చర్చ:ఈదుమూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈదుమూడి[మార్చు]

రహంతుల్లా గారు, ఈదుమూడి గ్రామానికి మీరుచేసిన మార్పులు బాగున్నాయి. అయితే, ఈఊరులో కుష్ఠువ్యాది ఎక్కువగా ఉండేది అని వ్రాశారు, అది ఎప్పుడో చెపుతారా? నాకు తెలిసి ఇంత వరకు ఆగ్రామంలో ఎవరికీ కుష్టు వ్యాది ఉందని వినలేదు. చూడలేదు. నా వయస్సు ఇప్పుడు 25 కాబట్టి మీరు వ్రాసినది అంతకు ముందుది అయిఉంటుందనుకుంటున్నాను. దీన్ని గురించి మీకు తెలిసిన సమాచారాన్ని నాకు కొంత అందించండి. రమణ 05:46, 15 జూన్ 2007 (UTC) 1975--1988 ప్రాంతాల్లో ఈ గ్రామంలో చాలా మంది కుష్టు బారిన పడ్డారు.జిల్లా లెప్రసీ మిషన్ సేవలు అందించింది..గ్రామంలోని బావుల నీళ్ళు కూడా త్రాగటం మంచిదికాదని డాక్టర్లు సలహా ఇచ్చారు.ఈ గ్రామ చెరువులోని నీరు కేవలం నెలలోనే పచ్చగా మారిపోతుంది.[ప్రత్యుత్తరం]

రహంతుల్లాగారు, ఈదుమూడి గ్రామ బావుల్లోని నీరు త్రాగడం మంచిది కాదని డాక్టర్లు సలహా ఇచ్చిన విషయం నాకు కూడా గుర్తుంది. కాని అది కలరా వచ్చినప్పుడని గుర్తు. కాని 1975-88 మద్యలో కుష్టు వ్యాది ఉందనే విషయాన్ని నేను దృవీకరించుకోలేక పోతున్నాను. నా చిన్నతనంలో కుష్టు వ్యాది గురించి అసలెప్పుడూ వినకపోవడమే దీనికి కారణం. ఇంకా ఈదుమూడి గ్రామ చెరువులో నీరు కూడా నా చిన్నతనంలో శుబ్రంగానే ఉండేది. తరువాత చెరువులో చాలా ఊటాకు పెరుగుట వల్ల నీరు పచ్చబడినది. అయినా ఈ కుష్టు వ్యాది సంగతి ఇప్పుడు అప్రస్తుతంగాబట్టి, ఈదుమూడి వ్యాసంలోంచి దాన్ని తుడిచివేయమని మవవి.

అన్నట్టు, మీరు ఈదుమూడి వివరాలన్నీ ఎలా తెలుసుకోగలిగారు? మీగురించి కొంచెం తెలియజేస్తారా?

రమణ 05:31, 16 జూన్ 2007 (UTC) వెంకట రమణ గారూ తెలుగు భాష కోసం మంచి కృషి చేస్తున్నారు.సంతోషం.మీ మైల్ అడ్రస్ ఇవ్వండి.మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి.1978 నుండి నాకు ఈదుమూడితో పరిచయం.నేను మీ వూరి అల్లుడిని.విశాఖపట్నం లో డిప్యూటీ కలెక్టర్ ను.మీ నాన్న గారు టీచరేనా?మట్టిగుంట దగ్గరి శిలాబద్రపు కుంట,దుద్దుకూరు వైపు చలపటోరి కుంటల నుండి మంచి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు.ప్రస్తుతం రక్షిత మంచి నీళ్ళు సరఫరా అవుతున్నాయా? ఇప్పుడు ఊరు బాగా అభివృధ్ది చెందివుంటుంది. --Nrahamthulla 06:11, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రహంతుల్లా గారు, నా మెయులు ఐ.డి. uvramana gmail com. మీరు నాకొక మెయిలు చేయండి మనం వివరంగా మాట్లాడుకొన వచ్చు.

ఓహో, మీరూ మీరు కలిపోయారన్నమాట!:) __చదువరి (చర్చరచనలు) 09:42, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈదుమూడి ప్రస్తుత వర్షాలకి బాగా దెబ్బతింది. సెనగలు,వరి నాశనము అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రస్తుత రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాద రావు వచ్చి పరామర్శించి వెళ్ళారు.