షేక్ మహబూబ్ సుభానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షేక్ మహబూబ్ సుభానీ ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడు.ఈయన కలైమామణి బిరుదాంకితులు.

జీవిత విశేషాలు[మార్చు]

ప్రకాశం జిల్లా వీరికి మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామం.ఈయన తల్లిదండ్రులు షేక్‌ మీరాసాహెబ్‌, హుస్సేన్‌భీలు.ఈయన ఎనిమిదవ తరగతి వరకూ గ్రామంలోనే చదివారు.పై చదువులకు వాకాడులో హాస్టల్ లో చదివాడు. ఈయన భార్య షేక్ కాలేషాబితో కలిసి దేశ విదేశాలలో నాదస్వర కచేరీలు ఇస్తున్నారు.షేక్ కాలేషాబి ది .ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చేకూరపాడు గ్రామం వారిది కూడా విధ్వాంసుల కుటుంబమే.విరికి 1977 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.ఒక కుమారుడు. ఈయన తన 10 వ ఏట నుండే నాథ స్వర సాధనను చదువుకుంటూనే చేస్తూ వారి తండ్రిగారితో కచేరీలలో పాల్గొనేవారు.

ఈయన గురువు ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్‌ చిన మౌలానా.అతని ద్వారానే ఈ దంపతులు వెలుగులోకి వచ్చారు. ఈయన కృషికి కలైమామణి బిరుదును తమిళనాడు ప్రభుత్వం జూలై 29న 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చారు. ఇద్దరికి ఒకే సారి ప్రభుత్వం బిరుదులు ప్రధానం చేయటం అరుదైన గౌరవం.

విశేష వ్యక్తుల ఎదుట కచేరీలు[మార్చు]

  • రాష్ట్రపతిభవన్‌లో కేవలం దేశంలోని 100 మంది ప్రముఖులు మాత్రమే కూర్చుని చూడగలిగే ఇంద్రధనస్సు థియేటర్‌లో రాష్ట్రపతి అబ్ధుల్‌ కలాం ఎదుట ప్రదర్శించిన కచేరి.
  • రాష్ట్రపతి వెంకట రామన్‌ ఎదుట, ఎన్నికల కమిషనర్‌ ఎన్‌ గోపాల స్వామి ఎదుట, ఢిల్లీలోని మురుగన్‌ మలై టెంపుల్‌లో, కరుణానిధి ఎదుట, టివిజి అకాడమీ చెన్నైలోనిర్వహించిన కార్యక్రమంలో అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థనరెడ్డి, బాలమురళీకృష్ణ ఎదుట ప్రదర్శించి కచేరీలు

నచ్చిన రాగాలు, కీర్తనలు[మార్చు]

ఈయనకు నచ్చిన రాగం తోడి, కాపి రాగాలు. నచ్చిన కీర్తన ఎందుకు దయ రాదు...అనేవి

ప్రత్యేకత[మార్చు]

భార్యా భర్తలు ఇద్దరు కలిసి నాదస్వరం వాయించడము వీరి ప్రత్యేకత. వీరి ప్రతిభకు మెచ్చి తమిళనాడు ప్రభుత్వము వీరికి కలైమామిలి పురస్కారాన్ని ప్రసాదించి గౌరవించింది. భారత రాష్ట్రపతుల ఎదుట వీరి పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశము వీరికి కలిగింది. దంపతులుగా భారతదేశములో ఇటువంటి అరుదైన గౌరవాన్ని పొందిన వారు ఎవరు లేక పోవడము వీరి గొప్పతనము.

మూలాలు[మార్చు]