అమ్మనబ్రోలు
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°35′13″N 80°08′46″E / 15.587°N 80.146°ECoordinates: 15°35′13″N 80°08′46″E / 15.587°N 80.146°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | నాగులుప్పలపాడు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 31.32 కి.మీ2 (12.09 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 7,515 |
• సాంద్రత | 240/కి.మీ2 (620/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1074 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08592 ![]() |
పిన్(PIN) | 523180 ![]() |
అమ్మనబ్రోలు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 180,, ఎస్.ట్.డి.కోడ్ = 08592.[2]
గ్రామ భౌగోళికం[మార్చు]
గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది.
సమీప గ్రామాలు[మార్చు]
దేవరంపాడు 4 కి.మీ, వినొదరాయునిపాలెము 5 కి.మీ, రాపర్ల 6 కి.మీ, చేజర్ల 6 కి.మీ, తిమ్మసముద్రం 6 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
పశ్చిమాన ఒంగోలు మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన కొత్తపట్నం మండలం, ఉత్తరాన చినగంజాము మండలం.
గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]
ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది. అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్, విజయవాడ-చెన్నై రైలు మార్గంలో ఉంది.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
సి.ఎస్.ఆర్. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
- ఈ పాఠశాలలో చదువుచున్న ఎం.సతీష్, ఎం.శ్రావణి అను విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైనారు. వీరు త్వరలో చిత్తూరులో నిర్వహించు రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొంటారు. [5]
- ఈ పాఠశాల విద్యార్థులు హజర, గౌరీసుజాత తయారు చేసి రాష్ట్రస్థాయి ప్రదర్శించిన, వర్షపు నీటి నిల్వలో తీసుకొనవలసిన జాగ్రత్తలు అను నమూనా రాష్ట్రస్థాయి ప్రదర్శనలో విజయం సాధించి, జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. [6]
- ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న కాటూరు బాండుబాబు అను విద్యార్థి, ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొని జట్టు స్వర్ణపతకం సాధించడంలో కీలక పాత్ర వహించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. 2017, మే-24 నుండి 28 వరకు మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో గల ఛత్రపతి శివాజీ స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో ఈ విద్యార్థి, మన రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి, జట్టుకు రజతపతకం సాధించడంలో కీలకపాత్ర వహించాడు. [7]&[9]
ఆంధ్ర ప్రదేశ్ బాలికల గురుకుల పాఠశాల (A.P. RESIDENTIAL SCHOOL)[మార్చు]
శ్రీ సాయి విద్యా నికేతన్[మార్చు]
విఙానభారతి ఆంగ్ల మాధ్యమ పాఠశాల[మార్చు]
ఎస్.టి.కాలనీలోనిప్రాథమిక పాఠశాల[మార్చు]
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
- హోమియో వైద్యశాల.
- ఎస్.టి.కాలనీలోని అంగనవాడీ కేంద్రం.
- సాక్షరతా భారత్ కేంద్రం.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గుడిపూడివారి చెరువు:- ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి పథకంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనినీ, చెరువు కట్టలను పటిష్ఠీకరణ పనులను, 2017, జూలై-3న ప్రారంభించారు. [10]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి అజ్జం సరోజిని, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ చెన్న మల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం[మార్చు]
ఈ ఆలయానికి చదలవాడ గ్రామ రెవెన్యూ పరిధిలో 2.6 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఈ ఆలయంలో, దసరాకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. [4]
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]
శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి ఆలయం[మార్చు]
శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయధారిత వృత్తులు
గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]
- "ఈదర హరిబాబు", 1989-94 వరకూ అమ్మనబ్రోలు గ్రామ సర్పంచిగా పనిచేశారు. ఆ వెంటనే శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు నుండి శాసనసభకు ఎన్నికైనారు. [3]
- ఆకురాతి గోపాలకృష్ణ
నాదస్వర విద్వాంసులు[మార్చు]
- షేక్ పెదమౌలా చినమౌలా నసర్దిసాహెబ్ సోదరులు 1890
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామం మండలంలో రెండవ అతి పెద్ద గ్రామం.
ఈ గ్రామంలోని ఎస్.టి.కాలనీలో, శ్రీమతి మేకల లక్ష్మమ్మ అను ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు ఉన్నారు. ఈమె 2017, జూలై-1న కాలధర్మం చెందినారు. [8]
🙏అమ్మనబ్రోలుసీమవిశేషము🙏
నాడు 🐘
ఆంధ్రదేశములో ఉన్న ఈప్రదేశము తూర్పుచాళుక్యుల కాలంలో వేంగి విషయము (దేశము) లోని కమ్మనాడు. రెడ్డి, గజపతి, విజయనగర కాలంలో కొండవీటి రాజ్యంలోని అమ్మనబ్రోలుసీమ. (ప్రకాశంజిల్లా) పూర్వం మద్రాసుప్రెసిడెన్సీలో అమ్మనబ్రోలు శాసనసభ నియోజక కేంద్రము.ఇప్పుడులేదు.
నేడు 🐅
అమ్మనబ్రోలు ప్రకాశంజిల్లా, నాగులుప్పలపాడు మండలంలో ఒక పెద్ద పంచాయితి గ్రామము. విజయవాడ- మద్రాసు రైల్వేలైన్ లో అమ్మనబ్రోలు రైల్వేస్టేషను ఉంది. కనపర్తి, చదలవాడ, అమ్మనబ్రోలు, ఉప్పుగుండూరు, తిమ్మసముద్రం మొదలగు ఎన్నో చారిత్రక గ్రామాలు చిత్రంగా నాగులుప్పలపాడు మండలంలో ఉన్నాయి.
అమ్మనబ్రోలుసీమ (పరధి) 🦜
(మొత్తంప్రకాశంజిల్లాలోనేఉన్నది.)
1.నాగులుప్పలపాడు మండలం
2.ఒంగోలు మండలం
3.టంగుటూరు మండలం
4.కొత్తపట్నం మండలం
5.సంతనూతలపాడు మండలం
6.చీమకుర్తి మండలం
7.మద్దిపాడు మండలం
8.చిన్నగంజాం మండలం (కొంతభాగం)
9.జనకవరం పంగులూరు మండలం? (కొంతభాగం)
10.ఇంకొల్లు మండలం? (కొంతభాగం)
11.కొరిశపాడు మండలం (కొంతభాగం)
🦚అమ్మనబ్రోలుసీమ (ఎల్లలు) 🦚
1.అద్దంకి (ప్రకాశంజిల్లా) రాజధానిగా పాలించిన రెడ్డి రాజ్య స్థాపకుడు శ్రీ ప్రోలయవేమారెడ్డి (సా.శ..1335-1353) చిట్టమంచి తిమ్మన బట్లుశాస్త్రులు వారికి సా.శ..1335 నాడు తన రాజ్యంలో, శ్రీశైలభూమి లోని, "అమ్మనబ్రోలుసీమ"లో రామతీర్థం(చీమకుర్తిమండలం) గ్రామము, మరియు అనుబంధ గ్రామాలు చీమకుర్తి(మండలకేంద్రం), భీమేశ్వరం(ఎక్కడో తెలియదు), పులికొండ(చీమకుర్తిమండలం), మైలవరం(చీమకుర్తిమండలం), కొమారపురి(ఎక్కడోతెలియదు) మొత్తం ఆరు అగ్రహార గ్రామాలు స్వతంత్రంగా,వంశ పారంపర్య హక్కుగా దానముచేసారు. అయితే ఈ శాసనం ఆనాటిది కాదని, మరలా అగ్రహారీకులు ఎత్తి రాయించారని మల్లంపల్లి వారి అభిప్రాయం.
ఆధారం,రెడ్డిసంచిక.పుట.452,453.చీమకుర్తి శాసనం.
2.ప్రతాపరుద్రగజపతి(సా.శ..1497-1538) కాకొల్లి తిమ్మ పండితులకు,"అమ్మనబ్రోలు"దండపాట(రాజ్యప్రదేశం)లోని గుండిమడ(గండమాల,కొత్తపట్నం మండలం) గ్రామాన్ని దానముగా ఇచ్చారు. ఈ తామ్ర శాసనసమయంలేదు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు, 1.భాగం,పుట,185.
3.శ్రీ కృష్ణ దేవరాయలు(సా.శ..1509-1529) పాలనలో మహామంత్రి సాళువ తిమ్మరుసు సా.శ..1511 నాడు కొండవీటి రాజ్యంలోని"అమ్మనబోలుసీమ"ను సురానాయిని "అబ్బానాయని"కి ఇచ్చారు.సదరు అబ్బానాయిని గారు "అమ్మనబ్రోలుసీమ"నుండి కొచ్చర్లకోట(దొనకొండమండలం) కటక సాలుంగపట్టున(వెళ్లే మార్గాన) తన సీమకు చెందిన గోనుగుంట(చీమకుర్తిమండలం) గ్రామ శ్రీ అమరేశ్వర దేవరకు సాళువ తిమ్మరసు పుణ్యంగా, ఆ ఊర్లోనే కొంత భూమిని ఇచ్చారు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు, రెండోభాగం.పుట.975.గోనుగుంట శాసనం.
4.శ్రీ కృష్ణ దేవరాయలు(సా.శ..1509-1529) పాత గుంటూరు జిల్లాలోని ఎనిమిది దుర్గాలు జయించి, తన ఇద్దరు భార్యలు చిన్నాదేవి,తిరుమలదేవి తో సా.శ..1515 నాడు అమరావతి (గుంటూరజిల్లా) శ్రీ అమరేశ్వర దర్శించి, తులాపురుష దానం(ఆభరణాలతో నిలువుదోపిడి)చేసి, తన తల్లిదండ్రులు నాగదేవి, నరసరాయలు పుణ్యంగాను"అమ్మనబ్రోలుసీమ" లోని వల్లూరు (టంగుటూరుమండలం) గ్రామాన్ని, తమ పురోహితులైన రంగనాథ దీక్షితులు వారికి ఇచ్చారు. అలాగే"అమ్మనబ్రోలు సీమ"లోని కొత్తపల్లి (మద్దిపాడు మండలం), తోగుంట (త్రోవగుంట, ఒంగోలుమండలం) గ్రామాలను శివా దీక్షితులు వారికి ఇచ్చారు.
ఆధారం, దక్షిణభారతశాసనాలు, ఆరోభాగం.శాసననంబరు,248. అమరావతిశాసనం.
5.శ్రీకృష్ణదేవరాయలు (సా.శ..1509-1529) ప్రభుత్వంలో సా.శ..1528 నాడు "అమ్మనబోలు సీమ"లోని దొడ్డారం(దొడ్డవరం, మద్దిపాడుమండలం)గ్రామంలోని శ్రీ మల్లికార్జున దేవరకు ఆ ఊర్లోనే కొంత భూమిని ఇచ్చారు. ఇచ్చిన వారెవరో శాసనంలో చెప్పబడలేదు.
ఆధారం,నెల్లూరుజిల్లాశాసనాలు, రెండోభాగం.పుట,969.దొడ్డవరంశాసనం.
6.శ్రీ అచ్యుతదేవరాయలు(సా.శ..1530-1542) పాలనలో కొండవీటి రాజ్య పాలకుడు బయకార రామప్పయ్య(రాయసం కొండమరుసయ్యఅన్న, రామయభాస్కరుడు(బాచరసు) అన్న పెద్ద తిమ్మయ్య కుమారుడు) సా.శ..1538 నాడు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారికి "అమ్మనబ్రోలుసీమ" లోని కొప్పోలు (ఒంగోలుమండలం) గ్రామాన్ని దానంగా ఇచ్చారు.
ఆధారం, t.t.d.శాసననివేదిక.పుట.251,252.
7.శ్రీ సదాశివరాయలు (సా.శ..1542-1576) పాలనలో కొండవీటి రాజ్యపాలకుడు, అళియ రామరాయలమేనల్లుడు, సిద్ది రాజుతిమ్మరాజు (సా.శ..1554-1561) పుణ్యంగాను స్థానికపాలకుడు (అమ్మనబోలు సీమ?) మందపాటి అప్పళరాజు సా.శ..1558 నాడు "అమ్మనబోలుసీమ"లోని చదలవాడ(నాగులుప్పలపాడు మండలం) శ్రీ రఘునాయక స్వామివారి స్థలం(సంత)లోకి అద్దంకిసీమ, "అమ్మనబోలుసీమ"ల నుండి తెచ్చి అమ్ముకునే ధాన్యాలు,పదార్థాలు మొదలగు వాటిపై వచ్చే పన్ను స్థానిక చదలవాడ శ్రీ రఘునాయక స్వామి వారికి సమర్పించారు.
ఆధారం,నెల్లూరుజిల్లాశాసనాలు, రెండోభాగం.పుట.953,954. చదలవాడశాసనం.
8.శ్రీ సదాశివరాయలు(సా.శ..1542-1576) పాలనలో సిద్ది రాజు రంగప్పరాజయ్యదేవ సా.శ..1565 నాడు కొండవీటి రాజ్యంలోని అద్దంకి,"అమ్మనబోలుసీమ" లోని చదలవాడ (నాగులుప్పలపాడు మండలం) శ్రీ రఘునాయక స్వామి వారికి తమ పూర్వుల పుణ్యం గాను చదలవాడ, జనకవరం పంగులూరుమండలంలోని చిన్న మల్లవరం, అలవలపాడు గ్రామాల సుంకాన్ని సమర్పించారు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు, రెండోభాగం.పుట.948. చదలవాడ శాసనం.
9.శ్రీవీరప్రతాప (3) శ్రీరంగరాయలు (సా.శ..1642-1680) పాలనలో సా.శ..1643 నాడు దావండ కూరి ఆజ్ఞ. (పూర్వం?) మాకుండ ఇమ్మడి శీతాజుహివ ఓడయలు రాసిచ్చిన దాన పత్రం ప్రకారం? "అమ్మనబోలుసీమ"లోని చదలవాడ(నాగులుప్పలపాడు మండలం) స్థలం పోలయరెడ్డి, దేవరాయలు సమర్పించిన తామ్ర శాసనం. ఈ శాసనం పూర్వ రాజుల ఆజ్ఞ మరల పునరుద్ధరణ అనిపిస్తుంది.
ఆధారం,నెల్లూరుజిల్లాశాసనాలు, రెండోభాగం.పుట,957.చదలవాడ శాసనం.
10.శ్రీ ఎర్రం దేవరాజయ్య ద్వారా "అమ్మనబోలుసీమ"లోని చిన్న చేజర్ల(ఒంగోలుమండలం) గ్రామాన్నిపొందిన రామానాయుని గారు చేజర్ల శ్రీ చెన్నకేశవ దేవరకు ఆ వూరి నైరుతి భాగంలో కొంత భూమి సమర్పించారు.శాసన సమయం లేదు.
ఆధారం,నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం.పుట,959.చేజర్ల శాసనం.
11.శ్రీ "అమ్మనబోలుసీమ"లోని నూతలపాడు చెన్నకేశవదేవరకు తిమ్మప్ప(ఎప్పటి పాలకుడో ?) నూతలపాటి పరిసరాలలో కొంత భూమి దానంగా ఇచ్చారు. ఈ దాన శాసనం స్పష్టంగా లేదు. శాసనం సమయం లేదు.
అథారం,నెల్లూరుజిల్లాశాసనాలు, మూడోభాగం.పుట,1120. సంతనూతలపాడు శాసనం.
🐅అమ్మనబ్రోలుసీమపాలకులు🐆
1.శ్రీ పురుషోత్తమగజపతి(సా.శ..1466-1497) ప్రభుత్వంలో సర్వేపల్లితిమ్మారెడ్డి(సా.శ..1582-1596) కలడు .ఇతని తండ్రి పేరు కూడా తిమ్మారెడ్డి. ఇతనికి హిందూరావు సూరథాణి అని బిరుదు కలదు. ఇదే బిరుదు కొద్ది మార్పుతో హిందూరాయ సురత్రాణ అని సంగమ వంశీయుడు 1.వీర దేవరాయలు(సా.శ..1378-1422) కూడా కలదు. సర్వేపల్లి తిమ్మారెడ్డి శాసనములు, అమ్మనబ్రోలు సీమలోని చదలవాడ(నాగులుప్పలపాడు మండలం),సంతరావూరు(చిన్నగంజాంమండలం) ఉండుటవలన "అమ్మనబ్రోలుసీమపాలకుడు"గా భావించాము.
ఆధారం, దక్షిణ భారతదేశ శాసనాలు.10 వ భాగం.శాసన నెంబరు,731.నెల్లూరుజిల్లా శాసనాలు.రెండో భాగం.పుట,951.
2.శ్రీ కృష్ణ దేవరాయలు(సా.శ..1509-1529) ప్రభుత్వంలో సూరనాయిణి "అబ్బానాయిణి" సా.శ..1511 నాడు "అమ్మనబోలుసీమ పాలకులు"గా ఉన్నారు. సా.శ.1511 సమయాన్ని శ్రీకృష్ణదేవరాయలు తొలి కళింగ దండయాత్ర గా అనుకోవాలి. మరలా గజపతులు చేతుల్లోకి ఈ ప్రాంతం వెళ్ళిపోయింది. గోనుగుంట(చీమకుర్తిమండలం) శాసనం ఆధారం.
ఆధారం,నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం.పుట,975.
3.శ్రీ కృష్ణ దేవరాయలు(సా.శ..1509-1529) గజపతులపై తన మలి కళింగ దండయాత్ర లో భాగంగా సా.శ..1514 నాడు ఉదయగిరి రాజ్యాన్ని జయించాడు.తరువాత సా.శ..15 15 నాడు పాత గుంటూరు జిల్లాలోని అమ్మనబ్రోలుసీమ, అద్దంకిసీమ,వినుకొండసీమ, నాగార్జునకొండసీమ,తంగెడసీమ, బెల్లంకొండసీమ,కేతవరంసీమ, చివరగా "కొండవీటి"దుర్గాన్ని జయించాడు.అయితే శ్రీకృష్ణదేవరాయలు జయించిన దుర్గాలు వాటి పాలకులు పేర్లు వరుస క్రమంలో కాకుండా శాసనంలో గజిబిజిగా ఉన్నాయి. వాటిలో "అమ్మనబ్రోలుసీమ" పాలకుడు పేరు చెప్పటం కష్టమే? శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ప్రాంతం జయించే సమయానికి గజపతుల పాలనలో పాత గుంటూరు జిల్లాలోని ఎనిమిది దుర్గాలలో పాలకులు ఎవరు ఉన్నారు అనేది ఒక అంచనా! రాయలు ఉదయగిరి చేయించాక వీరభద్రగజపతి కొండవీడు వచ్చాడు కనుక.
1.వీరభద్రగజపతి "కొండవీడుసీమ"పాలకుడు.అనేది అర్థం అవుతుంది.
2."నాగార్జునకొండసీమ"పాలకుడు శ్రీనాధరాజులక్ష్మిపతిరాజు.అని భావించవచ్చు?. ఎందుకంటే సా.శ.. 1491,నాగార్జునకొండశాసనం, సా.శ..1508 గురజాలశాసనంలో శ్రీనాధరాజు వంశీయులు ఆసీమకు పాలకులుగా ఉన్నారు.
3."కేతవరంసీమ" పాలకుడు పూసపాటి రాచిరాజు అనేది అనేక కావ్యాల్లో రుజువైంది.
4.కుమార హంవీరమహాపాత్రుని కొడుకు నరహరిపాత్రులు.
5.రాచూరిమల్లవాఖానుడు.
6.ఉద్దండఖానుడు.
7.జన్యువులకసవాపాత్రుడు.
8.పశ్చిమబాలచంద్రమహాపాత్రుడు
పైన ముగ్గురు పాలకులు ఏ సీమను పాలించే వారో విషయం తెలిసింది.మిగిలిన చివరి ఐదుగురు పాలకులు గజపతులపాలనలో (అద్దంకిసీమ, అమ్మనబ్రోలుసీమ, వినుకొండసీమ, తంగెడసీమ, బెల్లంకొండసీమ.) ఏ సీమకు పాలకులులో తెలియడం లేదు.
ఆధారం, దక్షిణభారతదేశ శాసనాలు.నాలుగోభాగం.శాసన నెంబరు,248.అమరావతి శాసనం
4.శ్రీ సదాశివరాయలు (సా.శ..1542-1576) ప్రభుత్వంలో అరవీటిజగ్గరాజయ్యదేవ (అళియ రామరాయలుచిన్నాన్న శ్రీరంగరాజుకుమారుడు) గారిని సా.శ..1556 సంతరావూరు (చిన్నగంజాం మండలం) శాసనం ద్వారా "అమ్మనబోలుసీమ" పాలకుడిగా భావించాము.
ఆధారం, దక్షిణదేశ శాసనాలు.16 వ భాగం.శాసననెంబరు,208.
5.శ్రీ సదాశివరాయలు (సా.శ..1542-1576) ప్రభుత్వంలో మందపాటి అప్పళరాజు "అమ్మనబ్రోలుసీమపాలకుడు"గా ఉన్నాడని సా.శ..1558 నాటి చదలవాడ (నాగులుప్పలపాడు మండలం) శాసనం ఆధారంగా కనిపిస్తుంది.మందపాటి వంశీయులు, పూర్వం ఒంగోలు, ఎండ్లూరు (సంతనూతలపాడు మండలం) రాజులుగా ఉన్నారు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం.పుట.953,954.
6.శ్రీ సదాశివరాయలు ( సా.శ..1542-1576) ప్రభుత్వంలో సిద్ధి రాజురంగప్పరాజయ్యదేవ సా.శ..1565 నాడు అద్దంకిసీమ, "అమ్మనబ్రోలుసీమ"రెంటికీ పాలకుడుగా ఉన్నట్టు చదలవాడ ( నాగులుప్పలపాడు మండలం) శాసనం ద్వారా తెలుస్తోంది.అళియ రామరాయలుమేనల్లుడు, కొండవీటిరాజ్యపాలకుడు సిద్ది తిమ్మరాజు (సా.శ..1554-1561) ఈ సిద్దిరాజురంగప్పరాజయ్యదేవకు తండ్రి. అలాగే సిద్ధిరాజువెంకట రాజయదేవ అనే కుమారుడు కూడా సిద్ధరాజు తిమ్మరాజుకు కలడు. ఇంకా వీరి దాయాది ఒకరు సిద్దిరాజు తిరుమలదేవరాజు సా.శ.. 1564 నాడు కొండవీడు సీమ పాలకుడిగా ఉన్నాడు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం.పుట,948.
7.శ్రీ యరం దేవరాజయ్య ఇతని శాసన సమయం లేదు. "అమ్మనబ్రోలుసీమ"లోని చేజర్ల శాసనం సుమారుగా సా.శ..1552, కాని, సా.శ..1612 ప్రాంతము అని భావించవచ్చు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం.పుట,659.
8.అమ్మనబ్రోలు లాంటి చిన్న సీమ పాలకులు ఆధారాలు లభించుట చాలా కష్టము.ఇప్పటి వరకు దొరికిన పాలకులు విషయాలు చెప్పాము.ఒక్కోసారి కొండవీటి రాజ్య పాలకులులే అమ్మనబ్రోలుసీమ పాలకులుగా ఉంటారు.అమ్మనబ్రోలుసీమపై ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం అను పుస్తకంలో తొలిసారిగా చిన్న వ్యాసం ఉంది. ఇంతకు పూర్వం ఎప్పుడు అమ్మనబ్రోలుసీమ పై ఎవరైనా ప్రత్యేక వ్యాసం రాసినట్లు, దృష్టికి రాలేదు.అమ్మనబ్రోలుచరిత్ర ఎంతో ఉన్నప్పటికీ వికీపీడియాలో ఒక్క అక్షరం కూడా లేకపోవటం దురదృష్టకరము.ఈ సీమ పై ఇంకా సమాచారం తెలిసినవారు దయచేసి తెలియజేయగలరు.ఈ వ్యాసంలో ఉన్న తప్పులు, లోపాలు, మార్పులు, చేర్పులు తెలిసిన వారు తప్పక చెప్పగలరు. ఈ వ్యాసానికి ఎందరో సహాయం అందించారు వారందరికీ నా కృతజ్ఞతలు.
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,529.[3] ఇందులో పురుషుల సంఖ్య 3,618, మహిళల సంఖ్య 3,911, గ్రామంలో నివాస గృహాలు 1,742 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3,132 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 7,515 - పురుషుల సంఖ్య 3,624 - స్త్రీల సంఖ్య 3,891 - గృహాల సంఖ్య 1,983
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[3] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-11; 8వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మే-23; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, సెప్టెంబరు-19; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, నవంబరు-30; 3వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, మే-24; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూలై-2; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూలై-2; 2వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూలై-4; 1వపేజీ.