చర్చ:జిహాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

http://sahityaavalokanam.net/?p=68 బదులు Ibn Warraq Google కి డైరెక్ట్ గా లింక్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తోంది. కొందరికి ఇంగ్లిష్ కంటే తెలుగు సులభంగా అర్థమవుతుంది. తెలుగు ఇంట్రొడక్షన్ లింక్ ఇవ్వడంలో తప్పేమీ లేదు.

తప్పులేదు, కానీ, మన అభిప్రాయాలను ఒక బ్లాగు లో రాసి, అది ఇక్కడ ఇవ్వచ్చా? పుస్తకములో భావము ఒకొక్కరు ఒక విధముగా అర్ధము చేసుకుంటారు. అది వారి ఇష్టము. మన భావలని చదవమంటే కొంతమంది తప్పులు పట్టచ్చు. కిరణ్మయీ 13:04, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది జిహాద్ ని కీర్తించే వ్యాసం[మార్చు]

పాకిస్తాన్ లో కూడా కొంత మంది జిహాద్ ని వ్యతిరేకిస్తుండగా ఇక్కడ జిహాద్ గొప్ప కార్యం అని రాయడం జనాన్ని పక్కదారి పట్టించేలా ఉంది.

ఏ విషయం గురించైనా తటస్థ దృక్కోణంలో రాయడం వికీ నైజం. ఏ కొద్ది మంది అభిప్రాయాలకో వికీలో స్థానం లేదు. సరైన ఆధారాలను చూపిస్తూ వ్యాసాలను రాస్తే సరి. — రవిచంద్ర(చర్చ) 06:14, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇబ్న్ వరాక్ అభిప్రాయం ఒక రకంగా నిజమే. సున్నీ ముస్లింలు జిహాద్ ని నమ్ముతారు కానీ అది అధికారికంగా అంత ఇంపార్టెంట్ కాదు. షియా ముస్లింలు మాత్రం జిహాద్ తప్పనిసరి కార్యం అనుకుంటారు. తెలుగు వికీపీడియాలో ఈ వ్యాసం రాసిన ముస్లింలు సున్నీలా, షియాలా అనేది డౌట్ గా ఉంది.

అయ్యా, ఇక్కడ రాస్తున్న వారు తమ పేరు అయినా రాస్తే, సంబోధించడం తేలిక అవుతుంది. తటస్థ దృక్కోణంలో చూస్తే ఇక్కడ రాయడం లో తప్పు లేదు. సున్నీలా, షియాలా అనేది కూడా అనవసరము. వ్యాసము ప్రమాణాలకు తగ్గట్టు ఉందా అన్నది మనము చూడాలి. కిరణ్మయీ 13:04, 2 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అల్‌ఖైదాలో చేరటం ఇస్లాంకు విరుద్ధం[మార్చు]

  • అల్‌ఖైదాలో చేరటం ఇస్లాంకు విరుద్ధం.నిషిద్ధ 'తక్‌ఫిరిజమ్‌' సిద్ధాంతాన్ని అల్‌ఖైదా అనుసరిస్తోంది.అల్‌ఖైదాతో సంబంధం పెట్టుకోవటం ఇస్లాం బోధనల ప్రకారం నిషిద్ధం.---- సౌదీ మతాచార్యులు,రాజ దర్భారులో సలహాదారు షేక్‌ అబ్దుల్‌ మోహ్‌సెన్‌ అల్‌-ఒబీకాన్‌.(ఈనాడు 14.1.2010)--Nrahamthulla 06:01, 14 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

జిహాద్ అంటే ధర్మపోరాటం కాదు[మార్చు]

  • శశికాంత్ గారూ,"జిహాద్ అంటే ధర్మపోరాటం, న్యాయంకోసం పోరాటం అని అర్ధం. తీవ్రవాదులు ఉగ్రవాదులు హింసకు పాల్పడే అరాచకవాదులు తమ దుర్మార్గపు పనులను కూడా జిహాద్ అనే పిలుస్తున్నందువలన ఇంత మంచి పదం చెడ్డదైపోయింది.మంచిని ఆపుతూ దుష్టులు జిహాద్ అని అరవటం వల్ల ఈ పదం అభాసుపాలయ్యింది"లాంటి వాక్యాలు ఎందుకు తీసేశారు?.--Nrahamthulla 13:08, 16 సెప్టెంబర్ 2010 (UTC)
  • వాస్తవ మరియు తటస్థ దృక్కోణం తో రాశాను. జీహాద్ అంటే ధర్మపోరాటం కాదు, మతపోరాటం. ధర్మం అంటే రెండు సమానమైన అర్థాలు ఉన్నాయి. ఒకటి మతం, రెండోది న్యాయం(లేదా మంచి). ఈ రెండిటినీ satisfy చేసినప్పుడే ధర్మం అని వాడాలి. ప్రపంచవ్యాప్తంగా చేసే జీహాద్ అనేది మతం కోసం చేసే యుద్ధం. ముస్లింలకు తమ మతం చెప్పేదే న్యాయం. మతానికి వ్యతిరేకమైనది అనైతికం. అందువల్ల ముస్లిమేతరులను చంపడం ఇస్లాం ప్రకారం న్యాయం. కాని మిగిలిన వారి ప్రకారం అది న్యాయం కాదు. కనుక ఇక్కడ జీహాద్ అనే పదం మతాన్ని satisfy చేస్తోంది కాని న్యాయాన్ని satisfy చేయట్లేదు. అందువల్ల ధర్మపోరాటం అని వాడేకన్నా మతపోరాటం అంటే సరిగ్గా ఉంటుంది. అమాయకులను చంపుతూ న్యాయపోరాటం అంటే ఎలా?
ఎవరో దుర్మార్గులు జీహాద్ అని అరిచి ఈ పదాన్ని వాడుకుని పాడు చేశారంటున్నారు కదా, జీహాద్ అని అరిచి మంచి చేసిన వారిని చూపించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయాన్ని వదిలి ఇతర మతస్థుల పదాల చాటున దాక్కోవడం సబబు కాదు. జీహాద్ అంటే ధర్మపోరాటం అంటే ఎవడూ ఒప్పుకోడు. ధర్మపోరాటాలలో అమాయకులు చనిపోరు. కాని జీహాద్ లో ఎప్పడూ అమాయకులే చనిపోతారు. జరుతున్న వాస్తవాన్ని వదిలేసి దాన్ని సమర్ధించడం పాపంలో పాలుపంచకోవడమే. ఒసామా బిన్ లాడెన్ ఇస్లామిక్ దేశాలలో ఒక పెద్ద హీరో. అక్కడ ముస్లింలంతా అతడిని ధర్మరక్షకుడిగా భావిస్తారు. ఎందుకంటే వారి దృష్టిలో అతడు మతాన్ని న్యాయాన్ని రెండిటిని కాపాడాడు. కాని ఇతరుల దృష్టిలో అతడు మతం కోసం పోరాటం చేశాడు కాని న్యాయం కోసం కాదు. కనుక అతడిని మతరక్షకుడు అనాలి తప్ప ధర్మ రక్షకుడు అనకూడదు.
వికీ పాలసీల ప్రకారం వ్యాసాలు వాస్తవాన్ని ప్రతిబింబించాలి. ఇంక వాదనకు ఆస్కారం లేదు. జీహాద్ అంటే తీవ్రవాదం అని నిక్కరు వేసుకున్న పిల్లాడు కూడా చెబుతాడు. కాని తీవ్రవాదులకు మాత్రం వారు చేస్తున్న పని తీవ్రవాదం కాదు, మీరు చెప్పినట్టు ధర్మపోరాటమే. --శశికాంత్ 14:29, 16 సెప్టెంబర్ 2010 (UTC)
అవును. ఒక్క మనిషిని చూపించమనండి. పదిమందిలో ఒకడిగా ఉంటె శాంతికాముకుడు. ముగ్గురైతే జిహాద్ మంత్ర పఠనం చేసే ముజహిద్దీన్ లు. భారత దేశపు దయనీయస్థితి అదేకదా!!Kumarrao 16:54, 16 సెప్టెంబర్ 2010 (UTC)
  • ఈ జన్మ చాలా చిన్నది.మీ సొంత నిర్వచనాలను తిరగరాయండి.మీరు చెప్పిన తీవ్రవాదుల్లాగా ముస్లిములంతా ఏమీ భావించరు.లాడెన్ లాంటి తీవ్రవాదులు హిందువుల్లో కూడా ఈమధ్య తయారయ్యారని సంపాదకీయం వచ్చింది: http://www.dalitvoice.org/Templates/sep_a2010/editorial.htm . ఒకరినొకరు ప్రతీకారేచ్చతో రెచ్చగొట్టుకుంటే శాంతి ఉండదు.

వాస్తవం ఏమిటంటే ఒకడు తన భార్యాబిడ్డల కోసం చేసే శ్రమ అసలైన జిహాద్.కాశ్మీర్ తీవ్రవాదులగుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ రుక్సానా ది అసలైన జిహాద్. ఆమె ధ్యేయం భారత సైన్యంలో చేరడం.మత రక్షణ కంటే మానవత్వ రక్షణే మంచి జిహాద్.అన్నదమ్ముల్లా కలిసి ఉండటమే ఉత్తమమైన జిహాద్.పొరుగువారి తప్పుల్ని క్షమించి వారి ప్రాణాలను కాపాడటం మహా గొప్ప జిహాద్.--Nrahamthulla 16:26, 16 సెప్టెంబర్ 2010 (UTC)

జిహాద్ ధర్మపోరాటం అనడం వాస్తవవిరుద్ధం, హాస్యాస్పదం, నిజవక్రీకరణం, చారిత్రక సత్యాన్ని మరుగు మరిచే ప్రయత్నం. జిహాద్ అంటే ముస్లిమేతరులపై యుద్ధం చేసి చంపడం లేదా మతం మార్చడం. షియాలు, బోహ్రాలు, అహమ్మదీయాలు, గుజ్జర్లు, బహాయీలు కూడా ఈ తరగతిలోకి వస్తారు పవిత్ర కొరాన్ ప్రకారము.Kumarrao 16:36, 16 సెప్టెంబర్ 2010 (UTC)
  • కుమార్ గారు బాగా చెప్పారు. రహ్మతుల్లాగారు, నావి సొంత నిర్వచనాలు కావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్వచనం ఒక్కటే. జీహాద్ అంటే తీవ్రవాదం, ముస్లిమేతరులపై చేసే యుద్ధం. రుక్సానా ఇంటికి వచ్చిన తీవ్రవాదులు సైతం జీహాద్ కోసం రమ్మని అడిగారు. కాని ఆమె జీహాద్ ని తిరస్కరించి వారితో పోరాడింది. మీరు కూడా మతం కోసం ప్రాకులాడకుండా జీహాద్ ని ఖండించి మానవత్వం ఉందని నిరూపించుకోండి. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ముస్లింలు తీవ్రవాద ఘటనలు జరిపారు. అందులో అన్నిటికీ ఒక్కటి కామన్ గా ఉంది. అదే జీహాద్. జీహాద్ పేరుతో మానవత్వ పరిరక్షణ జరిగిన రోజున నేనే స్వయంగా ఈ పేజీని మారుస్తాను. కాని ఇస్లాం పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు జీహాద్ పేరుతో యుద్ధాలు, చావులు చూశామే తప్ప ఒక్క ప్రాణం కూడా కాపాడలేదు. --శశికాంత్ 17:23, 16 సెప్టెంబర్ 2010 (UTC)
శశికాంత్ గారు, రుక్సానా చేసింది మానవ సహజమైన ఆత్మరక్షణ, ప్రతీకార ప్రేరేపితం. ఉగ్రవాదుల చేతుల్లో హింసింపబడిన తండ్రిని చూసి సహించలేక తిరగబడిన ఒక సామాన్య మహిళ ఆక్రోశం. దీనిని "జిహాద్" తో ముడిపెట్టడం హాస్యాస్పదం. Kumarrao 17:35, 16 సెప్టెంబర్ 2010 (UTC)

కిం కర్తవ్యమ్[మార్చు]

వ్యాసం అధికంగా ఆంగ్లంలో ఉంది. ఇంకా ఒక షేపుకు రాలేదు. కాని చర్చలు వేడిగా ఉన్నాయి. సభ్యుల స్వంత అభిప్రాయాలు అధికంగా వినబడుతున్నాయి. ప్రస్తుతం ఇలా చేస్తాను.

  1. అనువాదం కోసం ఒక వారం వేచి చూస్తాను.
  2. వారం తరువాత ఆంగ్ల భాగాన్ని తొలగిస్తాను.
  3. స్పష్టమైన ఆధారం లేని వివాదాస్పద భాగాలను తొలగిస్తాను.

సభ్యులు గమనించగలరు. --కాసుబాబు 17:53, 16 సెప్టెంబర్ 2010 (UTC)

అలాగే.Kumarrao 17:56, 16 సెప్టెంబర్ 2010 (UTC)
  • అరబీలో జిహాద్ అనే పదం వ్యుత్పత్తి అర్ధం మాత్రం మంచిదే.కిరాతకులు ఆ పేరుతో చెడుపనులు చేసి ఆ పదాన్ని పాడుచేశారు అని చెప్పటమే నాఉద్దేశం.జిహాద్ పేరుతో ఆఫ్గన్ లో తాలిబన్లు ఆడపిల్లలను బడికి పంపించిన తల్లిదండ్రులను కూడా తన్నేవారట.సాటి ముస్లింల మానవ హక్కులు దారుణంగా కాలరాశారు.చాలా ఘోరాలు జరిగాయి.అలాగే మనదేశంలోఎన్నో దర్గాలలో సమాధి అయిన ఎందరో సూఫీ మహనీయులు పూర్తి ఆద్యాత్మిక చింతనతో తమలోని దుర్గుణాలపై తామే జిహాద్ చేసుకున్నారు.నా వాదన ఆ పదం యొక్క వాస్తవ అర్ధం మంచిది ఆన్నంతవరకే పరిమితం.--Nrahamthulla 00:32, 17 సెప్టెంబర్ 2010 (UTC)