Jump to content

చర్చ:కోరంగి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఊరి పేరు

[మార్చు]

ఇప్పుడే నేను కనుగొన్నాను, పేరు తప్పుగా ఉన్నదని, పెద్దలు సరిచూడాలి, తూర్పు గోదావరి జిల్లా వారికి బాగా తెలుస్తుంది, చాలా ముఖ్యమైన విషయం పేరు సరి చేస్తే ఇక్కడ ఒక చిన్న పాటి వ్యాసం జాతీయ సూచన విజ్ఞాన కేంద్రం వారి సమాచారం తో వ్రాయాలి అని అనుకొంటున్నాను. సరైన పేరు కోరంగి ఇక్కడ గోదావరి నది సముద్రం లొ కలుస్తుంది. ఆంగ్లం en:Koringa River, en:Coringa (village),en:Coringa Wildlife Sanctuary [1] --మాటలబాబు 03:45, 20 ఆగష్టు 2007 (UTC)

అంతా బాగానే ఉంది. కానీ అన్నిచోట్ల కొరింగ అని ఎందుకు ఉందంటారు? ఇది తురింగకు పాత పేరా? --వైజాసత్య 04:32, 20 ఆగష్టు 2007 (UTC)
ఇక్కడి ప్రజల వాడుక లొ ఉన్న పేరు తురింగ, ఈ విషయాన్ని తెలుగు బ్లాగు గుంపు లొ చర్చించ వచ్చా.. అక్కడ ఎక్కువ మంది తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ లొ ఇప్పుడు నివసిస్తున్నవారు ఉన్నారు కదా..--మాటలబాబు 04:36, 20 ఆగష్టు 2007 (UTC)
మీకూ ఖచ్చితంగా తెలియదంటే తప్పకుండా చర్చించవచ్చు. --వైజాసత్య 04:39, 20 ఆగష్టు 2007 (UTC)
నాకు ఖచ్ఛితంగా తెలుసు ఇప్పుడే మా నాన్న గారితో మాట్లాడాను తురింగ సరైన పేరు. మాన్‌గ్రూవ్స్(mangroves) ఉన్నాయని చెప్పారు. తెలుగు పదం కూడా చెప్పారు కాని మరచి పోయాను, నిఘంటువు లొ దొరుకుతుంది. అని అనుకొంటున్నా.. అక్కడ కూడా చర్చితే విషయం పూర్తిగా తేట తెల్లం అవుతుంది కదా. టపా అందింది, పంపినందుకు ధన్యవాదాలు--మాటలబాబు 04:44, 20 ఆగష్టు 2007 (UTC)
వికీమాపియా లో కూడా కొరింగ అని ఉంది. ఈ ఆంధ్రజ్యోతి వ్యాసంలో కూడా కొరింగ అనే ఉంది. తురింగ కొరింగకు వ్యావహారిక నామమేమో? (విజయవాడను బెజవాడ అన్నట్టు) --వైజాసత్య 04:53, 20 ఆగష్టు 2007 (UTC)
ఒకవేళ దీనికి తురింగ అని ఇంకొక పేరుందని తేలినా చాలాచోట్ల కొరింగ అనే వ్యవహరించబడింది కాబట్టి వ్యాసానికి కొరింగ అనే పేరే పెట్టాలి (అని నా అభిప్రాయం కాదు..వికీ ఆనావాయితీ). ఏదేమైనా వ్యాసం పేరు మార్చటం పెద్ద వ్యవహారం కాదు. అది ఎప్పుడైనా చేయవచ్చు. నేను దీని గురించిన సమాచారం చదువుతుంటే చాలా ఆసక్తిగా ఉంది. నేనూ మీతోపాటు ఈ వ్యాసం అభివృద్ధికి కృషి చేస్తాను --వైజాసత్య 05:07, 20 ఆగష్టు 2007 (UTC)
తూర్పుగోదావరి జిల్లా అధికారిక వెబ్సైటులో కొరింగ గురించి.--వైజాసత్య 05:54, 20 ఆగష్టు 2007 (UTC)
mangroves అంటే మడ అడవులు. __చదువరి (చర్చరచనలు) 07:49, 20 ఆగష్టు 2007 (UTC)
ఇక్కడ తెలుగు పేపర్ల క్లిప్పింగులు ఉన్నాయి చూడండి. వాటిలోనూ కోరంగి అనే ఉంది --వైజాసత్య 10:00, 20 ఆగష్టు 2007 (UTC)
క్షమించాలి ఇంత చిన్న విషయానికి దీర్ఘ చర్చ జరిపినందుకు, చర్చ ఇంత తో ముగుంచవచ్చు. ఇప్పుడే రాజమండ్రి అటలీ శాఖ కార్యాలయానికి ఫోన్ చేశాను. సరైన పేరు కోరంగి అని చెపాడు అక్కడ పనిచేశేవాడు. కోరంగి సరైన పేరు అని ఈ చర్చా ఫలితం , పెద్దల సమయం వ్యర్థ పరచినందుకు క్షమాపణలు --మాటలబాబు 12:22, 20 ఆగష్టు 2007 (UTC)
ఫర్లేదు..ఈ శోధనలో చాలా విషయాలు తెలుసుకున్నాను --వైజాసత్య 12:44, 20 ఆగష్టు 2007 (UTC)