Jump to content

చర్చ:జక్కన్న

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

జక్కన్న గూర్చి సమాచారం, బొమ్మలు, మూలాలు తెలిసిన సభ్యులు, ఇందులో చేర్చవలెనని విన్నపం. నిసార్ అహ్మద్ 20:24, 21 నవంబర్ 2008 (UTC)

అమరశిల్పి జక్కన సినిమా పేరు గుర్తొచ్చి ఈ పేరు కళాకారుల జాబితాలో చేర్చాను. ఇప్పుడనిపిస్తున్నది! మైకేలాంజిలో, డోనటెల్లో, పికాసో వంటి కళాకారుకున్న ప్రాచుర్యం సాధారణమైనది కాదు. కాని హళెబీడు (జక్కన శిల్పాలు ఉన్నది), రామప్పగుడి, అజంతా, ఎల్లోరా, ఖజురాహో, మహాబలిపురం, శ్రీకాళహస్తి, తంజావూరు వంటి చోట్ల గొప్పగొప్ప కళాఖండాలను సృష్టించిన మహానుభావులెవరి పేర్లూ మనకు తెలియరావడంలేదు. చాలా కొద్ది పాటి కళాకౌశలం ఉన్న సినిమా హీరోలకు మాత్రం ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు! నిజమైన కళాస్రష్టలను గౌరవించడంలో మనం చాలా అధమ స్థితిలో ఉన్నాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:22, 22 నవంబర్ 2008 (UTC)

చక్కగా చెప్పారండి, ఇలాంటి గొప్ప కళాకారులను విస్మరిస్తే అది కళలు మరియు కళాకారులపట్ల ద్రోహమే అవుతుంది. మనం ఈ శిల్పాలను చూసి మురిసిపోతాం గాని వీటివెనుక గల కళాకారుల జీవనాంకితాలు మనకు తెలీవు. దీనిపై మనం కొంచెం ప్రయత్నం చేసి వీరి వివరాలు ప్రజలకు తెలియజేసే కార్యం చేపట్టాల్సిందే. ఓపేజీ సృష్టించి, వాటిలో కళాకారుల జాబితా తయారు చేసే పని మొదట చేపట్టాలి. నిసార్ అహ్మద్ 05:14, 22 నవంబర్ 2008 (UTC)

చాలా మంచి ఆలోచన మీది. జక్కన లాంటి గొప్ప కళాకారులు ఎందరో ఉన్నారు. ఆయా శిల్పకళాఖండాలున్న ప్రదేశాల చరిత్ర మీద పరిశీలనతో చూస్తే వీరి వివరాలు తెలియవచ్చును. దీనికి అందరూ కృషి చేయాలి. కలిసిపనిచేయాలి. ముందుగా ఒక కళాకారుల జాబితాను తయారుచేస్తే బాగుంటుందేమో.Rajasekhar1961 06:14, 22 నవంబర్ 2008 (UTC)

జక్కన్న గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి