కంచ ఐలయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంచ ఐలయ్య
జననం (1952-10-05) 1952 అక్టోబరు 5 (వయస్సు: 65  సంవత్సరాలు)
పాపయ్య పేట, హైదరాబాదు, ఇండియా
చదువు
వృత్తి డైరక్టరు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్ష్లూజన్ అండ్ ఇంక్లూజివె పాలసీ (CSSEIP), మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
ప్రసిద్ధులు భారతీయ రాజకీయ విశ్లేషణ రచయిత మరియు వక్త.
దళిత-బహుజన ఉద్యమాల సిద్ధాంత కర్త మరియు ఉద్యమకారుడు.
Honours

మహాత్మా జ్యోతీరావు పూలే అవార్డు. నెహ్రూ ఫెలోషిప్ 1994-97

మాన్యవర్ కాన్షీరాం స్మృతి మాహానాయక్ పురస్కారం

కంచ ఐలయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగము యొక్క అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త మరియు రచయిత. భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఈయనను అనేకమంది విమర్శకులు (హిందువులూ, ముస్లింలు కూడా), హిందూ వర్గాలు[1] హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారు.[2]. ఐలయ్య స్వయంగా తను హిందూ మతాన్ని ద్వేషిస్తానని చెప్పుకున్నాడు.[3] ఐలయ్య ఇంగ్లీషులో "Why I am not a Hindu?" పేరుతో వ్రాసిన పుస్తకం తెలుగులో నేను హిందువు నెట్లయిత? అనేపేరుతో ప్రచురితమయ్యింది.

జీవిత విశేషాలు

ఐలయ్య 1952, అక్టోబరు 5న వరంగల్ జిల్లాలోని పాపన్నపేట గ్రామంలో కురుమ గొల్ల కుటుంబంలో జన్మించాడు. ఈయన కుటుంబం యొక్క ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. ఐలయ్య గౌతమబుద్ధుని రాజకీయ తత్త్వముపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రాజనీతిశాస్త్రంలో డాక్టరేటు పొందాడు.

ప్రత్యేక తెలంగాణా వుద్యమంపై అభిప్రాయాలు

తెలంగాణా వుద్యమ నాయకత్వంలో భూస్వామ్య యుగపు ఛాయలున్నాయని, ఈ నాయకత్వంతో తెలంగాణ ఏర్పడితే షెడ్యూల్ తెగలు, జాతులు, వెనుకబడిన తరగతులు మరింత వెనకబడతారని ఐలయ్య అభిప్రాయం.[4]

రచనలు

రచనలపై విమర్శలు

వ్యక్తిగత విమర్శలు

కేసులు

మూలాలు

ఇతర లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=కంచ_ఐలయ్య&oldid=2307230" నుండి వెలికితీశారు