చేజెర్ల (ఒంగోలు మండలము)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చేజెర్ల
రెవిన్యూ గ్రామం
చేజెర్ల is located in Andhra Pradesh
చేజెర్ల
చేజెర్ల
నిర్దేశాంకాలు: 14°31′12″N 79°34′01″E / 14.52°N 79.567°E / 14.52; 79.567Coordinates: 14°31′12″N 79°34′01″E / 14.52°N 79.567°E / 14.52; 79.567 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంఒంగోలు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,034 హె. (2,555 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523182 Edit this at Wikidata

చేజెర్ల, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[1].

గ్రామనామ వివరణ[మార్చు]

చేజెర్ల అనే పేరులో చే అనే పూర్వపదం, జెర్ల అనే ఉత్తరపదం ఉన్నాయి. వీటిలో చే అనేది వర్ణసూచి కాగా, జెర్ల అనే పదం చెర్లకి రూపాంతరం. చెర్ల చెరువు (ల)కి రూపాంతరం. జెర్ల అనేది జలసూచి.[2]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఎత్తు: సముద్రమట్టానికి 12 మీటర్లు

సమీప గ్రామాలు[మార్చు]

దేవరంపాడు 2.6 కి.మీ, వినోదరాయునిపాలెము 3 కి.మీ, ఉలిచి 4.3 కి.మీ, అమ్మనబ్రోలు 5.2 కి.మీ, కనపర్తి 5.8 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

కొత్తపట్నం 12.3 కి.మీ, నాగులుప్పలపాడు 13.1 కి.మీ, ఒంగోలు 14 కి.మీ, చినగంజాం 17.4 కి.మీ.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పల్లప్రోలు అనూరాధ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ మారాసీ అంకమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

చేజెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పానకాలపాలెం గ్రామ పరిధిలోని మారాసీ అంకమ్మ కొలువులు, 2వ వార్షికోత్సవం, 2014- ఫిబ్రవరి 3, సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. [1]

శ్రీ చేజెర్లమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు ప్రతి సంవత్సరం వైశాఖమాసం, శుక్లపక్షంలో ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయానికి రంగులు వేసి అందముగా అలంకరించెదరు. చివరి రోజున పొంగళ్ళు పెట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఆ రోజున ఏర్పాటు చేసే విద్యుత్తు ప్రభలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యకార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళకు గ్రామస్థులేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. [2]

శ్రీ నాగలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2014,జూన్-8, ఆదివారం ఉదయం అర్చకుల వేదమంత్రాల నడుమ, నాగలింగేశ్వరస్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వరస్వామి, పార్వతీదేవి, నందీశ్వర, నవగ్రహాలు, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,240 - పురుషుల సంఖ్య 643 - స్త్రీల సంఖ్య 597 - గృహాల సంఖ్య 298

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,168.[3] ఇందులో పురుషుల సంఖ్య 599, మహిళల సంఖ్య 569, గ్రామంలో నివాస గృహాలు 285 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1034 హెక్టారులు.

  • గ్రామసంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 235. Retrieved 10 March 2015.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,ఫిబ్రవరి-4; 5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు ; 2014,మే-15; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,జూన్-9; 2వపేజీ [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013, ఆగస్టు-3; 2వపేజీ.