బ్రహ్మంగారిమఠం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
నిర్దేశాంకాలు: 14°50′29″N 78°52′49″E / 14.8414°N 78.8803°E / 14.8414; 78.8803Coordinates: 14°50′29″N 78°52′49″E / 14.8414°N 78.8803°E / 14.8414; 78.8803
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండలంబ్రహ్మంగారిమఠం మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


బ్రహ్మంగారిమఠం (కందిమల్లయ్యపల్లె), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన గ్రామం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ ప్రాంతాన్ని 17 వశతాబ్దంలో కందిమల్లయ్యపల్లె గ్రామం అని పిలిచేవారు. [1] ఇక్కడ వున్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం వలన చారిత్రక, దర్శనీయ స్థలం.

భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం కడప నగరం నుండి 70 కి.మీ, మైదుకూరు నుండి 25 కి.మీ దూరంలో వుంది. సమీప రైలు స్టేషన్ కడప. సమీప విమానాశ్రయం కడప విమానాశ్రయం

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం[మార్చు]

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, బ్రహ్మంగారి మఠం

ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం వుంది. ఇది కాలజ్ఞానం రచించిన, జీవ సమాధి గావించుకున్న మహాక్షేత్రం. కనులకు ఇంపుగా, పచ్చని కొండల నడుమ వెలసిన పుణ్య క్షేత్రం. బ్రహ్మం కులాలను రూపుమాపి సమసమాజ నిర్మాణానికి కృషి చేశాడు. ఇతను శిష్యులలో ముఖ్యుడైన దూదేకుల సిద్దయ్య దూదేకుల కులానికి చెందిన మరొక భక్తుడు.

కక్కయ్య మాదిగ అవడమే ఇందుకు తార్కాణం. ఈ చర్యలను నిరసించిన స్థానికులు బ్రహ్మంగారిని వెలివేశారు. నిప్పు, నీరూ ఇవ్వలేదు. నీటి అవసరాలు తీర్చుకోవడానికి రాత్రికి రాత్రే తన నివాసంలో జింక కొమ్ముతో బావిని త్రవ్వుకున్నాడు.

మఠంలో దర్శనీయ స్థలాలు[మార్చు]

  • వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం
  • స్వామి తవ్వుకున్న బావి
  • కాలజ్ఞాన ప్రతులు
  • పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ
  • స్వామి మనవరాలు ఈశ్వరీదేవి మఠం[2]

దగ్గరలో గల దర్శనీయ స్థలాలు[మార్చు]

9 కి.మీ. దూరంలో వున్నవి

  • సిద్దయ్య మఠం
  • కక్కయ్య గుడి
  • పోలేరమ్మ గుడి.[2]

ఇతరాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. కన్నెగంటి రాజమల్లాచారి (1998-03-01). పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన (డాక్టరేట్ డిగ్రీ పొందిన గ్రంథం). సరోజ పబ్లికేషన్స్. p. 58.
  2. 2.0 2.1 "కాలజ్ఞాని నడయాడిన చోటు". సాక్షి. 2016-05-10. Retrieved 2022-06-20.

వెలుపలి లంకెలు[మార్చు]