ల వికీపీడియాలో కూడా అనేక వివాదాలు ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలలో ప్రాక్సీ సర్వర్ల ద్వారా వికీపీడియా వెబ్ సైట్ ని బ్లాక్ చేశారు. అనేక స్కూల్ లు, కాలేజిలలో కూడా వికీపీడియా యాక్సెస్ చెయ్యడం నిషిద్ధం. ఈ వివరాలు సంగతి సరే. మీరు ఆంగ్ల వికీపీడియాలో చేసిన తప్పులు ఇక్కడ కూడా రిపీట్ చేస్తున్నారా? తప్పు తెలుసుకోవడం గొప్పకాదు. ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చెయ్యకుండా జాగ్రత్త పడడం గొప్ప. —సంతకం చేయకుండా చేసిన ఈ వ్యాఖ్యానాన్ని చేసిన వారు: 121.245.24.115 (talk) 15:06, డిసెంబర్ 29, 2008
- రవిచంద్రా జవాబివ్వాలా వద్దా?ఇతనెవరో గాని నేను చెయ్యరానితప్పు చేసినట్లు తీవ్రంగా తీర్మానించుకున్నాడు.ఇస్లాం గురించి గొప్పగా చెప్పటమే నాతప్పట.--Nrahamthulla 11:01, 29 డిసెంబర్ 2008 (UTC)
- ఇస్లామోఫోబియా వ్యాసం లో కూడా సేమ్ మీటర్ కాపీ మరియు పేస్ట్ చేశారు కదా. దీన్ని కూడా స్పామింగ్ అంటారు. ఆంగ్ల భాషలో వీరిని ట్రాల్స్ అని కూడా అంటారు. Internet trolls గురించి గూగుల్ లేదా లైకోస్ లో వెతుకు.
- అయ్యా కుమారశర్మ గారూ, ఆంగ్ల వికీలో పనిచేస్తూ వికీ విధివిధానాలు తెలుసుకుంటున్నందుకు సంతోషం. అక్కడి విషయాలు అక్కడే చర్చించుకుంటే మంచిది. అక్కడి నిర్వాహకుడు మీకు రెండు సముదాయాలు వేర్వేరు అని చెప్పినట్టున్నారుగా. రహంతుల్లా గారూ! శర్మగారి వ్యాఖ్యలకు స్పందించవలసిన అవసరం లేదు. --వైజాసత్య 12:31, 29 డిసెంబర్ 2008 (UTC)
ఈ వ్యాసంలో వార్తలు
[మార్చు]యుద్ధాలకు దారితీసే ఉగ్రవాదం, మతాన్ని కించపరచడం తప్పు అన్న విభాగాలలో కేవలం వార్తలు ఉన్నాయి. ఇంత విస్తృతి ఉన్న వ్యాసానికి అవి తగవు. అసలు వికీ వార్తా సంగ్రాహకం కానే కాదు. ఉదాహరణకు: రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును ఇవ్వాళ అసెంబ్లీలో తీవ్రంగా దూషించాడు అన్నది ఫలానా తేదీ ఫలానా వార్తాపత్రికలో ప్రముఖ వార్త కావచ్చు కానీ అలాంటివి విజ్ఞానసర్వస్వానికి తగవు. వార్తలు విజ్ఞానసర్వస్వానికి అనుగుణంగా మార్చాలంటే వాటిపై చాలా కృషి చేయాలి. అంజయ్యను హైదారాబాదు విమానాశ్రయంలో ఈసడించుకున్నాడు అన్నది అప్పటి దినపత్రికల్లో ప్రముఖ వార్త అయ్యుండచ్చు. కానీ తెలుగుదేశం ఉద్భవించి ఉండకపోతే అది ఒక సొల్లు కబురయ్యుండేది. అలాంటి వార్తను విజ్ఞానం ఎలా మార్చాలి? ఎక్కడ చేర్చాల్చి? ఒక ఉదాహరణగా తెలుగుదేశం పార్టీ వ్యాసంలో స్థాపన, స్థాపనకు దారి తీసిన రాజకీయ వాతావరణం గురించి చర్చిస్తూ ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యతను ఆ కాంటెక్స్టులో వ్రాయవచ్చు. --వైజాసత్య 16:14, 7 మే 2009 (UTC)
- Rahamthulla గారు మీరు తొలగించిన బాగాని మల్లి చేర్చినందుకు నన్ను క్షమించండి. ఇక విషయానికి వస్తే పైన [[రవి చెప్పినటు కేవలం వార్తలు పొండుపరచడము, వికి విజ్ఞానసర్వస్వం ఉద్దేశముకాదు. వార్తలను పొండుపరచేందుకు ఇతర వికి సోదరా ప్రాజెక్టులు ఉనాయి. కానీ ఈ విభాగాలను కేవలం వార్తల రూపంలో కాకుండా, ఒక వ్యసములా మారిస్తే బాగుంటుంది. అంత వరకు వీటిని తొలగించకండి.--Ranjithsutari 10:33, 12 సెప్టెంబర్ 2010 (UTC)