షేక్ మీరాసాహెబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షేక్ మీరాసాహెబ్ క్లారనెట్ కళాకారుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను షేక్ సుబ్బులు, గోవాడ మస్తాను దంపతులకు జన్మించాడు. అతను గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరు లో భజన కోలాటాల క్లారినెట్ కళాకారునిగా పేరు గాంచాడు. అతను రంగస్థల నటుడు ఏ.వీ.సుబ్బారావు మొదలు డీ.వీ.సుబ్బారావు మనుమని వరకు రంగస్థలకళాకారులందరికీ తలలో నాలుకలా వ్యవహరించి క్లారినెట్ వాయించాడు. తిరుపతి, రవీంద్రభారతి, ఇంకా పలు ప్రాంతాలలో అతను కోలాటం చెక్కభజనలలో క్లారినేట్ వాయించి అనేక పురస్కారాలు పొందాడు. కోలాటం చెక్కభజనలలో అతని క్లారినేట్ విన్యాసానికి ప్రేక్షకులు కూడా మైమరచి నాట్యం చేస్తారట. అతని కుమారుడు షేక్ మహబూబ్ సుభాని కూడా నాదస్వర కళాకారుడు. [1]

అతను 2008 నవంబరు 29 న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Sivaprasad (30 July 2010). "Notes of erudition on the nagaswaram". The Hindu. Retrieved 15 February 2020.