యెరజెర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°27′07″N 80°00′25″E / 15.452°N 80.007°E / 15.452; 80.007Coordinates: 15°27′07″N 80°00′25″E / 15.452°N 80.007°E / 15.452; 80.007
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఒంగోలు మండలం
విస్తీర్ణం
 • మొత్తం10.11 కి.మీ2 (3.90 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం2,913
 • సాంద్రత290/కి.మీ2 (750/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి978
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08598 Edit this on Wikidata )
పిన్(PIN)523272 Edit this on Wikidata


యరజెర్ల (Yerazerla), ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

కొణిదెన రాజులు ఈ గ్రామ పాలకులు. వారు ఇక్కడ తాత్కాలికంగా సైనిక శిబిరం ఏర్పాటుచేసుకొని, చుట్టుప్రక్కల గ్రామాల వ్యవహారాన్ని నిర్వహించేవారు. 1957లో ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్య, ఒంగోలులో లోక్ సభ సభ్యులుగా పోటీచేసినపుడు, ఈ గ్రామ కూడలిలో చేసిన ప్రసంగం, ఇప్పటికీ కొందరు పెద్దలకు తీపి గురుతుగా మిగిలినది. 1972లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒంగోలు వచ్చాడు. ఆయనను స్వాగతం పలకటానికి 50 ఎద్దు బండ్లు కట్టి, గ్రామస్థులు తరలి వెళ్ళినారు.[2]

భౌగోళికం[మార్చు]

సమీప పట్టణాలు[మార్చు]

ఒంగోలు 9 కి.మీ మద్దిపాడు 13.7 కి.మీ, కొత్తపట్నం 13.9 కి.మీ, సంతనూతలపాడు 16.1 కి.మీ, నాగులుప్పలపాడు 16.5 కి.మీ.

జనగణన గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,913 - పురుషుల సంఖ్య 1,473 - స్త్రీల సంఖ్య 1,440 - గృహాల సంఖ్య 778;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,921.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,511, మహిళల సంఖ్య 1,410, గ్రామంలో నివాస గృహాలు 747 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,011 హెక్టారులు.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

పశువైద్యశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. మంగళాద్రిపురం, యరజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో యరజర్ల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దివి అరుణ, సర్పంచిగా ఎన్నికైనారు.[4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కృష్ణాలయం[మార్చు]

ఈ ఆలయంలో, శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, మే-24వ తేదీ ఆదివారంనాడు, హోమపూజతో ప్రారంభమైనవి. 28వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు, విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. తొలుత వేదమంత్రాల నడుమ, అర్చకులు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం ఆలయ గోపురంపై కలశ ప్రతిష్ఠ, శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యరజర్ల గ్రామస్థులేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు విచ్చేసి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఐదువేలమందికిపైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. ఈనాడు ప్రకాశం; 2013, జూలై-16; 4వపేజీ
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  4. 4.0 4.1 ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, మే-29; 1వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=యెరజెర్ల&oldid=3512077" నుండి వెలికితీశారు