Jump to content

వినోదరాయునిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 15°34′28.524″N 80°10′42.492″E / 15.57459000°N 80.17847000°E / 15.57459000; 80.17847000
వికీపీడియా నుండి
వినోదరాయునిపాలెం
గ్రామం
పటం
వినోదరాయునిపాలెం is located in ఆంధ్రప్రదేశ్
వినోదరాయునిపాలెం
వినోదరాయునిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°34′28.524″N 80°10′42.492″E / 15.57459000°N 80.17847000°E / 15.57459000; 80.17847000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంనాగులుప్పలపాడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08593 Edit this on Wikidata )
పిన్‌కోడ్523183


వినోదరాయునిపాలెం ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

పూర్వం నోరుతిరగని వాళ్ళు ఈగ్రామాన్ని 'ఎనిద్రోడిపాలెం'అనేవారు.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సమీప గ్రామాలు

[మార్చు]

చేజర్ల 3 కి.మీ, తిమ్మసముద్రం 3 కి.మీ, కనుపర్తి 4 కి.మీ, అమ్మనబ్రోలు 5 కి.మీ, రాపర్ల 5 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

కీ.శే.టంగుటూరి ప్రకాశం పంతులుగారి స్వస్థలమైన ఈ గ్రామంలో, వారి 146వ జయంతి సందర్భంగా, 2017, ఆగస్టు-23న, ఈ పాఠశాల ఆవరణలో, నూతనంగా నెలకొల్పిన వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ పంచాయితీ గ్రామంలో 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ యానాదులకు కాలనీ కట్టించారు.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఉన్నం రవిబాబు సర్పంచిగా ఎన్నికైనారు. వీరు 2016, డిసెంబరు-27న పదవిలో ఉండగానే, అనారోగ్యంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో, చికిత్స పొందుచూ కన్నుమూసినారు. అనంతరం తోట శ్రీనివాసరావు, ఈ గ్రామ సర్పంచిగా పదవీ బాధ్యతలు చేపట్టినారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ప్రాంగణంలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జన్మస్థలం. వారు చిన్నప్పుడు కొన్నాళ్ళు ఈ గ్రామంలోనే నివసించారు.వారి ఇంట్లో అతని స్నేహితుడు నడిపినేని వెంకటప్పయ్య మనుమడు, నడిపినేని రామారావు నివసించుచున్నారు. ప్రకాశం పంతులు విగ్రహం ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండ రామాలయం

[మార్చు]

వినోదరాయనిపాలెం గ్రామంలోని పల్లెపాలెంలో ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో, నూతనంగా నిర్మించనున్న ఈ ఆలయానికి, 2017, మార్చి-14వతేదీ సోమవారంనాడు వేదపండితుల ఆధ్వర్యంలో, శంకుస్థాపన కార్యక్రమం, శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ - సమరసత సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినారు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

[మార్చు]

రాష్ట్రప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]