చెకూరపాడు
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°35′N 80°05′E / 15.58°N 80.08°ECoordinates: 15°35′N 80°05′E / 15.58°N 80.08°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | నాగులుప్పలపాడు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 4.72 కి.మీ2 (1.82 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 1,688 |
• సాంద్రత | 360/కి.మీ2 (930/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 897 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08593 ![]() |
పిన్(PIN) | 523262 ![]() |
చేకూరపాడు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[2]. పిన్ కోడ్: 523 262. ఎస్.టి.డి కోడ్:08593.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
మద్దిరాలపాడు 3 కి.మీ, నందిపాడు 3 కి.మీ, కొప్పోలు 4 కి.మీ, ఉలిచి 6 కి.మీ, మండువారిపాలెం 6 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
నాగులుప్పలపాడు 8.2 కి.మీ, ఒంగోలు 8.4 కి.మీ, మద్దిపాడు 8.9 కి.మీ, కొత్తపట్నం 16.9 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, దక్షణాన కొత్తపట్నం మండలం.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
శుద్ధినీటి కేంద్రం:- ఈ గ్రామంలో ఐ.టి.సి.సంస్థవారి ఆర్థిక సహకారంతో ఒక శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు. కానీ దీనిని ఎవరు నిర్వహించవలెనో తెలియక ఈ కేంద్రం నిరుపయోగంగా ఉంది. [4]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ముత్తన చిన్నయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]
ప్రముఖ నాదస్వరవిద్వాంసులు[మార్చు]
- షేక్ చిన పీరుసాహెబు
- షేక్ జాన్ సాహెబు
- షేక్ కాలేషాబి : నాదస్వర విద్వాంసురాలు. ఆమె భర్త షేక్ మహబూబ్ సుభానీతో కలిసి దేశ విదేశాలలో నాదస్వర కచేరీలు ఇస్తున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు.ఒక కుమారుడు.
- షేక్ మహబూబ్ సుభానీ
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామంలో 1953, జూలై-10న, మహాలక్ష్మి, యల్లమంద దంపతుల కుమారుడుగా జన్మించిన శ్రీ రాయిపూడి త్యాగరాజు, ఎం.ఏ.ఎకనామిక్సులో బంగారుపతకం సాధించారు. వీరు 1986 బ్యాచ్ ఐ.పి.ఎస్.కు చెందిన వారు. పశ్చిమబెంగాలులో డి.జి.పి.గా పనిచేసి పదవీ విరమణ పొంది ఒంగోలులో స్థిరపడినారు. శ్రీ త్యాగరాజుగారు 2014, జూన్-5 న, ఒంగోలులో, తన 61వ ఏట కాలధర్మం చెందినారు. [2]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,706.[3] ఇందులో పురుషుల సంఖ్య 878, మహిళల సంఖ్య 828, గ్రామంలో నివాస గృహాలు 438 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 472 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 1,688 - పురుషుల సంఖ్య 890 - స్త్రీల సంఖ్య 798 - గృహాల సంఖ్య 456
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
- http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/torchbearers-of-a-great-tradition/article2274392.ece
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, జూన్-6; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఆగస్టు-28; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, ఏప్రిల్-7; 1వపేజీ.