దూదేకుల
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
|
ఆగమనం |
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఔరంగజేబ్ · కులీ కుతుబ్ షా |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్ |
ఆంధ్రప్రదేశ్ లో మస్జిద్‌లు · ఆంధ్రప్రదేశ్ లో దర్గాల జాబితా |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం |
దూదేకుల అనే కులం వెనుకబడిన కులాల 'బి' గ్రుపులో 5వది. రాష్ట్రం మొత్తం బి.సి.లలో 4% దూదేకుల వారున్నారు. ఈ కులం వారిలో సర్వమత సమానత్వం కానవస్తుంది. వీరిలో హిందూ, ముస్లిం ఆచారాలు కనిపిస్తాయి. వీరిని నూర్ బాషా, లదాఫ్, పేర్లతో కూడా పిలుస్తారు. వీరిలో 80% ప్రజలకు తెలుగు మాతృభాష కాబట్టి వీరిని తెలుగు ముస్లిములు, ఉర్దూ బాసరాని సాయిబులు అంటారు. వీరిలో హిందూ ఆచారాలు ఎన్ని ఉన్నా సున్నతి, పెళ్ళి, సమాధి ఈ మూడూ ముస్లిముల పద్ధతిలోనే ఉంటాయి. వీరిలో ఉర్దూ,అరబీ భాషలు రాని కారణాన ఒకింత ఆత్మన్యూనతా భావం,ఇస్లాం విషయాల పట్ల అంత శ్రద్ధ, విషయపరిజ్ఞానం లేదనే భావనల వల్ల కొంత జంకే స్వభావం కానవస్తుంది. కాని, ఇవి మానసిక భావనలే. ఆధ్యాత్మికతలో వీరెవరికీ తీసిపోరు. వీరు మతాచారాల పట్ల చాలా ఉదారస్వభావులుగా కానవస్తారు. కులం సర్టిఫికెట్లు కూడా హిందూ దూదేకుల,ముస్లిం దూదేకుల అని రెవిన్యూ అధికారులు నేటికీ కొన్నిచోట్ల జారీచేస్తుండటం గమనార్హం. In North India (Gujarat & Rajasthan) Noorbash's caste called as Mansoori,Bhai and Dhunia. The Great Mysore Kings Hyder Ali and Tippu Sulthan were hailed from this community.
వృత్తి[మార్చు]
పూర్వం వీరి ప్రధాన వృత్తి 'దూది'ని ఏకడం. నదాఫ్, నూర్ బాఫ్ అంటే పత్తి నుండి పింజను వేరు చేసే వారు, దూదిని శుభ్రం చేసే వారు అని అర్థం. ప్రస్తుతం ఆపని యావత్తూ జిన్నింగ్ మిల్లుల్లో జరుగుతోంది. ఆ వృత్తిని కోల్పోయిన దూదేకుల వారు బ్యాండు మేళాలలోను, వ్యవసాయ కూలిపనుల్లోను స్థిరపడ్డారు. దూదేకటం, పరుపులు కుట్టడం, నవారునేత, బ్యాండు సన్నాయి మేళం వాయించటం, సోడాలు అమ్మటం, టైలరింగ్, మెకానిక్ పనులు, వ్యవసాయ కూలీ వంటి వృత్తులపై ఆధారపడి బతుకుతున్నారు. విదేశీ కాయర్ ఉత్పత్తులు పరుపుల మార్కెట్ను ఆక్రమించేశాయి. దూదికి, దూదిపరుపులకు విలువ లేదు. కొనేవారు లేరు. గోళీసోడాలకూ కాలం చెల్లింది. టైలరింగ్ పనిచేసేవారిని ‘రెడీమేడ్’ తొక్కేసింది. మొత్తం నమ్ముకున్న వృత్తులన్నీ ప్రపంచీకరణ దెబ్బకు నిల్వలేకపోగా- దూదేకులు కొత్త వృత్తులను వెతుక్కుంటున్నారు. వ్యవసాయకూలీలుగా, డ్రైవర్లుగా కొత్త అవతారాలెత్తుతున్నారు. చదువుకున్న వర్గం వాళ్లలో అధిక భాగం ఉపాధ్యాయులుగా ఎదుగుతున్నారు. అక్కడక్కడా చిన్న ఉద్యోగాల్లో కొందరు స్థిరపడుతున్నా, చదువుకున్న వారిలో కూడా ఎక్కువమంది ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటున్నారు. చేయని వృత్తితో ఇంకా ఆ పేరు ఎందుకని కొన్ని చోట్ల తమ ఇంటి పేర్లు కూడా "నూర్ బాషా లు " ( కాంతి రాజులు ) గా మార్చుకున్నారు. మైనారిటీవర్గాలకు చెందిన కులాల్లో అత్యంత వెనుకబడివున్న దూదేకుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ ఫెడరేషన్కు ఛైర్మన్తోపాటు ముగ్గురు డైరెక్టర్లు ఉంటారు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు.దిస్తా ఆంటే పత్తిని,దూదిని ఏకటానికి వాడే పనిముట్టు.దిస్తా డంబెల్ లాగా ఉంటుంది.బొమ్మ పెట్టగలరా?
సామాజిక జీవనం[మార్చు]
దూదేకుల్లో దేశం గర్వించదగిన కళాకారులున్నారు. ముఖ్యంగా నాదస్వర సామ్రాజ్యాన్ని ఏలిన షేక్ చినమౌలానా వంటి విద్వాంసులు, బుర్రకథా పితామహుడు నాజర్ వంటి కళాకారులూ దూదేకుల కులం నుంచి ఎదిగిన ప్రముఖులు. నిజానికి దూదేకుల కులంలో నాదస్వర విద్వాంసులు అనేకమంది ఉన్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో, పండుగలు, దేవుళ్ల ఊరేగింపుల్లో, పవళింపు సేవల్లో, మేల్కొలుపు సేవల్లో దూదేకుల విద్వాంసుల నాదస్వరాలాపన ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. వీరిలో, సగం ఇస్లామీయ సంస్కృతి, సగం హిందూ సంస్కృతి ఉంది. నిజమైన లౌకికవాదులు దూదేకులు. వీరు ముస్లిం - హిందూ సంస్కృతుల సమ్మేళనంగా వుంటూ ఈ రెండూ మతాల మధ్య దూరాన్ని చెరిపేసేరు. ‘హిందూ - ముస్లిం భాయి భాయి’ అన్న నినాదం దూదేకులకు జీవనసూత్రం అయింది. ఈ సూత్రమే గ్రామీణ ప్రాంతాల్లో వీరిని ఐక్యంగా వుంచుతుంది. ఆంధ్రప్రదేశ్ లో దూదేకుల ఓటర్లు ఈనాడు 13 లక్షల మంది ఉన్నారని అంచనా: పూర్వం దూదేకుల వారు దూది ఏకి ఏకులను నేతపని వారికిస్తే వారు దారం తీసి బట్ట నేసేవారు. జిన్నింగు మిల్లుల రాకతో క్రమేణా వీరికి వృత్తి పోయి, బ్యాండు మేళాలు, పరుపులు కుట్టడం, వ్యవసాయ కూలీలు గాను మారిపోయారు. దూది ఏకి, ఏకులు చుట్టి, రాట్నం వడికి, ఆసు పోస్తారు. పరుపులు, దిండ్లు తయారుచేస్తారు. అయితే జిన్నింగ్ మిల్లులు రావడంతో వీరి వృత్తి దెబ్బతింది. దాదాపు 50 మంది చేసే పనిని జిన్నింగ్ మిల్లులోని యంత్రాలు గంటలో చేస్తాయి. పని త్వరగా పూర్తికావడం, ఖర్చు కూడా తగ్గడంతో జిన్నింగ్ మిల్లులకు ఆదరణ పెరిగి, వీరు రోడ్డున పడే పరిస్థితి ఎదురైంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితి రాక పూర్వం `కమాన్' (దూదిని ఏకే సాధనం)ను సైకిల్కు కట్టుకుని ఊరూరా తిరిగేవారు. దూదిని ఏకి మెత్తటి పరుపులు, దిండ్లు చేసి ఇచ్చేవారు. „కొబ్బరి పీచు పరిశ్రమ ఈ రంగంలో అడుగుపెట్టడం, బడా కంపెనీలు ఫోమ్ బెడ్, పిల్లోస్ను ప్రవేశపెట్టడంతో వీరి వృత్తి కోలుకోలేని విధంగా దెబ్బతింది. రానురాను వీరిలో విద్యావంతులు పెరిగారు. సాఫ్టువేర్ ఇంజనీర్లు, డాక్టర్లు మొదలైన వృత్తుల్లో స్థిరపడుతున్నారే గాని దూది ఏకే వృత్తిని ఇప్పుడు ఎవ్వరూ చేయడం లేదు. "నూర్ బాషీయులు " అనే పేరుతో ఈ కులం చరిత్ర - సంస్కృతిపై రిటైర్డ్ ఐ.ఏ.యస్. అధికారి శ్రీ ఇనగంటి దావూద్ గారు ఒక పుస్తకం రాశారు.
నూర్ బాషీయులు[మార్చు]
నూర్ భాషీయులను `ఆదా ముస్లిం' అని ముస్లిం సమాజం చిన్నచూపు చూసినా ఒంటరిపోరు చేశారే తప్ప మడమ తిప్పలేదు. అటు ముస్లింలు, ఇటు హిందువులు నూర్ భాషీయులను పరాయి వారిగా పరిగణించారే తప్ప వారిని తమలో కలుపుకోలేదు. ఇందువల్ల రెండింటికీ చెడ్డ రేవడిలా తయారైంది వీరి జీవితం అనుకుంటే పొరపాటే. తమ జీవనపోరాటంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నూరు భాషీయులు, ఒక వృత్తి దెబ్బతింటే మరో వృత్తిని ఎంచుకుని బతుకు బండిని నడిపించారే తప్ప, ఏ నాడూ చేయి చాచి యాచించి ఎరుగరు. కనుకనే వీరిలో మనకు యాచకులు కనిపించరు. నూర్ భాషీయులు మంగళ వాయిద్యాలు వాయించటంలో దిట్టలు. వీరికి అనుబంధ పరిశ్రమ అయిన చేనేత కూడా సంక్షోభంలోకి పడడంతో కూలిపనులపై దృష్టి పెట్టి తమ బిడ్డలను చదివించుకునే ప్రయత్నం చేశారు. కనుకనే వీరిలో విద్యావంతులు ఎక్కుమంది కనిసిస్తారు. కుటుంబ నియంత్రణ పాటించటం, పిల్లల్ని బాగా చదివించటం ద్వారా నూర్ భాషీయులు క్రమేణా అభివృద్ధి బాటపట్టారు. కానీ అన్ని గ్రామాల్లో నాలుగైదు కుటుంబాలు విసిరేసినట్లు ఉండటం వల్ల రాజకీయంగా సాంఘికంగా విలువలేకుండా ఉన్నందున, క్రమేణా ఇలాంటి కుటుంబాలు సమీప పట్టణాలకు వలసపోతున్నాయి.
ముస్లిములు[మార్చు]
మతపరంగా ఇస్లాంకు చెందినవారైనప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మతం హిందూ అనీ, కులం దూదేకుల అని వీరికి ధృవపత్రాలు జారీ చేస్తున్నారు. ఇస్లాం-దూదేకుల అని సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. మసీదుకు వెళ్ళము అని అఫిడవిట్ దాఖలు చెయ్యాలని ఆంక్షలు పెడుతున్నారు. తల్లిదండ్రులు దూదేకుల వృత్తి చేస్తుంటేనే బీసీ సర్టిఫికెట్ ఇస్తామని చెబుతున్నారు. అందుకే కొందరు బీసీ-బీ నుంచి వీరిని `ఇ'లోకి మార్చాలని అభ్యర్థిస్తున్నారు.
మతసామరస్యానికి ప్రతీకలు[మార్చు]
అన్ని మతాలనూ ఆచరించే కులం. శతాబ్దాల క్రితమే వీరు హిందూ మతం నుంచి ముస్లిం మతంలోని మారినా ఇప్పటి తరంలోనూ ఆ వాసనలు పోలేదు. హిందూత్వం పులుముకున్న ముస్లింలు వీరిలో కనిపిస్తారు. అయితే మతమౌఢ్యం మచ్చుకైనా కనిపించదు. రంజాన్, బక్రీద్, వంటి ముస్లిం పండుగలను ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, హిందువుల పండుగలనూ అంత నిష్ఠతో జరుపుకుంటారు. వినాయక చవితి వచ్చిందటే ఇప్పటికీ దూదిని ఏకే `కామాన్'కు బొట్లు పెట్టి పూజచేస్తారు. కొన్నిచోట్ల పెళ్ళిల్లలో మొదట గౌరీ వ్రతాన్ని ఆచరించి తర్వాత నిఖా చేసుకొంటారు. ఆఖరికి వీళ్ళ ఇంటి పేర్లు, వ్యక్తుల పేర్లు కూడా హిందూ దేవుళ్ల పేరు ఉంటాయి. కనుకనే వీరిని `ఆదా ముస్లిం'లు అని కొందరు అంటారు. ఇటీవల వీరిలో కొందరు క్రైస్తవ పాస్టర్లుగా కూడా ఎదిగారు.
దూదేకుల ప్రముఖులు[మార్చు]
- Noor Mohammed Ex Muncipal Chairman
దూదేకుల చదువుల బాబు దేశీయ ప్రముఖ బాల కథా రచయిత (శతాధిక సన్మాన గ్రహీత)
- బిబీ నాంచారి
- బుర్రకథ నాజర్
- గంటా మస్తానయ్య
- మైసూర్ కింగ్ హైదర్ అలీ
- మైసూర్ కింగ్ టైగర్ టిప్పు సుల్తాన్
రాజకీయనాయకులు[మార్చు]
- షేక్.సాబ్జీ (ఎం.ఎల్.సి - టీచర్స్),
- ఆస్పరి ఫకురుబీ మహమ్మద్ రఫీ (దూదేకుల కార్పొరేషన్ చైర్మెన్),
- షేక్. సుభాషిణి (టైలర్స్ కార్పోరేషన్ చైర్మన్),
- షేక్ నూర్జహాన్ పెదబాబు (మేయర్ - ఏలూరు),
- నూర్ మహ్మద్ (మాజీ మున్సిపల్ చైర్మన్ - అనంతపురం),
- చమన్ సాహెబ్ (Ex.ZP చైర్మన్ - అనంతపురం),
- షేక్ నాగుల్ మీరా (మాజీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్),
- పి.బాబన్ (మాజీ దూదేకుల ఫెడరేషన్ చైర్మన్),
- డా షేక్.దస్తగిరి (మున్సిపల్ చైర్మన్ - వినుకొండ),
- డి.హుసేన్ భి (మున్సిపల్ చైర్మన్ - గుత్తి),
- పాలగిరి.ఫయజుర్ రహమాన్ (వైస్ మున్సిపల్ చైర్మన్ - రాయచోటి),
- షేక్ లాల్ వజీర్ (మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్),
- షేక్ సయ్యద్ బాజీ (యస్.యస్.బాజి - ఉంగుటూరు) మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్,
- ఓతూరి రసూల్ (కడప),
- ఆస్పరి మహమ్మద్ రఫీ (పులివెందుల),
- యస్.యమ్.ఆర్ పెదబాబు (ఏలూరు),
- కె.పీర్ మహమ్మద్ (బుజ్జి - గుంటూరు),
- షేక్.సుభాన్ (రాజమండ్రి),
- జర్నలిస్టు దస్తగిరి (పొలిటికల్ జేఏసీ చైర్మన్)
తాత్వికులు[మార్చు]
కళాకారులు[మార్చు]
- బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్, గుంటూరు జిల్లా:
- పద్మశ్రీ (షేక్ చిన మౌలానా) కరవది 5.12.1924
- పద్మశ్రీ (షేక్ మహబూబ్ సుభాని & కాలేషాభి) (శ్రీరంగం - చెన్నై),
- పద్మశ్రీ (హసన్ సాహెబ్ గోసవీడు) (భద్రాచలం టెంపుల్)
- నాగూర్ బాబు ( మనో ) సినీ గాయకుడు (తెనాలి)
- ఆలీ (నటుడు) (సుప్రసిద్ధ తెలుగు సినీ నటుడు) (రాజమహేంద్రవరం)
- ఖయ్యూం - తెలుగు సినీ నటుడు, ప్రసిద్ధ నటుడు ఆలీ చిన్న తమ్ముడు. (రాజమహేంద్రవరం)
క్లారినెట్ విద్వాంసులు[మార్చు]
- కంకటపాలెం సుభాన్ సాహెబ్
- సూరాలపల్లి మౌలాసాహెబ్
- జగ్గయ్యపేట హుసేన్ సాహెబ్
- కారుమూరు షేక్ మీరాసాహెబ్
- ఈదుమూడి పీరుసాహెబ్
- తెనాలి షేక్ సాంబయ్య
- నూర్ బాషా పెద సైదులు పెదకొదమగుండ్ల
నాదస్వర విద్వాంసులు[మార్చు]
- షేక్ నబీసాహెబ్ సాతులూరు 1825
- షేక్.పీరు కొరువాడ కొటపాడు విశాఖపనం
- షేక్ చిననసర్ది పెదనసర్దీ సోదరులు చిలకలూరిపేట 1830
- షేక్ పెదహుసేన్ చినహుసేన్ దాదాసాహెబ్ గాలిబ్ సాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1850
- షేక్ పెదమౌలా చినమౌలా నసర్దిసాహెబ్ సోదరులు అమ్మనబ్రోలు 1890
- షేక్ చినపీరు పెదపీరుసాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1904
- నసర్దిసాహెబ్ ఆదంసాహెబ్ ఎం.ఎల్.సి.సోదరులు చిలకలూరిపేట 1915
- వల్లూరు ఆదంసాహెబ్ వల్లూరు 1850
- ఇనగంటి సుబ్బన్న 1875
- కొమ్మూరు పెంటుసాహెబ్ 1890
- కొమ్మూరు సిలార్ సాహెబ్ 1928
- రాచవారిపాలెం కాసింసాహెబ్ 1850
- దొప్పలపూడి ఆదంసాహెబ్ 1885
- ఆదిపూడి రంతుల్లా 1910
- నందిగామ ఉద్దండుసాహెబ్ 1925
- ముండ్లపాడు హసాన్ సాహెబ్ నందిగామ
- షేక్ మహబూబ్ సుభాని కాలేషాబీ దంపతులు 1955 ఫిరోజ్ బాబు
- శ్రీ త్రోవగుంట షేక్ హసాన్ సాహెబ్ 1915 ( పద్మశ్రీ షేక్ చిన మౌలానా గురువుగారు)
- శ్రీ త్రోవగుంట షేక్ కస్మూర్ మస్తాన్ సాహెబ్ 1954 ఒంగోలు
- పద్మశ్రీ షేక్ చిన మౌలానా కరవది 5.12.1924
- వల్లూరిపాలెం మస్తాను 1925
- పందలపాడు సైదులు 1926
- షేక్ మీరాసాహెబ్ సన్నాయి సైదమ్మ దంపతులు మిడమలూరు ఒంగోలు
- షేక్ హసన్ సాహెబ్ రెంటపాళ్ళ
- షేక్ పెదసైదులు అనంతవరం (క్రోసూరు మండలం)
- షేక్ చిన లాలుసాహెబ్ మాచర్ల ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
- షేక్ పెద లాలుసాహెబ్ మాచర్ల ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
- షేక్ రంజాన్ సాహెబ్ మాచర్ల ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
- కశ్యపురం కాశింసాహెబ్ జే.పంగులూరు మండలం
- అద్దంకి దస్తగిరి సాహెబ్
- గొనసపూడి మస్తాన్ సాహెబ్ నాగులుప్పలపాడు మండలం
- అద్దంకి నాగూరు సాహెబ్ 1930 - 17.1.2019 ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు.
- దూదేకుల చదువుల బాబు దేశీయ ప్రముఖ బాల కథా రచయిత ( శతాధిక సన్మాన గ్రహీత)
విద్యావేత్తలు,అధికారులు[మార్చు]
- దూదేకుల ఖాసీంసాహెబ్ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, సివిల్ సప్లై, ఫారెస్ట్ గవర్నమెంట్ జిపి
- డాక్టర్ ఖాదర్ వలి దూదేకుల మైసూరులోని భారతీయ ఆహార పరిశోధన సంస్థలో సీనియర్ సైంటిస్ట్
- డాక్టర్ మస్తాన్ (అనస్తీషియా స్పెషలిస్టు ఎన్.ఆర్.ఐ.హాస్పిటల్) ,మంగళగిరి.
- జి.ఎ.రహీం రిటైర్డ్ ఐ.జి.ఆఫ్ పోలీస్ (నూర్జహాన్,శాల్యూట్ పత్రికలసంపాదకుడు),
- ఇనగంటి దావూద్ (నూర్ భాషీయులు గ్రంథరచయిత) హైదరాబాద్:
- పి.రంజిత్ బాషా (ఐ.ఏ.యస్ -క్రిష్ణా జిల్లా కలెక్టర్)
- షేక్.చాన్ బాషా (ఐ.ఆర్.యస్ - అడిషనల్ కమిషనర్ చెన్నై)
- షేక్. ఆదం సాహెబ్ (ఆర్టీసి - ఈడి)
- షేక్. సుభాన్ సాహెబ్ ( ఆర్.డి.ఓ- విశాఖపట్నం)
- షేక్.షాహిద్ (కమీషనర్ - ఏలూరు),
- షేక్. షాను (రైల్వే డిఎస్పీ - తిరుపతి),
- కె.ఖాదర్ బాషా ( డిఎఫ్ఓ - మార్కాపురం)
- షేక్ బుడాన్ (ఐ.ఏ.ఎస్)
- వీరబ్రహ్మం (ఐ.ఏ.ఎస్)
- గగ్గుటూరి.రాజకిషోర్ బాబు (రిటైర్డ్ ఐ.పి.యస్),
- షేక్. షేక్షావలి (రిటైర్డ్ ఐ.పి.యస్)
- షేక్.అబ్దుల్ అజీజ్ (రైల్వే డిఎస్పీ - గుంతకల్లు),
- కాలేషావలి (రిటైర్డ్ డిఎస్పీ - సత్తెనపల్లి),
- డి. నాగరాజు (రిటైర్డ్ డిఎస్పీ),
- డి. హుస్సేన్ పీరా (రిటైర్డ్ డిఎస్సీ),
- ఎస్.ఎం.సుభాన్ (హైకోర్టు న్యాయవాది),
- మహబూబ్ ఆలీ , రైల్వే చీఫ్ ఇంజనీర్.
- నూర్ బాషా అబ్దుల్ (ప్రొఫెసర్ -నాగార్జున యూనివర్సిటీ),
- డాక్టర్ షేక్ శ్రీనివాసరావు పి.హెచ్.డి. ప్రిన్సిపల్ సైంటిస్ట్, హిటిరో డ్రగ్స్, (కొరిశపాడు)
- షేక్ మదీనా సాహెబ్ , రిటెయిర్ద్ సివిల్ ఇంజనీర్,
- షేక్ అలీ , సబ్-ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, కాకినాడ
- షేక్ వలి హామిద్ ఆలి , ఛీఫ్ టెలిగ్రాఫ్ ఆఫీసర్, రాజమండ్రి:
- డిప్యూటీ కలెక్టర్లు నూర్ బాషా రహంతుల్లా ,నూర్ బాషా ఖాశిం (కంకటపాలెం)
- మౌలాలీ , ప్రముఖ భౌతిక శాస్త్ర అధ్యాపకులు, (20 సంవత్సరాల అనుభవజ్ఞులు), ప్రొద్దుటూరు.
- బాల హుస్సేన్ , జూనియర్ టెలికాం ఆఫీసర్
- డీ. కబీర్ చెవి,ముక్కు,గొ0తు వైద్య నిపునులు, (28 స.అనుభవం) కర్నూలు
దూదేకుల కవిత్వం[మార్చు]
పోతులూరి వీరబ్రహ్మం వద్ద శిష్యరికం చేసిన సిద్దప్ప - కులమత అంతరాలను, విద్వేషాలను సామాజిక అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించాడు. పీర్ల పండుగనూ, దసరాను దూదేకులు ఒకేరకంగా జరుపుకుంటారు. నిజమైన ఏకత్వాన్ని, పరమత సహనాన్ని, స్నేహభావాన్ని దూదేకుల జీవితం ప్రతిబింబిస్తుంది.ఆధునిక కవుల్లో దిలావర్, ఖమ్రొద్దీన్, యాకూబ్ వంటి వారు తెలుగు కవిత్వంలో తమదైన స్థానాన్ని నిలుపుకున్నారు. ఇస్లాం మతంలో అసలు కులమే లేదని చెప్తూనే దూదేకులను తక్కువగా చూసే, ఎగతాళి చేసే ‘మోలీసాబ్’ల మోసాన్ని నిలదీస్తున్నారు. హిందూపేర్లతో, హైందవ సంస్కృతిని ఆచరిస్తూ ముస్లింలుగా కూడా వుంటూ రెండు సంస్కృతులనూ పాటిస్తున్నారు. దూదేకుల్లో దేశం గర్వించదగిన కళాకారులున్నారు. దూదేకులలో నాదస్వర విద్వాంసులు అనేకమంది వున్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో, పండుగలు, దేవుళ్ల ఊరేగింపుల్లో, పవళింపు సేవల్లో, మేల్కొలుపు సేవల్లో దూదేకుల విద్వాంసుల నాదస్వరాలాపన ఎంతో ప్రాముఖ్యత కలిగి వుంది. వీరిలో, సగం ముస్లిమీయ సంస్కృతి సగం హిందూ సంస్కృతి ఉంది. వేషం, భాష, ఆచార వ్యవహారాలన్నింటిలో ఈ సంయుక్త సంస్కృతి కనిపిస్తుంది. ఈ దేశంలో నిజమైన లౌకికవాదులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్లు దూదేకులే. ఎందుకంటే ముస్లిం - హిందూ సంస్కృతుల సమ్మేళనంగా వుంటూ ఈ రెండూ మతాల మధ్య దూరాన్ని చెరిపేసేరు. ‘హిందూ - ముస్లిం భాయి భాయి’ అన్న నినాదం దూదేకులకు జీవనసూత్రం అయింది. దూదేకుల కవిత్వానికి ఖాజా, యాకూబ్, షాజహానా, యండి యాకూబ్పాషా, దిలావర్ వంటి కవులు వాకిలి తెరిచారు.
దూదేకుల సాయిబుల మీద సామెతలు[మార్చు]
- దూదేకులవానికి తుంబ తెగులు (అందుకే ఆ వృత్తి జిన్నింగ్ మిల్లులకొదిలేశారు)
- దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (ఏంలోటూ లేదు ఇంకో పని చేసుకొని బ్రతకొచ్చు)
- తురకలు లేని ఊళ్ళో దూదేకులసాయిబే ముల్లా (ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టులాగా)
ఇలాంటి సామెతలు వీళ్ళ మీద అపహాస్యంగా చులకన భావంతో పుట్టించినా, అనాటి సాంఘిక పరిస్థితులు ఆయా ఈ ఎదుర్కొన్న అనుభవాలను ఈ సామెతలు కళ్ళకు కడతాయి.
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- Dudekula is a class of Muslims particular to south India engaged in cotton cleaning and still following certain Hindu customs. (page 936 Anantapur gazatteer)
- A Muslim sect peculiar to the south who still profess certain Hindu customs (page 381,839 Nellore & cuddapah gazatteers)
- https://web.archive.org/web/20160306234828/http://nrahamthulla.blogspot.in/2010/05/blog-post_06.html
- http://nrahamthulla.blogspot.in/2010/05/blog-post_8965.html[permanent dead link]
- https://www.facebook.com/nrahamthulla/posts/1518055761559742?comment_id=2563428990355742¬if_id=1563895725211933¬if_t=feed_comment_reply
- https://web.archive.org/web/20170223052847/http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html
- https://www.facebook.com/photo.php?fbid=2250290951669549&set=a.233025936729404&type=3&theater