ఈదుమూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈదుమూడి
—  రెవిన్యూ గ్రామం  —
ఈదుమూడి is located in Andhra Pradesh
ఈదుమూడి
ఈదుమూడి
అక్షాంశరేఖాంశాలు: 15°43′48″N 80°10′15″E / 15.729866°N 80.170766°E / 15.729866; 80.170766
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం నాగులుప్పలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,748
 - పురుషుల సంఖ్య 1,370
 - స్త్రీల సంఖ్య 1,378
 - గృహాల సంఖ్య 793
పిన్ కోడ్ 523186
ఎస్.టి.డి కోడ్ 08592
ఈదుమూడి గ్రామము.[1].

ఈదుమూడి, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 186., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం ఉప్పుగుండూరుకు 5కిమీ వుంటుంది.

సమీప గ్రామాలు[మార్చు]

దుద్దుకూరు 4 కి.మీ, రాచపూడి 5 కి.మీ, ఉప్పుగుండూరు 6 కి.మీ, గొనసపూడి 6 కి.మీ. నూజెళ్లపల్లి 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన ఇంకొల్లు మండలం, ఉత్తరాన జే.పంగులూరు మండలం, తూర్పున వేటపాలెం మండలం.

విద్యా సౌకర్యాలు[మార్చు]

కె.కె.సి.ఉన్నత పాఠశాల[మార్చు]

  1. 1988లో ఈ గ్రామానికి ఉన్నత పాఠశాల రావటంతో పిల్లలకు దుద్దుకూరు 2.8 కి.మీ నడచి వెళ్ళే శ్రమ తప్పింది.
  2. ఈ పాఠశాలలో చదువుచున్న కొప్పా అనూషారాణి, "టెన్నిస్, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా" అధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మినీ జాతీయ టెన్నిస్, వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2015-16 పోటీలలో, అంధ్రప్రదేశ్ జట్టులో పాల్గొన్నది. ఆ పోటీలలో ఈ జట్టు రన్నర్-అప్ గా నిలిచింది. [6]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఈ గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకును ఆధునీకరించి, 2014, జూలై-15వ తేదీనాడు పునఃప్రారంభించెదరు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కూనం సత్యవాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం శివాలయం[మార్చు]

ఈ ఆలయం ధ్వజస్తంభం దెబ్బతినడంతో, గ్రామస్థులు ఆలయ జీర్ణోద్ధరణ పనులను, 2015, నవంబరు-30వ తేదీ సోమవారంనాడు ప్రారంభించారు. [5]

నూతనంగా పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో 2017,జూన్-14వతేదీ బుధవారంనాడు, ముందుగా హోమాలు నిర్వహించి, అనంతరం, శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి, గణపతి, నందీశ్వరుడు, కాలభైరవుడు, ఆదిత్యాది నవగ్రహాలు, జీవధ్వజ, కలశ, శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు పెద్దయెత్తున అన్నసమారాధన నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారు. [7]

గ్రామ విశేషాలు[మార్చు]

హైదరాబాదులో స్థిరపడిన ఈ గ్రామ వాసులు, మొత్తం 70 కుటుంబాలవారు, 3-10-2013 నాడు కుకట్ పల్లిలో, ఉదయం 10 గం. నుండి 4 గం. వరకూ ఆత్మీయ సమావేశం జరుపుకుని సందడి చేశారు. పిల్లలూ, మహిళలకు పలు ఆసక్తికరమైన పోటీలు నిర్వహించి, గెలుపొందినవారికి బహుమతి ప్రదానం చేశారు. గ్రామ విషయాలు మాట్లాడుకొని, గ్రామంలోని తమ బంధుమిత్రుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరు-2న ఈదుమూడి ఆత్మీయ సమావేశం, హైదరాబాదులో జరుగును. [2]

గణాంకాలు[మార్చు]

  • ఈ గ్రామ జనాభాలో కమ్మ, కురుమ, మాదిగ, కుమ్మరి, చాకలి, మంగలి కులస్తులు ఎక్కువగా ఉన్నారు.
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,824.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,378, మహిళల సంఖ్య 1,446, గ్రామంలో నివాస గృహాలు 761 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 613 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 2,748 - పురుషుల సంఖ్య 1,370 - స్త్రీల సంఖ్య 1,378 - గృహాల సంఖ్య 793

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూలై-15, 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-15; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-1; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,జనవరి-21; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జూన్-15; 2వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=ఈదుమూడి&oldid=2579177" నుండి వెలికితీశారు