చర్చ:తెలుగు డిక్షనరీ
స్వరూపం
నాకు విక్షనరీ ఉందనే విషయము తెలియడానికి ఇతర సభ్యులను అడగ వలసి వచ్చింది.
ఈ పేజీ ని ఎవరైనా అభివృద్ది చేసి, ప్రోజెక్టు గా మార్చి,నా లాంటి నూతన సభ్యులు అనువాదము నుండి జంకకుండా ఉత్సాహ పరిచే విధముగా, వికిపేడియా మొదటి పేజీలో పరిచయము(బ్యానర్) ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
కొత్త వ్యాసము వ్రాసేటప్పుడు చాలా అనువదించవలసి న పదాలు దొరుకుతాయి. వాటిని ఇక్కడ చేరిస్తే కొత్త అనువాదకులను కూడా సంపాదించవచ్చును. --పిఢరా 12:20, 25 ఫిబ్రవరి 2007 (UTC)
చాలా మంచి ఆలోచన. కొన్ని ప్రశ్నలు/అభిప్రాయాలు
- ఇది default namespace లో ఉండవలసిన వ్యాసమేనా?
- ఈ వ్యాసం పేరుని 'తెలుగు డిక్షనరీ అని కాక వేరే ఏదైనా ఉంటే బాగుంటుందేమో!!!
- ఈ వ్యాసం ఎందుకు ప్రారంభించామో అన్ని గ్రూప్ లకూ మెసేజ్ పంపిస్తే బాగుంటుందేమో!!
--నవీన్ 13:11, 25 ఫిబ్రవరి 2007 (UTC)
- నవీన్ గారూ, నేను వికిపీడియా కు కొత్త.Your suggestions are good. Please feel free to modify and distribute this essay as you like. thank you. --పిఢరా 14:01, 25 ఫిబ్రవరి 2007 (UTC)
- ఇంతకు ముందు ఈ విషయమై చదువరిగారు కొంత కృషి చేశారు అనుకొంటాను. కాని వివరాలు నాకు గుర్తు లేవు. ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని కొనసాగించండి. పేరు మార్పిడి, పునర్వ్యవస్థీకరణ వగైరాలు తరువాత చూసుకొందాము. --కాసుబాబు 04:41, 26 ఫిబ్రవరి 2007 (UTC)
- కాసుబాబు గారు అన్నట్టు ఇప్పుడు మొదలుపెడితే తర్వాత వ్యవస్థీకరించొచ్చు. ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి మొదటిపేజీలో బ్యానరుగా పెట్టడం మంచి ఆలోచన. చదువరి ఒక గ్లాసరీ లాంటి దానిమీద కృషి చేసినట్టు గుర్తు..ఇదివరకు నేను ఇదే ఆలోచనతో రచ్చబండలో అనువాదాలు అన్న విభాగం ప్రారంభంచాను. ఇలా జరిగిన అన్ని ప్రయత్నాలను గుదిగుచ్చి ఒక ప్రాజెక్టుగా తయారు చేద్దాం. ఇక ఇది ప్రాజెక్టు లేదా పోర్టల్/పందిరి నేంస్పేసులో ఉండాల్సిన వ్యాసం. మంచి పేరు తోచితే దీన్ని తుడిచివెయ్యకుండా దారిమార్పు చేద్దాం. --వైఙాసత్య 16:34, 26 ఫిబ్రవరి 2007 (UTC)
- అవునవును, వికీలో వచ్చే సాంకేతికపదాలన్నిటినీ ఒకచోట - వికీపీడియా:Glossary - చేర్చారు. నేను వాటిలో కొన్నిటిని అనువదించాను. ఇంకా బోలెడు మిగిలి ఉన్నాయి. మనం ముందు దాని సంగతి చూడొచ్చు. __చదువరి (చర్చ, రచనలు) 03:21, 27 ఫిబ్రవరి 2007 (UTC)
- అయితే ఇది వికీపీడియాలో వాడే పదాల కోశం మాత్రమే. వికీపీడియా నేముస్పేసులో ఉంచదగినది ఈ పదకోశం. __చదువరి (చర్చ, రచనలు) 03:37, 27 ఫిబ్రవరి 2007 (UTC)
- అవునవును, వికీలో వచ్చే సాంకేతికపదాలన్నిటినీ ఒకచోట - వికీపీడియా:Glossary - చేర్చారు. నేను వాటిలో కొన్నిటిని అనువదించాను. ఇంకా బోలెడు మిగిలి ఉన్నాయి. మనం ముందు దాని సంగతి చూడొచ్చు. __చదువరి (చర్చ, రచనలు) 03:21, 27 ఫిబ్రవరి 2007 (UTC)
- విక్షనరీ వికీపీడియాకి అనుబంధము కాబట్టి దానినే ఉపయోగించుదాం. -- అర్జున 22:38, 22 సెప్టెంబర్ 2010 (UTC)