దేవరంపాడు
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°33′11″N 80°10′59″E / 15.553°N 80.183°ECoordinates: 15°33′11″N 80°10′59″E / 15.553°N 80.183°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | ఒంగోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 29.93 కి.మీ2 (11.56 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 6,366 |
• సాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 984 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08592 ![]() |
పిన్(PIN) | 523182 ![]() |
దేవరంపాడు, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523182., ఎస్.ట్.డి.కోడ్ = 08592
గ్రామ వివరణ[మార్చు]
మండలం పేరు | ఒంగోలు |
జిల్లా | ప్రకాశం |
రాష్ట్రం | ఆంధ్రపదేశ్ |
భాష | తెలుగు |
ఎత్తు: సముద్రమట్టానికి | 12 మీటర్లు |
పిన్‌కోడ్ | |
తపాలా కార్యాలయం |
గ్రామ చరిత్ర[మార్చు]
స్వాతంత్ర్యోద్యమ సమయంలో, ఉప్పుసత్యాగ్రం సందర్భంగా, మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు, 1930లో, ఈ గ్రామంలో కీ.శే.టంగుటూరి ప్రకాశం పంతులుగారు, ఉప్పు పండిచి తమ నిరసన తెలిపినారు. తరువాత 1935లో ఇక్కడకు డా.రాజేంద్రప్రసాదుగారు వచ్చి, విజయోత్సవ స్థూపం ప్రారంభించారు. ఈ విజయస్థూపం ప్రకాశం పంతులుగారు స్వయంగా నిర్మించిన కట్టడం. ఆయన జీవితచరితను విశదపరచేటందుకు మిగిలిన ఏకైక నిర్మాణం.[2]
స్వాతంత్ర్యసమరయోధులు శ్రీ సాగి విజయరామరాజు గారు ఈ గ్రామస్థులే. వీరు ఆరు నెలలు చెరసాలలో చిత్రహింసలు భరించుచూ చేసిన వందే మాతరం నినాదం, ఇప్పటికీ ఈ నేల అణువణువునా మారుమ్రోగుతూనే ఉంది. 1930లో, జాతిపిత పిలుపుతో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి సారథ్యంలో ఊరంతా ఉప్పెనై కడలి తీరానికి ఎగసి ఉప్పు సత్యాగ్రహానికి వేదిక అయినది. 1935లో, నాటి భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ బాబూరాజేంద్రప్రసాదుగారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు, ఈ పుణ్యభూమికి మోకరిల్లినారు. నాటి ధీరోదాత్తులకు ప్రణమిల్లినారు. అప్పుడు వారు, ప్రకాశంగారు వేయించిన విజయస్తంభాన్ని ఆవిష్కరించి అనిర్వచనీయ అనుభూతినీ, స్ఫూర్తినీ వెంట తీసుకొని వెళ్ళినారు. [3]
సమీపంలోని గ్రామాలు[మార్చు]
వినోదరాయునిపాలెము 1.2 కి.మీ, చేజర్ల 2.6 కి.మీ, తిమ్మసముద్రం 3.6 కి.మీ, అమ్మనబ్రోలు 3.6 కి.మీ, ఉలిచి 3.9 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
నాగులుప్పలపాడు 10.8 కి.మీ, ఒంగోలు 14.8 కి.మీ, కొత్తపట్నం 14.8 కి.మీ, చినగంజాం 15.4 కి.మీ.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ చుంచు దశరథరామయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
గ్రామ విశేషాలు[మార్చు]
దేవరంపాడు దళితవాడ పంచాయతీని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయడానికై, గ్రామాన్ని, ఒంగోలు కలెక్టర్ శ్రీమతి సుజాతశర్మ, దత్తత తీసుకున్నారు. ఇక్కడ శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆర్థికంగా చేయూతనీయడానికి కరవది సిండికేటు బ్యాంక్ ముందుకువచ్చింది. 2015, ఆగస్టు-23వ తెదీనాడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి జన్మదినోత్సవం సందర్భంగా, ఈ కేంద్రాన్ని ప్రారంభించెదరు. [5]&[6]ఈ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధులు కీ.శే.సాగి విజయరామరాజుగారి విగ్రహం ఏర్పాటుచేసారు. [7]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 6,366 - పురుషుల సంఖ్య 3,209 - స్త్రీల సంఖ్య 3,157 - గృహాల సంఖ్య 1,745;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,158.[3] ఇందులో పురుషుల సంఖ్య 3,088, మహిళల సంఖ్య 3,070, గ్రామంలో నివాస గృహాలు 1,511 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ది హిందు దినపత్రిక, 2011, సెప్టెంబరు-27. [3] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-10; 9వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-24; 7వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, ఆగస్టు-21; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017, ఆగస్టు-23; 11వపేజీ.
గ్రామసంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]