Jump to content

చర్చ:కంచ ఐలయ్య

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈ పేజి తొలగించాలని వికి కమిటికి నా మనవి

[మార్చు]

కంచె ఐలయ్య ఇలాంటి మానవద్వేషి అంటే సమాజంలో ఉంటూ తిని కూర్చునే సోమరులుగా బ్రాహ్మణులను, 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ పుస్తకం రాసి ఆర్యవైశ్య లను కించ పరిచే విదంగా వివాదాస్పద పుస్తకం వ్రాసి ప్రపంచం మీదకి వదలి కొట్టుకు చావండి అన్న పంధా లో సామాజిక బాధ్యత ని కాలరాసిన వ్యక్తి పేజీ విస్తరణ ఇక వద్దని మొలక అని తీసివేశాను, యేవరో వికిలో ఖాతాసభ్యుడు కానీ వారు కంచె ఐలయ్య పేజీ సృష్టించారు సమాజానికి హాని కంచె ఐలయ్య లాంటి పేజి తొలగించాలని వికి కమిటికి నా మనవి (ప్రతిపాదిస్తూన్నాను).05:41, 15 సెప్టెంబరు 2017‎ నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ | రచనలు | నిరోధించు)‎

ముందుగా వికీలో ఒక వ్యాసం ఉండరాదు అనుకుంటే అది తొలగించాలని వ్యాస పుటలో {{తొలగించు|కారణం}} అనే మూసను ఉంచాలి. మీరు తొలగించాలనుకున్న కారణం సరియైనదో కాదో వికీ సభ్యులు చర్చించాలి. అది తొలగించవలసినది ఐతే తొలగించబడుతుంది. వికీలో వ్యాసం ఉండాలంటే అది వికీ నియమాలను పాటించాలి. కానీ ఆ వ్యక్తి ఎలాంటివారో, వారి వ్యక్తిగత అభిప్రాయాలతో పనిలేదు. వికీపీడియా మహోన్నతమైన విజ్ఞాన సర్వస్వం. వికీలో అజ్మల్ కసబ్ వంటి తీవ్రవాదులు, కొత్తదాస్ లాంటి గూండాలు, వీరప్పన్ వంటి బందిపోటు వ్యాసాలు కూడా ఉన్నాయి. నోటబిలిటీ ఉన్న వారి వ్యాసాలు సరైన మూలాలతో ఉన్నాయి. కంచ ఐలయ్య ఒక రచయిత, సామాజిక కార్యకర్త మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయ రాజనీతి విభాగంలో అధిపతి. ఆయన నోటబిలిటీ ఉన్న వ్యక్తి కనుక వ్యాసం ఉండాలి. ఆయన రచనలపై ఏ విధమైన వివాదాలుంటే వ్యాసంలో ఉపశీర్షిక ఉంచి సరియైన మూలాలలో ఆ విషయాలను సంగ్రహంగా చేర్చవచ్చు. ఇక వ్యాసం వ్రాసే వ్యక్తి వికీలో వాడుకరి నామంతో వ్రాయాలనే నియమం ఏదీ లేదు. వాడుకరి నామంతో వ్రాస్తే అతనితో చర్చించడానికి అందరికీ అనుకూలంగా ఉంటుంది. కనుక అజ్ఞాత వాడుకరి చేసిన ప్రయత్నం మంచిదే. కనుక ఈ వ్యాసాన్ని విస్తరించాలని మనవి. ----కె.వెంకటరమణచర్చ 06:08, 22 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]