Jump to content

చర్చ:జడ్చర్ల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈ మండలంలో మీనాంబరం అనే ప్రసిద్ధగ్రామం పుస్తకంలో ఉన్నది. కానీ వికీలో కనిపించలేదు. దయచేసి నిర్ధారించండి.Rajasekhar1961 (చర్చ) 06:41, 26 అక్టోబర్ 2013 (UTC)

మీరు చెప్పినట్లు మీనాంబరం అనే ప్రసిద్ధ గ్రామం ఉండేది. క్రీ.శ.7వ శతాబ్ది నాటికి అది ఒక పెద్ద క్షేత్రం. చాళుక్యుల ఉప రాజధానిగా ఉండిన గంగాపురంకు అతి సమీపంలో దుందుభినది (దీనికే డిండి లేదా మీనాంబరం అనిపేరు) తీరాన పరుశువేదీశ్వరాలయం ఉండేది. చాళుక్య త్రైలోక్యసోమేశ్వరుడి కాలంలో గంగాపురం నుంచి మీనాంబరం వరకు అడుగడుగునా రమణీయ శిల్పాలతో కూడిన ఆలయాలు, వాటిపై శిలాశాసనాలు కనిపించేవట. గంగాపురం హనుమచ్ఛర్మ అనే ప్రముఖ కవి దుందుభీ కావ్యంలో ఈ క్షేత్రం గురించి విపులంగా పేర్కొన్నారు. దుందుభీ తీరక్షేత్రంగా కూడా ఇది ప్రసిద్ధి. దురదృష్తవాశాత్తు మీనాంబరం గ్రామం చరిత్రలో కలిసిపోయింది. ప్రస్తుతం అక్కడ పురాతనక్షేత్రం మాత్రమే మిగిలిఉంది. ప్రస్తుతం అది గ్రామం కాకపోవడంతో రెవెన్యూ రికార్డులో లేదు కాబట్టి వికీలోనూ చేర్చబడలేదనుకుంటాను. తగినంత సమాచారం లభిస్తే పేజీ ప్రారంభించవచ్చు లేదా గంగాపురం గ్రామంలోనే వ్రాయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:54, 26 అక్టోబర్ 2013 (UTC)

జడ్చర్ల గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి