కరవది
కరవది | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°32′56″N 80°06′49″E / 15.549°N 80.1136°ECoordinates: 15°32′56″N 80°06′49″E / 15.549°N 80.1136°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | ఒంగోలు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,643 హె. (6,531 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 6,327 |
• సాంద్రత | 240/కి.మీ2 (620/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08592 ![]() |
పిన్(PIN) | 523182 ![]() |
కరవది, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్ 523 182., ఎస్.టి.డి.కోడ్ = 08592.
గ్రామ వివరణ[మార్చు]
మండలం పేరు | ఒంగోలు |
జిల్లా | ప్రకాశం |
రాష్ట్రం | ఆంధ్రపదేశ్ |
భాష | తెలుగు |
ఎత్తు: సముద్రమట్టానికి | 12 మీటర్లు |
తపాలా కార్యాలయం |
గ్రామ భౌగోళికం[మార్చు]
ఈ గ్రామం ఒంగోలుకు 10 కి.మీ. దూరంలో ఉంది.
సమీపంలోని గ్రామాలు[మార్చు]
కొప్పోలు 2.1 కి.మీ, చేకూరుపాడు 2.7 కి.మీ, త్రోవగుంట 3.6 కి.మీ, ఉలిచి 5.4 కి .మీ, నందిపాడు 5.6 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
ఒంగోలు 6.2 కి.మీ, నాగులుప్పలపాడు 10.8 కి.మీ, మద్దిపాడు 10.9 కి.మీ, కొత్తపట్నం 14.5 కి.మీ.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామంలోని రైల్వే స్టేషన్, విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
పోలవరపు రంగయ్య, రత్తమ్మ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
1961 లో ప్రారంభించిన ఈ పాఠశాల శిథిలావస్థలో ఉన్నదని తెలిసిన, ఆర్థికంగా స్థిరపడిన 40 మంది పూర్వ విద్యార్థులు, భవన నిర్మాణానికి రు. 20 లక్షల విరాళంతో భవనాన్ని పునర్నిర్మించడమే గాకుండా, కళావేదిక, ముఖద్వారం, ప్రహరీ గోడ మొదలగు అదనపు వసతులు కలుగజేశారు. 2012, జనవరి-12,13 తేదీలలో, ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు జరుపుకున్నది. [3]
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
- మహిళామండలి.
- కరవదిలోని ప్రధానవీధులలో, వాటర్ షెడ్ పథకం క్రింద, 35 సౌరవిద్యుద్దీపాలు ఏర్పాటుచేసారు. ఒక్కొక్కటి రు.18,000-00 కాగా, దీనిలో రు. 3,600-00 పంచాయతీ చెల్లించగా మిగతాది ప్రభుత్వం రాయితీగా ఇచ్చింది. [6]
- ఈ గ్రామంలో నూతనంగా ఒక విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి, ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. స్థల పరిశీలనలో ఉంది. [7]
గ్రామ పంచాయతీ[మార్చు]
- మండలంలోని 14 పంచాయతీలలో ఏకైక మేజర్ పంచాయతీ ఇది.
- శ్రీ పోలవరపు వెంకటరామయ్య, 2001-2006 మధ్య, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసారు. 2006-2011 మధ్య, వీరి శ్రీమతి విజయలక్ష్మి, ఈ గ్రామ సర్పంచిగా సేవలందించారు. అప్పట్లో ఎవ్వరూ వ్యక్తిగతంగా ఎలాంటి సాయం ఆశించేవారు కాదు. గ్రామస్థులు తమకందరికీ అవసరమైన వసతులు, వనరుల గురించే సర్పంచిని ప్రశ్నించేవారు. [2]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గొలిమి దుర్గారాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
- 2016-17 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీ సర్పంచిగా, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి శ్రీమతి గొలిమి దుర్గారాణి ఎంపికైనారు. 2017, ఏప్రిల్-24న, రాష్ట్ర రాజధాని వెలగపూడిలో నిర్వహించు పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలలో భాగంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా ఈమెకు ఈ పురస్కారం అందజేసెదరు. [11]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ సీతారాముల, వేణుగోపాల, రామలింగేశ్వరస్వామివారల అలయాలు[మార్చు]
కరవది గ్రామంలోని సీతారాముల, వేణుగోపాల, రామలింగేశ్వరస్వామి వార్ల దేవస్థానాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, చైత్య శుక్ల విదియ (ఉగాది మరుసటి రోజు) నుండి 11 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [5]
శ్రీ రామస్వామి, వేంకటేశ్వరస్వామివారల అలయాలు[మార్చు]
ఈ గ్రామంలోని శ్రీ రామస్వామి వేంకటేశ్వరస్వామివారల అలయాలలో, 2017, మార్చి-26వతేదీ ఆదివారంనాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [8]
శ్రీ సాయిబాబా ఆలయం[మార్చు]
కరవది గ్రామంలో 2010 లో నూతనంగాషిర్డీ సాయిబాబా ఆలయం నిర్మితమైనది. ఇక్కడ సీతారాముల కళ్యాణం బాగుగా జరిపించెదరు.
శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]
ప్రధాన ఉత్పత్తి ఇటుకల తయారీ.
గ్రామ ప్రముఖులు[మార్చు]
- పిశుపాటి చిదంబర శాస్త్రి (1892 - 1951) సుప్రసిద్ధ కవి, పండితుడు, అవధాని ఈ గ్రామంలోనే జన్మించారు.
- కాంచన
- షేక్ చినమౌలానా పద్మశ్రీ 5.12.1924 - 1999 ఏప్రిల్ 13) నాదస్వర విద్వాంసులు.
- నేలభొట్ల రంగనాయకశర్మ - సంగీత విద్వాంసుడు.
గ్రామ విశేషాలు[మార్చు]
- ఒంగోలు గిత్త గా పేరుగాంచిన ఎద్డు, కరవది నుండి ఎన్నుకోబడింది.
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 6,327 - పురుషుల సంఖ్య 3,174 - స్త్రీల సంఖ్య 3,153 - గృహాల సంఖ్య 1,673;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,732.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,369, మహిళల సంఖ్య 3,363, గ్రామంలో నివాస గృహాలు 1,597 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2,643 హెక్టారులు. గ్రామసంబంధిత వివరాలు [1]
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013, జూలై-21; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, జనవరి-28; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఆగస్టు-3; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఏప్రిల్-1; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2014, మే-28;11వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, సెప్టెంబరు-24; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-10; 2వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, మార్చి-29; 3వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఏప్రిల్-24; 1వపేజీ.