Jump to content

చర్చ:కులనిర్మూలన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం విభజన

[మార్చు]
కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు మరియు కులనిర్మూలన, ఈ మూడు వ్యాసాలలో దాదాపు ఒకే రకమైన విషయాలున్నవి (ఉదాహరణలు అన్నిట్లోనా ఒకటే).
  • కులాంతర వివాహం అనగా, ఒకే మతంలోని విభిన్న కులాలవారి మధ్య వివాహం.
  • మతాంతర వివాహం అనగా, రెండు వేర్వేరు మతాలకు చెందిన వారి మధ్య వివాహం.
  • మతం అంటే మార్గం, కులం అంటే సమాజంలో వృత్తి పరమైన గుర్తింపు. వీటి సహకారంతో మనిషి ఇప్పటివరకూ జీవిస్తూ వచ్చాడు. స్వేచ్ఛగా, ఇతరులకు హాని లేకుండా జీవనం సాగిస్తే ఏ బాదరబందీ వుండదు. ఉన్మాదం లేదా 'fanaticism' బయలుదేరకూడదు. మతాంతర వివాహాలు చేసుకున్న పెద్ద పెద్ద వారికి పెద్ద సమస్యలుండవేమో, చిన్నా చితకా మనుషులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇంకనూ సమస్యల సుడిగుండమేమో, సంకర మతాలు, సంకర కులాలు అనే విభాగాలు జనియించే ప్రమాదం వున్నదేమో?. కులం అనేది సామాజిక గుర్తింపు అయితే, కులం లేకుండా పోవడం అనేది కూడా ఓ గుర్తింపేకదా! ప్రతి మనిషి తన గుర్తింపు తన సమూహపు గుర్తింపు ప్రపంచం గుర్తించాలని కోరుకుంటాడు. అలాగే పైనుదహరింపబడిన వ్యాసాల రచయిత గారు, కులనిర్మూలన గురించి వ్రాస్తూనే, దూదేకుల అనే వ్యాసం సృష్టించారు. (వారి మనసు నొప్పించియుంటే క్షమాపణలు కోరుతున్నాను). కులాలు ఉండకూడదు అని కోరుకోవడంలో ఎంత ఔచిత్యముందో, కులాలుండాలి అని కోరుకోవడంలోనూ అంతే ఔచిత్యమున్నదేమో?. కానీ ఇక్కడ కులాలు 'తక్కువ' 'ఎక్కువ' అనే ధోరణి వుండకూడదు. ఇక్కడ నిర్మూలించాల్సింది, కులాల మధ్య తారతమ్యతను, వాటి పోలికలను, మరియు అస్పృశ్యతను. ప్రతి కులస్తుడూ తాను సరి, అని అనుకుంటాడు. అలాంటి సమయంలో ఇతరులు సరి కారు అనే అర్థం స్ఫురిస్తుంది. దూదేకుల అనే వ్యాసంలో రచయతగారు, దూదేకులు మాత్రమే 'సెక్యులర్'లు అనే అర్థం వచ్చేలా వ్రాశారు. ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ ఉదాత్తులు ఉన్నారు. సర్వజ్ఞానులూ ఉన్నారు. రచయిత గారికి ఓ సూచన, వాస్తవాలను సోదాహరణంగా వివరిస్తూ వ్రాస్తే అందరూ సంతోషంగా స్వీకరిస్తారు. మీ సొంత అభిప్రాయాలు గౌరవనీయమే, సమాజంలోని సత్యాలూ గౌరవనీయమే గదా. పరస్పర గౌరవాలే మంచి భవిష్యత్తుకు నాంది. నిసార్ అహ్మద్ 12:52, 29 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అసలైన సెక్యులర్ కులం అనటానికి కారణం వీరిలో హిందూ, ముస్లిం,క్రైస్తవ ఆచారాలు మూడూ కనిపిస్తాయి కాబట్టి.అంతేకానీ దూదేకుల కులం మరో కులాని కంటే ఎక్కువని చెప్పలేదు.ఆకులాన్ని సమర్ధిస్తే కలిగే ప్రయోజనమూ లేదు.ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులాన్ని గురించి ఉన్న నిజాలు తెలిసిన విషయాలు చెప్పినట్లే ఈ వ్రాతలు కూడా.సెక్యులర్ గాఇలాగే ఇంకా ఏవైనా కులాలుంటే వాటిని గురించి తెలియ జేయండి.కులనిర్మూలనకే మన ఓటు.ఈకులాలు మనకు కూడు పెట్టవు.మనము కులాల బందీఖానాలో ఉన్నాము.కులం లేకుండా పోవడం వల్లనే మనలో నిజమైన ఐఖ్యత వస్తుంది.తెలుగు భాషపట్ల మీఅపార ప్రేమను వికీలో అనేక అంశాలపై మీరు చేసిన కృషిని చూశాను.అభినందనలు.రహంతుల్లా.
మీ అభిమానానికి, అభినందనలకి, ప్రత్యేక ధన్యవాదాలు. స్ఫూర్తిమంతమైన మీ ప్రతిస్పందన మీ విశాలత్వానికి నిదర్శనం. సెక్యులర్, సెక్యులరిజం, కులం వంటి సంబంధిత వ్యాసాలు తయారయే సమయాన చర్చించి, తీర్చి దిద్దుదాం. నిసార్ అహ్మద్ 20:59, 30 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చను పొడిగిస్తున్నందుకు మన్నించండి.కులాల పరంపర వేల సంవత్సరాలనుండి వస్తోంది. భారత్ లో వర్ణక్రమం అందులోని భాగమే. నేడు భారత్ జనభా 110 కోట్లు, కులాలు వేల సంఖ్యల్లోనే. ఒక్క మాటున కులనిర్మూలన అసాధ్యం. క్రింద నుదహరింపబడిన జంటల వివాహాలు, సామాజిక ఉద్దరణకు చేసుకున్నవి గావు. ఈ వివాహాలన్నీ 'ప్రేమవివాహాలే'. ఈ వ్యాసంలో నుదహరింపబడ్డ జంటలలో ఒక్క ఉదాహరణ సామాజిక ఉద్ధారణ కలిగినది చూపండి. వీరే గాదు. సమాజంలో అసమానతలు తొలగించడానికి నేను కులాంతర వివాహం లేదా మతాంతర వివాహం చేసుకుంటున్నాను అని పలికే జంటను ఒక్కటి చూపెట్టండి? కానరాదు. కారణం, ఈ వివాహాలన్నీ పరస్పర ఆకర్షణా ఫలితాలే తప్ప ఇంకొకటి గాదు. రాజీవ్ గాంధీ-సోనియాగాంధీ సమాజోద్ధారణకు జరిగిందా? లేదా భారతీయ సమాజానికి ఎంతో మేలు చేసేయాలని అజహరుద్దీన్-సంగీతా బిజలాని వివాహం జరిగిందా? 'కులనిర్మూలన' అనే వ్యాసంలో "నిజంగా అలాంటి భావనలు గలిగి వివాహాలు చేసుకున్న వారి డేటాను ఇందులో పొందుపరచాలి". ఈ ఉదాహరణల్లో ఒక్కటీ ఇందుకు సరిపోదేమో? ఓవేళ సరిపోతుంది అంటే ఆ ఉదాహరణలు పెడితే బాగుంటుంది. నిసార్ అహ్మద్ 09:38, 31 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిజమే ఒక్క మాటున కులనిర్మూలన అసాధ్యం.కులనిర్మూలన అనవసరం అనేవాళ్ళూ ఉన్నారు.కులాలు ఉండాలి,కులతత్వం పోవాలి అనేవాళ్ళూ ఉన్నారు.పరస్పర ఆకర్షణ,ప్రేమ ఉన్నాసరే వేరు వేరు కులాలు మతాలకు చెందిన జంటలు పెళ్ళి చేసుకోటానికి అంగీకరించని పెద్దలున్నారు.రిజర్వేషన్ల కోసమైనా కులాలుండాలి అనేవాళ్ళూఉన్నారు.మరి కులనిర్మూలనకు దేశంలో సానుకూలత రావటం కోసం ఇలాంటి చర్చలు బాగా జరగాలి. ఏకులమో ఏమతమో చెప్పుకోలేని హైబ్రీడ్ పిల్లలు భారీగా పుట్టాలి.ఈసంకర పిల్లలే రేపటి భారతావనికి శాంతి దూతలు కావచ్చు.గొంతుదాకా తిని కులం అడిగే వాళ్ళూ,కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదని విర్రవీగే వాళ్ళూ,కులంతక్కువ వాడు కూటికి ముందని అవమానించే వాళ్ళూ,కులనిర్మూలన జరిగేదాకా ఉంటారు.కులాంతర మతాంతర వివాహాలు మన దేశంలోని కులమత ద్వేషాలకు శాంతియుత విరుగుడు మందులు.ఆదర్శ వివాహాలు చేసుకున్న జంటలు మన ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్నారు కానీ వారిని ఉదాహరిస్తే ఎక్కువ మందికి తెలియరు.అందువలన ఆయా గ్రామాల పేజీల్లోనే వారి పేర్లు ఉదాహరించితే మంచిది.

వ్యాసం పరిధి

[మార్చు]

రచయితలకు ఈ రంగంలోఖచ్చితమైన అభిప్రాయాలుండవచ్చును. వాటితో ఇతరులు విభేదించవచ్చును లేదా ఏకీభవించవచ్చును. వారిష్టం. కాని ఇక్కడి చర్చలను మాత్రం వ్యాసాల రచనకు చెందిన విషయాలకు మాత్రమే పరిమితి చేయమని మనవి. నిస్సార్ గారూ! రహమతుల్లాగారూ! మీరిద్దరూ మర్యాదగా మాట్లాడుకొంటున్నారు గనుక ఇబ్బందులు లేవు. అదృష్టవశాత్తు అసలైన కులపిచ్చిగాళ్ళు ఇంకా వికీలో విజృంభించలేదు. అప్పుడుంటుంది నా సామిరంగా! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:46, 31 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]