మద్దిరాల - ముప్పాళ్ళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°44′38″N 80°12′07″E / 15.744°N 80.202°E / 15.744; 80.202Coordinates: 15°44′38″N 80°12′07″E / 15.744°N 80.202°E / 15.744; 80.202
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం
విస్తీర్ణం
 • మొత్తం7.4 కి.మీ2 (2.9 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం1,702
 • సాంద్రత230/కి.మీ2 (600/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1038
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523181 Edit this on Wikidata


మద్దిరాల - ముప్పాళ్ళ, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్:523109. ఎస్.టి.డి కోడ్:08598.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇవి పక్క పక్కనే ఉండే రెండు గ్రామాలు. జనాభా సుమారు రెండు వేలు.

సరిహద్దు గ్రామాలు[మార్చు]

ఈదుమూడి, తిమ్మసముద్రం, దుద్దుకూరు, కొణికి, భీమవరం, చింతగుంపల, గొనసపూడి సరిహద్దు గ్రామాలు.

సమీప పట్టణాలు[మార్చు]

మద్దిపాడు 8.7 కి.మీ, కొరిశపాడు 13.4 కి.మీ, ఒంగోలు 16.5 కి.మీ, చినగంజాం 16.8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన మద్దిపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- గ్రామంలో ఈ పాఠశాల డిసెంబరు-1940 లో ఒక ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటయినది.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

నీటిశుద్ధి మంచినీటి పథకం[మార్చు]

మద్దిరాల గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పథకం, విజయదశమి రోజున, అక్టోబరు-13, 2013 నాడు ప్రారంభించబడింది. [2]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఊర చెఱువు చూడ ముచ్చట గొలుపుతుంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మండవ లక్ష్మీకుమారి సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ శ్రీనివాసరావు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ రామాలయము.
  2. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల సందర్భంగా, 2015,జూన్-30వ తేదీ మంగళవారంనాడు, విశేష అలంకరణలో, శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయస్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. [3]
  3. గ్రామదేవత శ్రీపోలేరమ్మఅమ్మవారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

పప్పుదినుసులు ఇక్కడి ప్రధానపంటలు. ముఖ్య పంటలు : వరి, వరిగలు, శనగ, మొక్కజొన్న, పెసర, మినుము, పసుపు, పొగాకు, వేరుశనగ, మిరప, ప్రత్తి, కంది.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఎక్కువ మంది వ్యవసాయ దారులు. పశుపోషణ కూడా ముఖ్య వృత్తే.

గ్రామ విశేషాలు[మార్చు]

గ్రామ జనాభాలో ఎక్కువ మంది కమ్మ కులము వారు. ఈ గ్రామ జనాభాలో కమ్మ, కుమ్మరి, చాకలి కులస్తులు ఎక్కువగా ఉన్నారు.

తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.

వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.

ప్రభ అనేది దేవుని ఊరేగింపుకు పల్లకీ లేనిచోట్ల ఉపయోగించే అరపలాంటి నిర్మాణము. చిన్న చిన్న దేవాలయములలో రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను చేసి దానిపై దేవుని విగ్రహము లేదా బొమ్మను పెట్టి వెనుక దేవాలయము మాదిరి ఒక కట్టడాన్ని తేలికపాటి గడకర్రలతో రంగుల కాగితాలతో తయారుచేసి దానిపై దేవుని ఊరేగించేవారు. అది రానురానూ అంతటా వ్యాపించింది. మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,656.[3] ఇందులో పురుషుల సంఖ్య 810, మహా:ిళల సంఖ్య 846, గ్రామంలో నివాస గృహాలు 468 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 740 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,702 - పురుషుల సంఖ్య 835 - స్త్రీల సంఖ్య 867 - గృహాల సంఖ్య 506
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,అక్టోబరు-14. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-30; 2వపేజీ.