Jump to content

పోలేరమ్మ

వికీపీడియా నుండి

శివుని ఆరాధించే వారు శైవులు , విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు , ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ.మసూచి,ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలొస్తే అమ్మవారు పోసిందనటం అర్ధరహితం కాపాడే దేవతపై అపనిందమోపటమే అవుతుంది.సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తి పోలేరమ్మఅంటారు.పోలేరమ్మను తెలంగాణాలో పోచమ్మ అంటారు.మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు.బహుజన సంస్కృతి పరిరక్షకులు.సమాజంలోని బడుగుకులాలవారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతరల వల్ల సాధ్యమయ్యింది. వర్షాలు పడాలని పోలేరమ్మ తిరునాళ్లు, కొలుపులు చేస్తారు.పోలేరమ్మకు జంతు బలులు ఇస్తారు. మేకలు,పొట్టేళ్ళు, కోళ్ళను నరకడం ,పొంగళ్ళు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జురుగుతుంది

పోలేరమ్మ వ్రతం

[మార్చు]
బీరంగూడ ఆలయంలోని పోలేరమ్మ విగ్రహం

పార్వతి శివునితో కలియుగంలో స్త్రీలు మిక్కిలి పాపాత్ములుగా , సంతానలేమితో ఉంటారు కాబట్టి వారికి పుణ్యము నిచ్చే ఒక వ్రతమును చెప్పుమని కోరితే పోలేరమ్మ వ్రతము అని చెప్పాడట. బాధ్రపద బహుళ అమావాస్య నాడు పోలేరమ్మవ్రతము చేస్తారు.

పోలేరమ్మ జాతర

[మార్చు]

పూర్వం కలరా వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభించి అధిక సంఖ్యలో జన నష్టం జరగడంతో శీతల యాగం జరిపించి గ్రామాల్లో అష్టదిగ్బంధన యంత్రాన్ని కట్టించి అత్యంత వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతరను జరిపించారట. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామ పెద్దకాపు చేతుల మీదగా పోలేరమ్మ జాతర జరిపించడం ఆచారంగా మారింది. జాతరలో ఏదైనా లోపం జరిగితే గ్రామంలో కీడు జరుగుతుంది అని నానుడి. మడిభిక్షం పెట్టండి ...పోతురాజుకు టెంకాయ కొట్టండి ... పగలక పోతే మానెత్తిన కొట్టండి' అంటు భిక్షాటన చేస్తారు.జాతర సందర్భంగా ప్రతి ఇంటికి వేపాకు తోరణాలు కట్టి అమ్మవారికి ఇష్ట నైవేద్యమైన అంబలిని ప్రసాదంగా పంచి పెడతారు. చిన్న, పెద్ద, పేద, ధనిక తారతమ్యం లేకుండా మడిభిక్షాలు ఎత్తి అమ్మవారి జ్ఞాపకార్థం జాతరలో వాటిని వెచ్చిస్తారు. అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరులు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు. ఎటువంటి అలంకరణ లేని ప్రతిమను ముందు అమ్మవారి అత్తవారి ఇంటికి తీసుకు వెళతారు. అక్కడ సాంగ్యాలతో అమ్మవారిని కుమ్మర్లు అలంకరిస్తారు. అమ్మవారి చెళ్ళెళ్లు గాలిగంగలు. జాతర రోజులలో శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. ఆ రోజు గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అందువలన శుభకార్యాలు చేపడితే అరిష్టం కలుగుతుందని మూఢనమ్మకం . బ్రాహ్మణేతరులే పోలేరమ్మకు అనాదినుంచీ పూజారులు. సారాయి తాగి బాధలన్నీమరచి చిందులువేసే భక్తులకు కులాలు గుర్తురావు. అంటరానితనం ఉండదు. సర్వమానవ సమానత్వంఈ జాతరల్లో వెల్లివిరుస్తుంది. అదే పోలేరమ్మ గొప్పతనం.

పోలేరమ్మ చద్ది (అంబలి)

[మార్చు]

బర్రె పాడి చల్లగా ఉంటే పోలేరమ్మకు పెరుగన్నంతో పెట్టిన చద్ది ని వీధిలోని పిల్లలందరినీ పొద్దున్నే పిలిచి పంచిపెడతారు.

పోలేరమ్మ గుడులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పోలేరమ్మ&oldid=4337141" నుండి వెలికితీశారు