చర్చ:టైటానిక్ నౌక
స్వరూపం
టైటానిక్ మరియు గుంటూరు
[మార్చు]ఈ విశేషము టైటానిక్ వ్యాసంలో ఒక విభాగంగా చేర్చేవలసినంత గొప్ప విషయమేమి కాదని నా అభిప్రాయం. ఇందులో ప్రస్తుతం ఉన్న ఒక్క వాక్యం మించి ఇంకా ఇక్కడ వ్రాయటానికేమీ లేదు. ఒకవేళ వ్రాసినా అది అప్రస్తుతం అవుతుంది. మరో విషయం ఇక్కడ ఆ గుంటూరు నుండి ప్రయాణించిన కుటుంబం భారతీయ కుటుంబమని చెప్పుకోవటం అసలు సబబు కాదు. మతప్రచారం చేయటానికి అమెరికానుండి భారతదేశానికి వచ్చిన ఒక అమెరికన్ కుటుంబము..తమ దేశానికి తిరిగి వెళుతూ తమ ప్రయాణంలోని చివరి అర్ధభాగంలో నక్కను తొక్కి టైటానిక్కు ఎక్కారన్నమాట. అందుకే ట్రివియాలను కాస్త క్షుణ్ణంగా పరిశీలించిగానీ నమ్మకూడదు. --వైజాసత్య 19:51, 4 అక్టోబర్ 2008 (UTC)