చర్చ:గ్రామ దేవత
స్వరూపం
ఈ వ్యాసములో చాలా విషయములు సహజత్వానికి చాలా దూరంగా ఉన్నట్టనిపిస్తున్నాయి. గ్రామ దేవతలను గ్రామ రక్షణ కొరకు రూపోందించరనేది తప్ప మిగిలిన విషయాలు కొంచెం నిరాధారాలుగా అనిపిస్తున్నాయి. దీనికి సంబందంచిన మరిన్ని విషయాలు ఎవరికయినా తెలిస్తే చేర్చగలరు.విశ్వనాధ్. 05:39, 15 అక్టోబర్ 2007 (UTC)
- వ్యాసం చాలా ఆసక్తి కరంగా ఉన్నది. ముఖ్యంగా ఏ పేరులు ఎలా వచ్చాయో నాకిప్పుడే తెలిసింది. కాని నమ్మకాలపైన ఆధారపడిన విషయం గనుక "ఇలా నమ్ముతారు" అన్న ధోరణిలో వ్రాస్తే సరిపోతుంది. ఎక్కడినుండి ఈ సమాచారం తీసుకొన్నారో వ్రాయడం చాలా అవుసరం. ఏవైనా ఫొటోలు లభిస్తాయా? (దేవతలవి కాదు. దేవతల గుడులు లేదా జాతరలు!)--కాసుబాబు 08:40, 25 నవంబర్ 2007 (UTC)
వ్యాసం విషయ దోషాలు
[మార్చు]అయ్యా! నాకున్న ఆద్యాత్మిక ఙానానికి ఈ వ్యాసం సరిపోలడం లేదు.నాకు తెలిసిన కొన్ని ధోషాలను ఉదహరించ దలిచాను.
- గ్రామదేవతలు 101 అక్క చెల్లెళ్ళని నానుడి,వారిలో వారికి పడదని వారివూళ్ళలోని కి పొరుగూరి దేవతలని రానివ్వరని ఒకనమ్మకం అలా ఆగ్రామప్రజలను పొంగు,మసూచి,మహమ్మారి(కలరా) ల నుండి కాపాడతారని ఒక నమ్మకం.కారణం గ్రామదేవతలు తమ వూరి ప్రజలను రోగాల బారినుండి కాపాడతాయి కానీ పొరుగూరి ప్రజలను పీడిస్తాయి.కాబట్టే వీరిని క్షుద్రదేవతలు అంటారు.
- వీరిలో కొందరి గుళ్ళు తప్ప చాలా మంది గుళ్ళు సంవత్సరానికి ఒక్క సారేతెరుస్తారు.కారణం వారిని రోజూ పోషించలేక(బలులూ,కుంభాలూ పోయలేక) ఎట్టిపరిస్థితులలోనూ ఒకదేవత మొక్కు వేరొక దేవత దగ్గర తీర్చుకోరాదు అని అంటారు.
- ప్రతిష్ట వేదపండితుల ద్వారానే జరిగినా యంత్రం మాత్రం క్షుద్ర వుపాసకుల ద్వారానే నిర్మించబడుతుంది,చాలా సందర్బాలలో ప్రతిష్ట కూడా వీరి ద్వారానే జరుగుతుంది.
- ఒంటి పై నూకలల్లే పోసేటి అమ్మ(పొంగు)నూకాలమ్మ,ముత్యాలల్లే పోసేటి అమ్మ(మసూచి)ముత్యాలమ్మ.
- సూరమ్మ అనే గ్రామదేవత నాకు తెలిసి లేదు.
- మారెమ్మ(మహమ్మారిని రూపుమాపేది),పోలేరమ్మ లకు పౌర్ణమి న జాతర చేస్తారు.
- వీరు శివసత్తులు(శివశక్తులు(శక్తి అవతారాలు))కానీ పంచ భూత స్వరూపాలుకాదు.
- 'శీతల' పోచమ్మ,పోలేరమ్మ,పాగేలమ్మ మెదలైన దేవతలకు వేసే యంత్ర అధిదేవత.శీతలాపరమేశ్వరికి ప్రత్యేకించి దేవాలయాలు లేవు.
- పదిహేను వూళ్ళ కు ఒక దేవత కాదు వూరికి 8 మంది దేవతలను అష్టదిగ్బందనం గా ప్రతిష్టించారు,కానీ కొందరు ప్రసిద్దిచెందారు,కొందరు కాలగర్బంలో కలిసిపోయారు.
- పోచేటి అమ్మ పోచమ్మ,మహిషాషురమర్దిని మైసమ్మ,పాగాలు కాసేటి అమ్మ పాగేలమ్మ,సత్యమైన అమ్మ సతెమ్మ,నూకలల్లే పోసేటి అమ్మ(పొంగు)నూకాలమ్మ,ముత్యాలల్లే పోసేటి అమ్మ(మసూచి)ముత్యాలమ్మ,మారెమ్మ,మరిడమ్మ(మహమ్మారిని రూపుమాపేది).
- సూర్య గారూ! వ్యాసాన్ని శ్రద్ధగా పరిశీలించి విమర్శించినందుకు అభినందనలు. మీరు వ్రాసినవి ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకు ముందు ఈ వ్యాసంలోని విషయాలు వ్రాసినవారు తమకు తెలిసిన విధంగా వ్రాశారు. అవి సరి కాదనిపిస్తే మీరు నిస్సంశయంగా సరి దిద్దండి. ఒకవేళ వేరే వారు వ్రాసిన విషయం కూడా సరికావచ్చును అనిపిస్తే అది "మరొక అభిప్రాయం" అని వ్రాయవచ్చును. ఏదైనా ఇలాంటి విభేదాలను పరిష్కరించడానికి "మూలాలు" పేర్కొంటే బాగుంటుంది. ఒకమారు వికీపీడియా:మూలాలు చూడగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:01, 17 జూలై 2008 (UTC)
- చాలా వూళ్ళపేర్లు గ్రామదేవతల పేర్లతోపుట్టాయి.ఉదా:పోలకమ్మ పేరుతో పోలకంపాడు... వగైరా.కొన్నిఊళ్ళు కొంతమంది దేవతల పేర్లతో ప్రసిద్ధి.ఉదా:బెజవాడ కనకదుర్గ ,కొండపాటూరు పోలేరమ్మ ,..వగైరా.ఆయా దేవతల పేరిట ఒక వ్యాసం ఉంటే బాగుంటుంది--Nrahamthulla 10:22, 28 సెప్టెంబర్ 2009 (UTC)
.