చీర్వానుప్పలపాడు
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°37′59″N 80°08′56″E / 15.633°N 80.149°ECoordinates: 15°37′59″N 80°08′56″E / 15.633°N 80.149°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | నాగులుప్పలపాడు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 8.47 కి.మీ2 (3.27 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,988 |
• సాంద్రత | 350/కి.మీ2 (910/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 996 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08593 ![]() |
పిన్(PIN) | 523183 ![]() |
చీర్వానుప్పలపాడు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[2].ఎస్.టి.డి కోడ్:08593. పిన్ కోడ్: 523183
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
వెంపర్ల 2 కి.మీ, జమ్మలమడక 3 కి.మీ, వెలమవారి పాలెం 4 కి.మీ, గొర్రెపాడు 5 కి.మీ, మారెళ్ల 5 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
ముండ్లమూరు12 కి.మీ, అద్దంకి 12.9 కి.మీ, తాళ్ళూరు 17.5 కి.మీ, బల్లికురవ 17.8 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
దక్షణాన అద్దంకి మండలం, పశ్చిమాన నూజెండ్ల మండలం, దక్షణాన తాళ్ళూరు మండలం, తూర్పున బల్లికురవ మండలం.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
త్రాగునీటి సౌకర్యం[మార్చు]
ఈ గ్రామంలోని పానకాల చెరువును, రు. ఏడున్నర కోట్ల వ్యయంతో చిరుజలాశయంగా అభివృద్ధిచేసారు. ఈ చెరువు ద్వారా చదలవాడ, అగ్రహారం, పానకాలచెరువు, అమ్మనబ్రోలు, కనపర్తి, వినోదరాయునిపాలెం మొదలగు 9 గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేసెదరు. దీనికి ప్రధాన నీటి వనరులు గుండ్లకమ్మ కాలువలే. [2]&[4]
ఈ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్.ఓ ప్లాంటును, 2017,జులై-6న ప్రారంభించినారు. [6]
వీధిదీపాలు[మార్చు]
ఈ గ్రామానికి చెందిన శ్రీ గుళ్ళపల్లి శ్రీనివాసరావు, 2017,జులై-6న, తన స్వంత నిధులు ఐదు లక్షల రూపాయల వ్యయంతో, గ్రామంలో ఎల్.ఇ.డి దీపాలు అమర్చినారు. [6]
గ్రామానికి వ్యయసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
ఈ గ్రామం వద్ద, గుండ్లకమ్మ నదిపై, 14.8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, ఒక చెక్ డ్యాం నిర్మాణానికి అనుమతి మంజూరైనది. ఈ చెక్ డ్యాం నిర్మాణం పూర్తి అయినచో, ఈ ప్రాంతంలోని 22 గ్రామాలకు త్రాగునీరు, 4,860 ఎకరాలకు సాగునీరు అందజేయగలరు. ఈ చెక్ డ్యాంలో రైతులకు అవసరమైన వరకు నీటిని నిలువచేసుకొని, మిగిలిన నీటిని దుగువకు వదలుటకు వీలుగా ఇక్కడ గేట్లు గూడా ఏర్పాటు చేయుదురు. [5]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చప్పిడి సుశీల, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు. కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,913.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,449, మహిళల సంఖ్య 1,464, గ్రామంలో నివాస గృహాలు 707 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 847 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 2,988 - పురుషుల సంఖ్య 1,497 - స్త్రీల సంఖ్య 1,491 - గృహాల సంఖ్య 789
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చి-16; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-18; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,నవంబరు-8; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,నవంబరు-26; 16వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జులై-7; 2వపేజీ.