తిమ్మసముద్రం (నాగులుప్పలపాడు)
తిమ్మసముద్రం | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°48′N 80°12′E / 15.8°N 80.2°ECoordinates: 15°48′N 80°12′E / 15.8°N 80.2°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | నాగులుప్పలపాడు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,587 హె. (3,922 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 5,993 |
• సాంద్రత | 380/కి.మీ2 (980/చ. మై.) |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08594 ![]() |
పిన్(PIN) | 523185 ![]() |
తిమ్మసముద్రం, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523185. ఎస్.టి.డి.కోడ్: 08594.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయ తృతీయ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే నెల 4వతేదీ, వైశాఖ పౌర్ణమి, సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహిళలు భజన కార్యక్రమం నిర్వహించారు. తరలి వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. [4]
తిమ్మసముద్రంలో శ్రీ గోరంట్ల సంస్కృత విద్యాపీఠము ఉంది.
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
సినీ నటి వాసంతి, కరణం బలరాం స్వగ్రామం.
శ్రీ కె.సి.హెచ్.పున్నయ్య చౌదరి (కరణం చెంచు పున్నయ్య చౌదరి):- ఈ గ్రామంలో జనించిన వీరు ఇంకొల్లులో స్థిరపడినారు.వీరు, భారతదేశ బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి (టోర్నీలు) గానూ, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం (ఏ.పి.బి.ఏ) సి.ఈ.వో గానూ, పనిచేయుచున్న వీరు, 50 సంవత్సరాలనుండి, బ్యాడ్మింటన్ క్రీడకు సేవలందించుచున్నారు. వీరిని 2016లో బ్రెజిల్ దేశంలోని రియో-డి.జెనీరియో నగరంలో జరుగు ఒలింపిక్స్ క్రీడా పోటీలకు నామినేట్ చేసినట్లు బాయ్ ప్రకటించింది. వీరు 1983లో భారత్ నుండి తొలి అంతర్జాతీయ అంపైరుగా విధులు నిర్వహించారు. [5]
గ్రామ విశేషాలు[మార్చు]
- ఈ గ్రామంలో దాతల సహకారంతో 300 మొక్కల పంపిణీ చేపట్టినారు. ఒక్కో ట్రీ-గార్డు 500 రూపాయల చొప్పున ఒకటిన్నర లక్షల రూపాయలతో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టినారు. ఈ ఏర్పాటు వలన గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటుందని గ్రామస్థుల అభిలాష. [3]
- ఈ గ్రామంలో స్థలదాత శ్రీ కరణం బ్రహ్మయ్యచౌదరి తోడ్పాటుతో, బి.సి.సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా బి.సి.విద్యార్థుల వసతిగృహం నిర్మించారు. గ్రామంలో 2014,నవంబరు-8న నిర్వహించు జన్మభూమి కార్యక్రమంలో దీనిని ప్రారంభించనున్నారు. [3]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,991.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,599, మహిళల సంఖ్య 3,392, గ్రామంలో నివాస గృహాలు 1,683 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,587 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 5,993 - పురుషుల సంఖ్య 3,041 - స్త్రీల సంఖ్య 2,952 - గృహాల సంఖ్య 1,127
సమీప గ్రామాలు[మార్చు]
వినోదరాయునిపాలెం 3 కి.మీ, మాచవరం 4 కి.మీ, దేవరంపాడు 4 కి.మీ, కనపర్తి 4 కి.మీ, అమ్మనబ్రోలు 6 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
నాగులుప్పలపాడు 9.8 కి.మీ, చినగంజాం 12 కి.మీ, మద్దిపాడు 17.2 కి.మీ, ఒంగోలు 17.7 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన చినగంజాము మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన కొత్తపట్నం మండలం, పశ్చిమాన ఒంగోలు మండలం.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; జనవరి-5,2014;1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-8; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే నెల-5వతేదీ; 3వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2016,ఆగస్టు-3; 1,11 పేజీలు.